‘ ఎస్. నారాయణస్వామి ’ రచనలు

అమెరికాతో మాట్లాడుతున్న తెలుగు కథ

అమెరికాతో మాట్లాడుతున్న తెలుగు కథ

నేను అమెరికా రావడం వల్లనే కలం పట్టి రచయితనయ్యాను. ఆ పట్టడమే అమెరికాలో ఉన్న తెలుగు వారి కథ మిగతా తెలుగువారి కథలకన్నా విభిన్నమైనది, వారి కథల్ని వారే చెప్పుకోవాలి అనే స్పృహతో కలం పట్టాను. సుమారుగా గత ఇరవయ్యేళ్ళల్లోనూ నేను రాసిన కథల సంగతి అలా ఉంచితే, ఇతర రచయితల కథలు చదవడమూ, ఆయా రచయితలతో జరుపుతున్న సంభాషణలూ, నాకు చాలా ఉత్తేజాన్నిస్తూ వస్తున్నాయి. వీరందరూ కూడా తాము ఇక్కడీ జీవితంలో చూస్తున్న అనుభవిస్తున్న దర్శిస్తున్న ఆయా జీవన వైవిధ్యాలను తమ కథల్లో చిత్రించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంచేత నా మొట్టమొదటి అనుకోలు – అమెరికా తెలుగు వారి కథలకి ఒక ప్రత్యేకత…
పూర్తిగా »

మానససరోవరాల మథనం విముక్త

ఫిబ్రవరి 2016


మానససరోవరాల మథనం విముక్త

వోల్గా రచనలు బహుశా ఇరవయ్యేళ్ళుగా పరిచయం. వారిని నేరుగా కలిసింది బహుశా 2002లో, హైదరాబాదులో వారి అస్మిత కార్యాలయంలో. ముఖాముఖంగా కలిసింది అప్పుడే అయినా సాహితీ బంధువులందరికీ ఉండే ఒక అవగాహనతో స్నేహంతో చాలా సేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నేను మళ్ళీ అమెరికా తిరిగి వచ్చిన తరవాత కూడా కొత్తగా వోల్గా కలంనించి వెలువడే కథల్ని ఆసక్తిగా గమనిస్తూనే ఉన్నాను. వోల్గా కథల సంపుటి విముక్త కి కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి వచ్చిందని తెలిసి ఆనందమయింది.

వోల్గా మొదటినించీ కూడా స్త్రీవాద ప్రేరణతో, ఆ స్పృహతోనే రచన చేస్తూ వస్తున్నారు. స్త్రీలకి సాధారణంగా వ్యవస్థాగతంగా ఎదురయ్యే నిర్బంధాలు, కష్టాలు, వాటికి పరిష్కారాలు,…
పూర్తిగా »

తూకానికి రెండు కథలు

ఈ కథలో చాలా మంచి మెసేజి పెట్టాను, ఒకసారి చూడండి అని ఒక రచయిత మిత్రుడి మెయిలు. తరవాతెప్పుడో ఆ కథని ఒక జాలపత్రికలో ప్రకటించారు. అక్కడ “మెసేజి ఇవ్వాలని కథలు రాస్తూ ఉంటే ఇలాంటి కథలే వస్తాయి,” అని మరో రచయిత మిత్రుడి పుల్ల విరుపు వ్యాఖ్య. తరవాత ఆయనతో జరిపిన పరస్పర సంభాషణలో “మెసేజి ఇవ్వాలనుకుంటే వ్యాసం రాసుకోవాలి గానీ కథ రాయడం ఎందుకు?” అన్నారాయన. అంతే కాదు, “మంచి కథ జీవితాన్ని ప్రతిబింబించాలి.” అని కూడా చాలా ఘట్టిగా అభిప్రాయ పడ్డారాయన.తెలుగు కథా రచయితల్లో చాలా మందికి కథలో ఏదో ఒక సందేశం ఉండాలి అనే ఉద్దేశం ఉన్నది. ఊరికే ఉండడం…
పూర్తిగా »

మనసారా మాట్లాడుకుందాం రండి..

ఎన్నెన్ని పత్రికలు, కాగితాలమీదనూ, కంప్యూటరు తెరలమీదనూ?

మళ్ళీ సరికొత్తగా ఇంకో పత్రిక అవసరమా?

ఇంతకు మునుపే ఒకరు చేసేసిన ఘనకార్యం దేన్నైనా మళ్ళీ మనం కొత్తగా మొదలు పెట్టినప్పుడు ఎవరైనా అడిగే ప్రశ్నే ఇది. ఆ ఘనకార్యం నిజంగా ఘనమైనదే అయితే ఈ ప్రశ్నకు తగినంత తృప్తికరమైన సమాధానం ఇచ్చుకోవాలి కూడాను. వాల్మీకి రామాయణం రాసేశాడని విశ్వనాథ రాయకుండా ఊరుకున్నాడా? “మరల నిదేల రామాయణం బన్నచో ..” అంటూ తన కారణాలు వరస పెట్టి చెప్పి మరీ కల్పవృక్షానికి బీజం వేశాడు. సవాలక్ష పత్రికలున్నాయని చెప్పి ఇంకో పత్రిక మొదలు పెట్టకుండా ఊరుకోవాలా? అందులోనూ ఒక మంచి పత్రిక అవసరం ఉందని కచ్చితంగా మనకి తెలిసినప్పుడు?

రెండేళ్ళ…
పూర్తిగా »

డయాస్పోరా రచయితలతో ముఖాముఖి – మొదటి భాగం

డయాస్పోరా రచయితలతో ముఖాముఖి – మొదటి భాగం

డయాస్పోరా రచయితల అనుభవాలను ఒక కూర్పుగా చేసి ఆటా సావనీర్లో వేద్దామనే ఉద్దేశంతో రచయితలకు ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలకు ఆయా రచయితలు చెప్పిన సమాధానాలు, వారి అనుభవాలు ఇక్కడ మీకోసం (ఆటా వారి అనుమతితో):
ప్రశ్నలు:

1. డయాస్పోరా రచయితగా మీరు చేసిన రచనలు, మీరు పడ్డ ఇబ్బందులు, మీ సాహిత్య ధోరణిలో/గమ్యంలో వచ్చిన మార్పుల గురించి చెప్పండి? ప్రవాసదేశంలో మీరు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల్ని ఎంతవరకు సాహిత్యీకరించగలుగుతున్నారు?

2. అమెరికాలో మీరు భిన్న దేశాల సాహిత్యాలు చదువుతుంటారు కదా! అవి చదువుతున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఒక రచయితగా అంతర్జాతీయ పటం మీద మీరు ఎక్కడ ఉన్నారనుకుంటారు?


పూర్తిగా »

కారు పున్నమి

కారు పున్నమి

మెమోరియల్ డే వీకెండుకి అభినవ్ ని చూసుకునేది నావంతొచ్చింది. స్లీపింగ్ బేర్ డూన్స్ చూడ్డానికి వెళ్దామని ప్లాన్ చేశాను. ఈ సారి ట్రిప్ అంతా, ఎక్కడా ఏ ఒడిదుడుకులు రాకుండా రిజర్వేషన్లూ, అక్కడికెళ్ళాక ఏ పూట ఏమేమి చెయ్యాలీ అన్నీ జాగ్రత్తగా తయారు చేశాను, మధ్య మధ్యలో అభినవ్ ని కూడా వాడి ఇష్టాయిష్టాలు కనుక్కుంటూ. వాడికీ పన్నెండేళ్ళొచ్చాయిగా. తనే అన్నాడు, హైకింగ్ చేద్దామని.

వాళ్ళమ్మ శుక్రవారం ఎప్పుడైనా వచ్చి వాణ్ణి పిక్ చేసుకోమన్నది . అసలు శుక్రవారం శలవ తీసుకుందామని ప్రయత్నించాను కానీ క్లయంట్ స్టేటస్ మీటింగుకి నేను లేకుండా కుదరదని బాసు పట్టు పట్టాడు. అంత ముఖ్యమైన మీటింగు సరిగ్గా లాంగ్ వీకెండుకి…
పూర్తిగా »

అమెరికాలో తెలుగు డయాస్పోరా నేపథ్యంలో నా కథలు

అమెరికాలో తెలుగు డయాస్పోరా నేపథ్యంలో నా కథలు

చిన్నప్పటి నించీ కథలంటే ఇష్టం, చదవటమంటే  ఇష్టం. కథలు చెప్పడం కూడా ఇష్టమే. అయితే రాయాలి అనే కోరిక కలగలేదెప్పుడూ. సాహిత్యం అంటే ఒక కథనో నవలనో చదివి పడేసెయ్యడం కాదు, ఆలోచింపచేసే సాహిత్యం ఉన్నది, ఆస్వాదించాల్సిన సాహిత్యం ఉన్నది అని మొదటిసారి గ్రహింపుకి వచ్చింది వరంగల్లో ఇంజనీరింగ చదవడానికి ఆర్యీసీలో చేరినప్పుడు. రావిశాస్త్రి, కుటుంబరావు, బుచ్చిబాబు వంటి పేర్లు అప్పుడే పరిచయమయ్యాయి. ఆ తరవాత బాపట్లలో ఒక సంవత్సరం పాటు లెక్చరర్ ఉద్యోగం చేసినప్పుడు పరబ్రహ్మం అని నా రూమ్మేట్. అతను మంచి సాహిత్య పరిజ్ఞానం ఉన్న కుటుంబం నించి వచ్చాడు. అతనితో చర్చలు నా సాహిత్యాభిరుచికి పదును పెట్టాయి. అటుపైన రెండేళ్ళు కాన్పూరు…
పూర్తిగా »