‘ మైథిలి అబ్బరాజు ’ రచనలు

నిలబెడుతూన్న గోడ

నిలబెడుతూన్న గోడ

విడిగా ఉండటం సౌకర్యమో ఏకాకితనమో -
గోడ లు కావాలో వద్దో – ఎల్లప్పుడూనో అప్పుడప్పుడూనో,
ఎవరట ఇదమిద్ధమనగలది!

దేశ కాల దేహ పాత్ర ధర్మాలు ప్రతిదానికీ వర్తిస్తాయన్నమాట అలా ఉంచితే, ఘనీభవించిన సమయ సందర్భాలలో కవి చేసిన చింతన ఈ పద్యం.

ఎప్పట్లాగే, ప్రశ్నలు. కొన్నేసి మటుకే జవాబులు. రెంటికీ అవతల పనిచేసేసహజ స్ఫురణ, లీలగా చదువరికి అందనిస్తూ. దాన్ని తెలుసుకోకపోతేనూ , తెలుసుకోదలచకపోతేనూ కూడా ఏమీ ఇబ్బంది లేదు – అలాగ సమాధానపడే పరిస్థితినీ ఆవైపున కల్పించి అట్టేపెడతారు.

తానే చెప్పుకున్న mischief అది.

Robert Frost పద్యాలలో చాలా – ఇటువంటి ‘గాథ’ లు. మరొక విశేషణం తట్టదు…
పూర్తిగా »

దివ్యాలోకనం

దివ్యాలోకనం

ప్రతీదీ పక్కదానితో సంధానమైన జాలం ఇదంతా అన్న స్పృహ రావటం , విశ్వపు లయకి వీలైనంత దగ్గరగా వెళ్ళగలగటం - స్తిమితం. మెలకువలోంచి నిద్రలోకి జారే ఆ కాసిని క్షణాలలో గొప్పగా సేదదీరుతామని శాస్త్రజ్ఞులు అంటారు.అక్కడొకింత నిలవగలగటం ముక్తులయేందుకు మొదలని తత్వజ్ఞులు. ఏమాలోచిస్తాము అప్పుడు? ఏవేవో. కలిసిపోయి. అర్థం లేదనిపించేవి. అర్థాలు తెలుసుకోవటం మొదలుపెట్టటం తేలిక, మర్చిపోవటం దాదాపు అసాధ్యం. మొత్తాన్నీ ఒక్క కొనసాగే స్రవంతి గా చూడగలగటం జ్ఞానపు ఒక నిర్వచనం.
పూర్తిగా »

సుధా వృష్టి

సుధా వృష్టి

శ్రావణం అయిపోయింది. భాద్రపదమూ సగపడింది. ఎక్కడా తడిగాలి పొడ కూడా లేదు. అప్పుడే సూర్యుడు బాగా నెత్తి మీదికి వచ్చేశాడు, అంతటి ఆకాశం లో ఆయనొక్కడే. మొగమాటానికి కూడా ఒక్క మబ్బు పింజ లేదు. ఆ పూటకి అక్కడి గంజికేంద్రాన్ని మూశాక, ఒక్కొక్క మెట్టే ఎక్కి వెళుతున్నాడు ఎట్టయాపురం ప్రభువు. ఆపూట ఎక్కడా నిలుచోబుద్ధి కావటం లేదు. సరాసరి మూడంతస్తులూ ఎక్కి చంద్రశాల అనబడే మేడ మీది ఆరుబయటికి వెళ్ళి ఆగాడు. తలెత్తి ఒక్కడే ఆ ఎర్రటి ఎండలోకి చూస్తూ కొద్ది ఘడియల సేపు.
పూర్తిగా »

రాజ్ఞి- చివరి [ పదిహేడవ ] భాగం

రాజ్ఞి- చివరి [ పదిహేడవ ] భాగం

వెనక్కి ప్రయాణించేప్పుడు అన్ని గుహలని దాటటమూ సులువు గానే జరిగింది గాని బోర్లించిన గరాటు లాగా ఉన్న దానిలో – పైకి ఎక్కటం దాదాపు అసాధ్యమైంది. సహజం గానే ఆ వాలు వెంట దిగటం కన్నా ఎక్కటం చాలా కష్టం కదా. పైగా మేమున్న స్థితిలో దారీ సరిగ్గా గుర్తు లేకపోయింది. వచ్చేప్పుడు ఆ రాళ్ళూ రప్పలకి ఏవో బండ గుర్తులు పెట్టుకున్నాను గనుక మెల్లిగా గుర్తు చేసుకున్నాను. లేదంటే ఆ అగ్నిపర్వతగర్భం లో దిక్కు తోచక తిరిగి తిరిగి నిస్పృహ తో చచ్చిపోయి ఉండేవారం. అప్పటికీ చాలాసార్లు దారి తప్పాము , ఒకసారైతే పెద్ద నెరియ లోంచి పడిపోబోయాము కూడా. ఆ చిమ్మ…
పూర్తిగా »

రాజ్ఞి – పదహారవ భాగం

రాజ్ఞి – పదహారవ భాగం


[సెప్టెంబర్ నెల సంచిక తరువాయి]

భయం తో వణికిపోతూ ఆయేషా చేయి పట్టుకుని ఆ అగడ్త ని దాటుతున్నాను – కనీసం అలా అనుకున్నాను, కాని కాళ్ళకి నేల తగల్లేదు .

” పడిపోతున్నాను ” – కేక పెట్టాను.

” ఏం పర్వాలేదు. ముందుకి రా, నేను చూసుకుంటాను ” – ఆయేషా.

ఆయేషా మీద నాకు అంత విశ్వాసం ఎక్కడుందని ! నా నాశనం అక్కడ రాసి పెట్టి ఉందన్నదే నా గాఢమైన నమ్మకం. కాని తప్పదు , అదొక పరీక్షా సమయం నాకు.

” కాళ్ళు కిందికి వదిలేయి ” – ఆమె అరిచింది.

అలాగే చేశాను. రెండు…
పూర్తిగా »

రాజ్ఞి – పదిహేనవభాగం (‘SHE‘ By Sir H. Rider Haggard)

సెప్టెంబర్ 2016


రాజ్ఞి – పదిహేనవభాగం (‘SHE‘ By Sir H. Rider Haggard)

ఆయేషా చెప్పిన చోటికి బయలుదేరుతున్నాము. మా సామాన్లు సర్దేందుకు ఎక్కువ శ్రమ తీసుకోలేదు. తలా ఒక జత అదనపు దుస్తులూ అదనపు బూట్ లూ. ఇవి కాక రివాల్వర్లూ  తుపాకులూ. తుపాకి మందు మాత్రం పుష్కలం గా సర్దాము – ఇదివరకటి చాలాసార్ల లాగే ఇప్పుడూ అది మా ప్రాణాలని కాపాడుకొచ్చింది.

ఆయేషా చెప్పిన సమయానికి కొద్ది నిమిషాల ముందరే ఆమె గది ముంగిట సిద్ధమయాము. ఆమె అప్పటికే పూర్తిగా సంసిద్ధురాలై ఉంది – తన  తెల్లని పల్చని దుస్తులపైన పొడుగాటి నల్లని కోటు ని నిలువునా కప్పుకుని.

” సాహస యాత్ర కి అంతా తయారేనా ? ”- అడిగింది.

” ఆ.…
పూర్తిగా »

రాజ్ఞి – పద్నాలుగవ భాగం (‘SHE‘ By Sir H. Rider Haggard)

రాజ్ఞి – పద్నాలుగవ భాగం (‘SHE‘ By Sir H. Rider Haggard)

"చూడు , రెండు వేలేళ్ళుగా ఏ చోట నిద్రపోతూ ఉన్నానో" - లియో చేతిలోంచి దీపాన్ని తీసుకుని పైకెత్తి చూపించింది. కాస్త పల్లంగా ఉన్నచోట , పొడవాటి రాతి అరుగు పైన తెల్లటి ఆచ్ఛాదన తో ఒక ఆకారం. అటువైపున - గోడ లోకి మరొక అరుగు మలచి ఉంది.

'' ఇక్కడే '' - చేత్తో చూపిస్తూ చెప్పింది ఆయేషా. '' కొన్ని తరాల నుంచి ఇక్కడే నిద్రిస్తున్నాను . నా ప్రియతముడు ఇక్కడ ఉండగా మరొక చోట ఎలా ఉంటాను రాత్రంతా ? ఆ మెట్లలాగే ఇదీ నా శరీరపు ఒత్తిడికి అరిగిపోయి ఉంది. సజీవుడి గా తిరిగి దొరికిన నా…
పూర్తిగా »

రాజ్ఞి- పదమూడవ భాగం

రాజ్ఞి- పదమూడవ భాగం

తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం నాలుగవుతోంది. లియో భోజనానికి ఆలస్యమైపోయింది - ఆదరా బాదరా అతనికి ఏదో తినిపించి పడుకోబెట్టాము , ఇంకా పూర్తి జవసత్వాలు ఎక్కడొచ్చాయి అతనికి ! సాయంత్రం ఆరు గంటలయాక, ఆయేషా - జాబ్ కి తన నీటి కూజా మహిమని చూపించే కార్యక్రమం మొదలెట్టింది. పదిహేడు మంది సంతానం లో జాబ్ ఒకడు అని తెలుసుకుని , ఆ అన్న దమ్ములూ అక్కచెల్లెళ్ళూ - అందరినీ ఆ నీటి పైన బొమ్మలు గా చూపించింది. ఎవరో కొద్ది మంది తప్ప స్పష్టం గా అగుపించలేదు - ఎందుకంటే జాబ్ కి వాళ్ళ మొహాలు సరిగ్గా గుర్తు లేవు, మర్చిపోయాడు. అతను మనసులో…
పూర్తిగా »

రాజ్ఞి – పన్నెండవభాగం (‘ SHE ‘ By Sir H.Rider Haggard)

రాజ్ఞి – పన్నెండవభాగం (‘ SHE ‘ By Sir H.Rider Haggard)

లియో తల ఒక పక్కకి ఒరిగిపోయి, నోరు కొద్దిగా తెరుచుకుని ఉంది. ఆయేషాని అతని తలను గట్టి గా పట్టుకోమని అడిగాను. ఆమె శక్తి అంతా ఏమైపోయిందో గాని, నిలువెల్లా వణికిపోతూ అతి కష్టం మీద అతని దవడలు తెరిచి పట్టుకుంది. సీసాలో ఉన్న ఏడెనిమిది చుక్కలనీ అతని గొంతులోకి వొంపాను. నైట్రికి ఆసిడ్ ని కదిలిస్తే వచ్చేట్లు , పొగలొచ్చాయి అతని నోట్లోంచి. ఆ వైద్యం పనిచేస్తుందనే ఆశ- కొంచెం కూడా నాకు లేకపోయింది.
పూర్తిగా »

రాజ్ఞి – పదకొండవ భాగం (‘She‘ by Sir H.Rider Haggard)

రాజ్ఞి – పదకొండవ భాగం (‘She‘ by Sir H.Rider Haggard)

[ ఏప్రిల్ నెల సంచిక తరువాయి ]

ఖైదీలు అందరినీ బయటికి తీసుకుపోయాక ఆయేషా చేత్తో సైగ చేసింది. గుమిగూడి ఉన్న జనమంతా గొర్రెల్లాగా వెనక్కి పాక్కుంటూ నిష్క్రమించారు. ఇక అక్కడ ఆమే, నేనూ, మూగవాళ్ళూ, కొద్ది మంది భటులూ మిగిలాము. ఆ అదను చూసుకుని లియో పరిస్థితి ఎంతమాత్రం బాగుండలేదని చెప్పి చూసేందుకు రమ్మని అడిగాను , కాని ఆయేషా కాదంది. సాయంకాలం దాకా ఆగవచ్చుననీ చీకటి పడితేనే గాని మృత్యువు చేరరాదనీ అంది. పైపెచ్చు – తాను చికిత్స చేసే ముందర వ్యాధి ని దాని క్రమం లో చివరకంటా వెళ్ళనిమ్మని కూడా . చేసేదిలేక నేను వెళ్ళబోతూ…
పూర్తిగా »