పాయలుగా సాగే నది అలల మధ్య
తడి అంటని పాదాల పయనం
రాగ దీపాల మధ్య ద్వీపమేదో
వడగాలి తాకిడికి ఎగసి పడుతూ
కూలుతున్న స్వప్న సౌధాల ధూళిలో
తుంపరగా మంచు చినుకు బొమ్మ కడుతూ
మోహం లేని మోహనా మోహనా
నీ ముందు మోకరిల్లి జ్వలించే జ్వాలల మధ్య రాజుకుంటూ
ఈ వెన్నెలని దహించే కార్చిచ్చు
మేఘమేదో అల్లుకుంటూ రాలిపోనీ
ఎపుడు రాసినట్టే అందంగా ఉంది సర్ జీ కాని ఎక్కడో మీ మార్క్ మిస్సింగ్
అప్పుడప్పుడు మార్క్ పోగొట్టుకోవడమే బాగుంటుంది కదా నిశీజి.. ధన్యవాదాలు..
ఎత్తుగడ నుంచీ చివరి వాక్యం దాకా భావుకత్వపు అలజడి కనిపించినా అర్ధోక్తిలో ఆపేసారా అనిపించింది వర్మా! ఇంకొంచెం ఊట ఊరాల్సింది.
అసంపుర్ణత్వం వెంటాడుతూ ఇలా.. ధన్యవాదాలు వాసుదేవ్ సార్..