సంపాదకీయం

వాకిలి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

జనవరి 2016

రిగ్గా మూడేళ్ల క్రితం ఒక అందమైన కలతో పుట్టిన వాకిలి ఈరోజు సగర్వంగా 36 సాహిత్యపుటడుగులు వేసి మీ ముందు నిలబడింది. పాఠకరచయిత(త్రు)ల ఆదరణవల్లే వాకిలి ఈ మూడేళ్ల మైలురాయి అనాయాసంగా దాటగల్గింది. మీరు పంచిన ప్రేమ, మీనుంచి లభించిన స్పందన, మీ ప్రోత్సాహం కారణంగానే ఈరోజు వాకిలి ఇలా విస్తరించింది.

మాకు తెలీకుండా పత్రిక నిర్వహణలో ఏవైనా చిన్నచిన్న పొరపాట్లు, ప్రచురణల్లో నిర్లక్ష్యాలు దొర్లి ఉండవచ్చు, అప్పుడప్పుడు పాఠకుల మనోభావాలు దెబ్బతీసే రచనలూ ప్రచురించి ఉండవచ్చు. ఈ సందర్భాలన్నింట్లో మమ్ముల్ని అర్ధం చేసుకుంటూ, మాతో పేచీ పడుతూ, రాజీకొస్తూ… మళ్ళీ నెల తిరగ్గానే అన్నీ మరిచిపోయి వాకిలిని ఇష్టంగా తెరిచి చూస్తూ ఎంతో ప్రోత్సాహం ఇస్తున్న పాఠకులకి-

సంపాదకత్వనిర్వహణలో ఒక్కోసారి రచనలను తిప్పి పంపినా, మార్పులు చేసి పంపమని అడిగి రచయితల మనసులు నొప్పించినా, మమ్ముల్ని అర్థం చేసుకుని సహకరిస్తున్న తోటి రచయితలకు-

మీకందరికీ ధన్యవాదాలు!

వాకిలిని తమ స్వంత పత్రికలా భావించి అడిగినప్పుడల్లా మాకు సహాయం చేస్తున్న చంద్ర కన్నెగంటి, ఎలనాగ గార్లకు-

వాకిలికి నెలనెలా కాలమ్స్ రాస్తున్న కుప్పిలి పద్మ, మైథిలి, కర్లపాలెం హనుమంత రావు, కోడూరి విజయ్, మమత గార్లకు-

కథలకి illustrations వేస్తున్న జావేద్, అన్వర్ గార్లకు-

నెలనెలా కవర్ పేజీకోసం ఫోటో అందిస్తున్న కృష్ణమోహన్(KMG) గారికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఇప్పటివరకు ప్రచురితమైన ప్రతీ సంచికకి మేము అడిగినా, అడక్కపోయినా వాకిలి అంటే ఇష్టంతో రచనలు పంపిన రచయిత(త్రు)లందరికీ మళ్ళీ పేరు పేరునా ధన్యవాదాలు.

వాకిలికి ఇలాగే రచనలు పంపిస్తూ, మనసు విప్పి మీ అభిప్రాయాలు రాస్తూ, చర్చల్లో పాల్గొంటూ, ముందు ముందు కూడా మీరు ఇలాంటి సహకారాన్నే అందిస్తారని ఆశిస్తూ,

ఈ జనవరి ప్రత్యేకసంచికను వాకిలి రచయిత(త్రు)లకు అంకితం చేస్తూ,

నూతన సంవత్సర శుభాకాంక్షలతో,

మీ
వాకిలి సంపాదకబృందం.
రవి వీరెల్లి
స్వాతికుమారి బండ్లమూడి
స్వాతీ శ్రీపాద

**** (*) ****

(banner image credit: Anwar)