‘ ఎలనాగ ’ రచనలు

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 6

ఆగస్ట్ 2014


భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 6

[ క్రితం నెలలో ఈ వ్యాసం ద్వారా పాఠకులకు రెండు ప్రశ్నలు వేసాము. వాటిలో దేనికీ జవాబు రాలేదు. మొదటి ప్రశ్న ఈ విధంగా వుంది: తిలాపాపం అనే సమాసం / పదబంధం సరైనదేనా? అదేవిధంగా ఆరాధనభావం సరైనదా, లేక ఆరాధనాభావం కరెక్టా? అసలు రెండు పదాలతో ఒక సమాసాన్ని తయారు చేసేటప్పుడు మొదటి పదంలోని చివరి అక్షరానికి యెప్పుడు దీర్ఘం వస్తుంది, యెప్పుడు రాదు? దీనికి జవాబేమిటంటే, తిలాపాపం తప్పు, తిలపాపం సరైనది. ఒక సమాసం కోసం రెండు పదాలను వాడుతున్నప్పుడు, పూర్వపదం (మొదటి పదం) స్త్రీలింగమైనప్పుడు దాని చివరి అక్షరానికి దీర్ఘం వస్తుంది. అది పుంలింగమైతే దీర్ఘం రాదు. ఆ పదం ఒకవేళ…
పూర్తిగా »

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 5

జూలై 2014


భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 5

రమేష్ కుమార్, సురేష్ రెడ్డి. పేర్లను కొందరు ఇలా రాసుకోవటం అరుదేం కాదు. కాని అవి తప్పులు. ఎందుకంటే ఆ పేర్లలోని ఉత్తర పదాలు ‘ఈశుడు’కు చెందినవి.
రమ + ఈశుడు = రమేశుడు. సుర + ఈశుడు = సురేశుడు. కనుక రమేశ్, సురేశ్ అని రాయటమే సవ్యమైనది. అదేవిధంగా కొందరు లతా మంగేష్కర్ అని తప్పుగా రాస్తారు. లతా మంగేశ్కర్ అనేదే రైటు. చలామణిలో ఉన్నంత మాత్రాన పదాలు తప్పులు కాకుండా పోవు! ‘చెలామణి’ అటువంటిదే! చలామణీ, చలావణీ కూడా సరైనవే అని ప్రామాణిక నిఘంటువుల్లో చెప్పబడింది. చెండాలము, చెంద్రుడు, చెరించు అని కూడా రాస్తారు చాలా మంది. ఇవన్నీ తప్పులే. ‘చె’…
పూర్తిగా »

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 4

జూన్ 2014


భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 4


ఒక మాస్టారు విద్యార్థితో “ఒరేయ్, సరైన ఉచ్ఛారణ నేర్చుకోరా” అన్నాడనుకోండి. అప్పుడు ఆ మాస్టారుకే సరైన ఉచ్చారణ తెలియదనుకోవాలి. ఉచ్చారణను ఉచ్ఛారణ అని తప్పుగా ఉచ్చరించటం చాలా మంది విద్యాధికులు చేసే పొరపాటు (పొరబాటు కాదు). ఆంగ్లంలో కూడా ఈ ఉచ్చారణ అన్న పదానికి సంబంధించిన సరైన ఉచ్చారణ తెలియక చాలా మంది పప్పులో కాలు వేస్తుంటారు. ఉచ్చరించటంను ఆంగ్లంలో ప్రొనౌన్స్ (Pronounce) అంటాము. కాని ఉచ్చారణను మాత్రం ప్రొనౌన్సియేషన్ (Pronounciation) అనకూడదు, ప్రొనన్సియేషన్ (Pronunciation) అనాలి.

కొన్ని పదాలను కొందరు సరిగ్గానే రాస్తారు కాని వాటిని ఉచ్చరించటం లోనే పొరపాటు చేస్తారు. ‘విద్యార్థులు’కు బదులు విధ్యార్థులు అని ఉచ్చరిస్తారు. అదేవిధంగా ‘అధ్యాపకులు’కు…
పూర్తిగా »

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 3

మే 2014


భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 3


కొన్నిసార్లు సవర్ణ దీర్ఘ సంధికి బదులు గుణసంధి అయిన పదాలను తప్పుగా వాడటం జరుగుతుంది.
ఉదా: భానోదయము. ఇది తప్పు. భాను + ఉదయము = భానూదయము అవుతుంది. అదేవిధంగా గురు + ఉత్తముడు = గురూత్తముడు (గురోత్తముడు కాదు). కాని చాముండీశ్వరి తప్పు. చాముండేశ్వరి అనేదే సరైన పదం. పార్వతికి ఉన్న పేర్లలో చాముండ ఒకటి (చాముండి కాదు). కనుక చాముండ + ఈశ్వరి = చాముండేశ్వరి అవుతుంది. ఇది గుణసంధి. శనిదేవుణ్ని శనీశ్వరుడు అనటం సరి కాదు. శనైశ్చరుడు అనటమే సరైనది. వ్యాకరణపరంగా శని + ఈశ్వరుడు = శనీశ్వరుడు (సవర్ణదీర్ఘ సంధి) సరైనదే. కాని శనైశ్చరుడు అన్న…
పూర్తిగా »

రంజకం (అష్ట పది)

ఏప్రిల్ 2014


గానం గంగ
రాగం తెప్ప
స్వరాలు వరాలు
ప్రయాణం ప్రమోదకరం

(అష్ట పది= ఎనిమిది పదాలను కలిగినది)

Delectation

Song is the Ganges
Raga is a raft
Notes are boons
And journey is joyful

(Translated by Elanaaga)

March 22, 2014 10:30 AM
(జయభేరి మొదటి భాగం – కవిత 9)


పూర్తిగా »

జయభేరి మొదటి భాగం – కవితలు

జయభేరి మొదటి భాగం – కవితలు

రేపటి తరానికి.. -స్వాతీ శ్రీపాద

రైనా బీతి జాయే …!! – సాయి పద్మ

ఈ ఒక్క రాత్రి గడవనీ -రామినేని తులసి

దేహ ఉగాది -సాయి పద్మ

ప్రవాస కోకిల – నాగరాజు రామస్వామి

ఎన్నెన్ని వసంతాలో.. ఇంకెన్నెన్ని అందాలో… -క్రాంతికుమార్ మలినేని

వసంతుడొస్తాడు…తెల్లారగనే! -శ్రీనివాస్ వాసుదేవ్

అమ్మలు – నిషిగంధ

రంజకం (అష్ట పది) – ఎలనాగ

 


పూర్తిగా »

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 2

ఏప్రిల్ 2014


భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 2

ఆచారాలను పాటించక తాగుడు వంటి దురలవాట్లకు బానిస అయినవాణ్ని కొందరు భ్రష్ఠుడు అనడం కద్దు. కాని ఆ పదం తప్పు. భ్రష్టుడు అన్నదే సరైన పదం. కాని కుటుంబంలోని పెద్ద కొడుకును జ్యేష్ఠుడు, మేలిమి పొందినవాణ్ని శ్రేష్ఠుడు అనటమే రైటు. జ్యేష్టుడు, శ్రేష్టుడు అనేవి తప్పు పదాలు. “కొడవటిగంటి కుటుంబరావు గారి వాక్య నిర్మాణంలో నిర్దిష్ఠత ఉంటుంది” అని ఒక సాహిత్యసభలో ఎవరైనా చదివారనుకోండి. ఆ వాక్యంలో భాషాదోషం ఉన్న విషయాన్ని గుర్తు పట్టాలి మనం. నిర్దిష్టతకు బదులు నిర్దిష్ఠత అని రాయటం మరి భాషాదోషమే కదా. కొందరు నిర్దుష్టత అని రాస్తారు. అది కూడా తప్పే అని గ్రహించాలి.

‘ఠ’ వత్తుకు బదులు ‘ట’…
పూర్తిగా »

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 1

మార్చి 2014


భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 1

తెలుగు భాషాప్రయోగంలో అత్యంత ప్రవీణులం, నిష్ణాతులం అయితే తప్ప మనం రాసే, మాట్లాడే భాష పూర్తి దోషరహితంగా ఉండే అవకాశం లేదు. అయితే భాష బాగా తెలిసినవాళ్లు రాసేదాంట్లో, మాట్లాడే దాంట్లో స్ఖాలిత్యాలు (తప్పులు) చాలా తక్కువగా ఉండి, భాష సరిగ్గా రానివాళ్లు రాసేదాంట్లో ఎక్కువ తప్పులుండటం మనం సాధారణంగా గమనించ గలిగే విషయం. పాఠకులు తమ తెలుగు భాషను మెరుగు పరచుకోవటానికి ఉపయుక్తంగా ఉండేలా నెలనెలా కొన్ని ఉదాహరణల సహాయంతో విశదపరచటమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశం. మనం ఉపయోగించే భాష సాధారణ సందర్భాల్లో శిష్టముగా ఉండటం అవసరం. దీన్నే శిష్ట వ్యావహారికం/శిష్ట వ్యవహారికం అంటున్నాము. అది గ్రాంథికమై ఉండాలన్న నియమం లేదు. అయితే…
పూర్తిగా »

నేను, అనుభవాన్ని, మాట్లాడుతున్నా

ఫిబ్రవరి-2014


నేను, అనుభవాన్ని, మాట్లాడుతున్నా

1. నా గదిలో నివసించే వాళ్లు

నా డబ్బాను నేనే కొట్టుకోవాలా లేక వేరేవాళ్లు కొట్టాలా అన్నది యిక్కడి ప్రశ్న. నా డబ్బా కొట్టే వాడు మూర్ఖంగా నన్ను వదిలి వెళ్లాడనేది దురదృష్టకరమైన విషయమే అయినా అది వాస్తవం. అతనికి జీతం తక్కువై కాదుగాని, ఆక్రా నగర జీవితపు కోలాహలం నడుమ బలమైన చప్పట్లతో, కేరింతలతో నా డబ్బా శబ్దాన్ని వినపడేట్టు చేయలేకపోయాడతడు. ఇక అతడు లేని ఈ సమయంలో నాకిష్టమున్నా లేకకపోయినా బలహీనంగానైనా నా డబ్బాను నేనే కొట్టుకోవాలి మరి.

ముందు నా గురించిన పరిచయంలో నేను వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కొనేవాడిననీ, అమర్యాద చూపేటంత నిర్మొహమాటస్థుడిననీ చెప్పాలి. పొట్టిగా వుంటే లాభమనుకున్నప్పుడు ఎంతో పొట్టిగా,…
పూర్తిగా »

అనంతాక్షర సౌరభాల గనులు

జనవరి 2014


అనంతాక్షర సౌరభాల గనులు

పుస్తకమే నయం
కుమిలిపోయిన ఆత్మల మీద
ప్రేమతో కాస్త ప్రమోదరశ్మిని
సుఖాన్ని ప్రతుష్టిని చల్లుతుంది
ఈ ఆస్తిని యెప్పుడూ
మన గృహాంతర సంపద
చేయగల్గినామా
స్తిమితం అనేది
మన మానసవీధిని
కమ్మటం నిజం

అక్షరమే అనంత నిధి
ఆ యెరుకే
వొక సాటి లేని భాగ్యం
క్షితిపై మనీష
తన కాంతిని పూసిన
సాధనం యిదే
సాక్షరుడైనవాడి మనసంత
వసంత విరాజితం!
అనంతాక్షర
సౌరభాల గనులైన
కితాబుల మైత్రి ఓ వరం

(ఇవి పూర్తిగా ఛందోబద్ధమైన పద్యాలు. ఉత్పలమాలలు)


పూర్తిగా »