కవిత్వం

మెత్తని ఈటె

అక్టోబర్ 2013

నల్లమట్టిలో
కరిగిపోతున్న
మెత్తని ఎర్ర గులాబీ రేకుల మధ్య
ఓ తల్లి పిచ్చుక
తియ్యని పాట ఈటెనొకదాన్ని
నా దిగుల్లలోకి విసిరి
అల్లంత దూరంలో
గుబురాకుల్లోని
తన చిట్టి పాపాయికోసం
ఇంకొక్క పురుగును
ముక్కున కరుచుకుని
తుర్రుమంది.

నాకన్రెప్పలపై
చివరి తడిలో
మెరిసాయి
వేయి ఇంధ్రధనుస్సులు.