‘ విన్నకోట రవిశంకర్ ’ రచనలు

ఆదిలో ఒక పద్య పాదం

నా అభిమాన విషయం వచన కవిత్వమే గాని, ఈ వ్యాసంలో పద్య కవిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు ముచ్చటిస్తాను. తొంభైల్లో అనుకుంటా ఒకసారి పద్యం విషయంలో వచన కవులకి, పద్య కవులకి మధ్య వివాదం నడిచిన సందర్భంలో. చేకూరి రామారావు గారు ఇద్దరికీ సర్దిచెప్పబోయి, ఇరువర్గాల ఆగ్రహానికీ గురయ్యారు. అప్పుడు మిత్రులాయనకి సరదాగా “ఉభయ కవి శత్రువు” అనే బిరుదు నిచ్చారు. అందువల్ల, అటువంటి ప్రయత్నమేదీ ఇక్కడ చెయ్యటం లేదు. వచన కవుల దృష్ట్యా పద్య కవిత్వాన్ని వివరించటం, ఛందోబద్ధమైన పద్య రచనాభ్యాసం, ఆసక్తి వచన కవులకెలా ఉపయోగపడుతుందనే విషయం పరిశీంచటం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.

ఏ విద్యయినా మొదట్లో కొన్ని నియమ నిబంధనలకి లోబడి…
పూర్తిగా »

ఎవరు? ఎవరు?

పసిపాపల్ని కాగితం పడవలుగా చేసి
కాల ప్రవాహంలో వదిలి పెడుతున్నదెవరు?
అలల తాకిడికి ఉయ్యాల లూగే పడవల్ని చూసి
ఆనందంతో కేరింతలు కొడుతున్నదెవరు?

మసి పట్టిన ఆకాశానికి
ప్రతి ఉదయం వెల్లవేస్తున్నదెవరు?
నిశి పట్టిన మౌనవ్రతాన్ని
వేల పక్షి గొంతుకలతో భగ్నం చేస్తున్నదెవరు?

నిలకడలేని నన్ను
ప్రపంచమనే పదబంధ ప్రహేళికలో
ఒక నిలువు ఆధారంగా
నిలబెట్టినదెవరు?
ఎప్పటికీ ఎవరూ పూరించని విధంగా
ఈ ప్రహేళికను రూపొందించినదెవరు?

చుట్టూ వరికంకులు విరగకాస్తున్నా
ప్రతి మెతుకు మీదా పట్టుబట్టి
ఒక పేరు రాస్తున్న దెవరు?
నిండు వెలుగుల కోసంపూర్తిగా »

మిత్ర వాక్యం

మిత్ర వాక్యం

సాహిత్యం కూడా ఒక మిత్రుని వంటిదే. ఎదుటివారిని అర్థం చేసుకోవటం, వారి కష్టసుఖాలను మనవిగా అనుభవించ గలగటం అది నేర్పిస్తుంది. దైనందిన జీవితంలో మన అనుభవంలోకి రాక మరుగున పడిపోయిన అనేక సున్నితమైన అనుభూతులను సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం మనలో కలిగిస్తాయి. మంచి సాహిత్యం ఎప్పుడూ గుర్తింపు లేకుండా చీకటిలో మిగిలిపోయిన వాటిపై వెలుగును ప్రసరింపచేస్తుందన్నది కేవలం కవితా వస్తువులు, అంశాలకే పరిమితం కాదు, మన అనుభూతులకు కూడా అది వర్తిస్తుంది. పువ్వులు వాడిపోకుండా పదేపదే నీళ్ళు చల్లి వాటిని తాజాగా ఉంచినట్టు, ఎవరో పలికిన అమృత వాక్యాలు మన మనససుల్ని నవనవోన్మేషంగా ఉంచటానికి దోహద పడతాయి. ఇదే సాహిత్యానికున్న అతి పెద్ద అవసరం, దాని…
పూర్తిగా »

ఏకోన్ముఖం

సెప్టెంబర్ 2014


ఏకోన్ముఖం

వచ్చిన ఋతువులే మళ్ళీ వస్తాయి
గడచిన సంవత్సరాలు అదే పేరుతో
తిరిగి ప్రత్యక్షమవుతాయి
కాని, బ్రతుకు ఋతువులు మాత్రం తిరిగి రావు
ఒకసారి పోగొట్టుకున్న రోజులు
ఇక ఎప్పటికీ దొరకనే దొరకవు.

జీవన చక్రం
సృష్టి లక్షణమైతే కావచ్చుగాని,
జీవితం ఒక సాదాసీదా సరళరేఖ
జీవనయానం
క్రమం తప్పని కవాటాలతో
ఏకోన్ముఖంగా సాగే పరిమిత యాత్ర

భ్రమణం ఒక భ్రమ
నీకు దక్కిన కాలశకలం

ఆదీ అంతమూ కలిగిన
అతి సాధారణమైన
బల్లపరుపు నేల.

ఆశలు రాలిపోతాయి
కోరికలు మండి మండి
కొడిగట్టి పోతాయిపూర్తిగా »

కవిత్వమనేది, కవికి పాఠకునికి మధ్య జరిగే ప్రత్యేకమైన సంభాషణ

కవిత్వమనేది, కవికి పాఠకునికి మధ్య జరిగే ప్రత్యేకమైన సంభాషణ

ఏ రాజకీయాలకూ తావీయకుండా అరణ్యంలో సాగిపోయే ఒక సెలయేరు తన చుట్టూ ఏర్పడి ఉన్న ప్రకృతితో పాటూ… ప్రతి రోజూ తన వద్దకు వచ్చి దప్పిక తీర్చుకునే జంతు మరియు పక్షి జీవుల కు దాహం తీర్చడం మొదలు ఎంతో సన్నిహితంగా వాటి కదలికలు, సొగసులు, ఒక దానితో మరొకటి కలబోసుకునే కబుర్లు, పాడుకునే పాటలు, వాటి మధ్య చోటు చేసుకునే చిన్న చిన్న పొరపొచ్చాలు/పోట్లాటలు, దినదినం కనిపించే వాటిలోని వైరుధ్యాలు మున్నగు అనేక సహజ సమాజ/సందర్భ/వస్తువుల సందర్శనాన్ని తనదైన ధోరణిలో మనతో పంచుకుంటే ఎలా ఉంటుందో రవిశంకర్ గారి కవిత్వం కూడా అలా ఉంటుంది. ఏ మాయా మర్మం తెలియని బాల్యంలో మనం చేసిన…
పూర్తిగా »

తోడు

తోడు

“This was many years back …” అంటూ మొదలుపెట్టాడు కెవిన్. నేను అప్రయత్నంగా నా చేతిలో ఉన్న సెల్‌ఫోను నొక్కి టైము చూసుకున్నాను. కెవిన్ ఇలా మొదలుపెట్టాడంటే ఆ మొనోలాగ్ కనీసం ఒక గంటసేపైనా ఉంటుందని తెలుసు. అది ఎక్కువగా తన జీవితంలో జరిగిన సంఘటనలతో, ఆత్మస్తుతీ, పరనిందా కలిపి సాగుతుంది. ఇదివరకు చెప్పిన విషయాలే వందోసారో, నూట పదోసారో మళ్ళీ అంత కొత్తగానూ చెప్పబోతాడు. ఈ టీములో ఐదారేళ్ళ సర్వీసులో ఇలాంటి అనుభవం ఎన్నోసార్లు ఎదురయింది. కానీ, బాసు కదా, ఏమీ అనటానికిలేదు. దీన్నుంచి బయటపడే మార్గం ఒక్కటే .. ఆయనకైనా, నాకైనా ఫోను వస్తే, సంభాషణ తెగిపోతుంది. అక్కడినుంచి మెల్లగా జారుకోవచ్చు.…
పూర్తిగా »

ఆట

ఆట

ఆకాశం చదివేసిన పాత పుస్తకం
చంద్రుడు ఎన్నేళ్ళు వచ్చినా
అదే వేషం వేసే ముసలి కథానాయకుడు
కనుమరుగైన తారల స్థానాన్ని
మళ్ళీ అటువంటి తారలే భర్తీ చేస్తాయి
ఇరు సంధ్యలు ఒకే నృత్యాన్ని
క్రమం తప్పకుండా ప్రదర్శిస్తాయి.

రాత్రి, పగళ్ళు కలిపి కుట్టిన జలతారు వస్త్రాలు
ఋతువులు మారి మారి వచ్చే వాటి అంచులు.

చుట్టూ మంచు కప్పబడినప్పుడు
చెట్లు యోగ ముద్ర దాలుస్తాయి
అది కరిగాక అదే చెట్ల మీద
అవే పువ్వులు వలస పక్షుల్లా వచ్చి వాల్తాయి
అవే వానలు, అవే ఎండలు
అలాగే కురిసి,…
పూర్తిగా »

చివరి క్షణం వరకు ఆయన యువకుడే

చివరి క్షణం వరకు ఆయన యువకుడే

 

పుట్టుకతో వృద్ధులైన కుర్రవాళ్ళమాటేమోగాని,ఎంత వయసు వచ్చినా మరణించేవరకు యువకులుగా ఉన్న కొందరు విశిష్ట వ్యక్తుల్ని నేను చూసాను. వారిలో పెమ్మరాజు వేణుగోపాలరావుగారు ముఖ్యులు.

అటువంటి స్వభావం ఏర్పడటానికి జీవితంపై ఆయనకున్న ఆశావహమైన దృక్పధమే కారణం. ఆయనతో అనేకసార్లు జరిపిన సంభాషణల్లో ఎప్పుడూ గతంలో జరిగినదాని మీద చింత, గతమంతా గొప్పదన్న నాస్టాల్జియా, ముందేమవుతుందోనన్న ఆందోళన, ఏమీ చెయ్యలేమన్న నిస్పృహ – ఇటువంటివేవీ ఎప్పుడూ కనిపించేవికావు. విశాలమైన జీవితం, అపారమైన అవకాశాలు తన ముందు ఉన్నాయని, వాటిని సద్వినియోగ పరుచుకోవటానికి తనుచెయ్యవలసిన కృషిఏమిటనేదానిమీదే ఆయన దృష్టిఉండేది. నలభైలలో ఉన్న నాకులేని ఇటువంటి ఆశావహమైనదృష్టి,ఎనభైలకి చేరువవుతున్నఆయనకెలా ఏర్పడుతుందోఅని ఆశ్చర్యంకలిగేది. విశ్రాంతిపై ఆయనకున్న…
పూర్తిగా »