పుస్తక పరిచయం

ఎదురు చూపు

ఎదురు చూపు

రవి వీరెల్లి నలభై పైగా కవితలు ఒకే sitting లో ఏకధాటిగా చదివాను. ముందుగా కవితలన్నిటా ప్రముఖంగా,- ఆకాశం, వెన్నెల, నీరు, నది, కొండ, పచ్చదనం, చెట్లు, అతివేలమైన ప్రకృతి తాదాత్మ్యం కనిపించాయి. అన్నిటా కవి ఆత్మీయపారవశ్యాన్ని పాఠకుడిలోనికి ప్రసరింప చేయాలనే తహతహ నన్ను ఆకర్షించింది. నాకు గాడంగా ఏమనిపించిందంటే; ఇవి క్రిక్కిరిసిన అనుభవాల ప్రసారణం. ఇక్కడ సమూహం లేదు; ఉన్నవి, వ్యక్తి ఆరాటాలు, అనుభవస్పందనలే. కవి నిర్మించిన వాక్యాలకొక ప్రవాహగుణం, సున్నితమైన తాత్వికత ఉన్నాయి. ఉంటూనే, abstract images వెల్లువ కమ్ముకుంటూ కనిపిస్తుంది.
పూర్తిగా »

ఆ నేల, ఆ నీరు, ఆ గాలి (వేలూరి వేంకటేశ్వర రావు కథలు)

ఆ నేల, ఆ నీరు, ఆ గాలి (వేలూరి వేంకటేశ్వర రావు కథలు)

"అంతర్లీన ఘనీభూత సాగరాన్ని బద్దలుకొట్టే గండ్ర గొడ్డలే సాహిత్యం" అంటాడు కాఫ్కా. ఇక్కడ సాగరం అంటే ఆలోచనలు. వాటిని ముక్కలు చేయడమే సాహిత్యం చేసే పని. జీవితంలో అనుభవాలే వాటికి ఆలంబన.
పూర్తిగా »

వెంటాడే కథలు; కతల గంప – స. వెం. రమేశ్

వెంటాడే కథలు; కతల గంప – స. వెం. రమేశ్

అస్తిత్వానికి మంచి భాషా, దాన్ని వాడుకోగల సత్తా తోడయితే కథలని ఎంత కళాత్మకంగా రూపొందించవచ్చో రమేశ్ గారు చూపిస్తారు “కతలగంప” సంకలనంలో. ఈ సంకలనంలోని 18 కథలు చదివితే ఈ రచయిత చిత్రించిన కాన్వాస్ విస్తీర్ణం అర్థమవుతుంది. వస్తువు ఈ కథల్లోని జీవితాలంత అపురూపం, చిత్రణ అనన్య సాధ్యం. అస్తిత్వం ఆయువుపట్టు అవడంవల్ల నేలని వదిలి సాముచేసే కథలేవీ కనిపించవు ఇందులో. గ్రామీణ వాతావరణమూ, దాన్ని అంటిపెట్టుకుని వుండే అచ్చమైన తెలుగు భాషా ఈ కథలకి సొబగులద్దాయి. బాట చెప్పిన, చెట్లు చెప్పిన, మట్టికుండ చెప్పిన, వానజల్లు చెప్పిన, మొయిలుకు చెప్పిన కథలూ, ఆ యా కథనాలకి దీటయిన వర్ణనలూ ఈ సంకలనానికి ప్రత్యేకం.


పూర్తిగా »

మూడవ మనిషి – ఓ చీకటి దృశ్యం

అక్టోబర్ 2017


మూడవ మనిషి – ఓ చీకటి దృశ్యం

కొన్ని అపురూపాలకి కవిత్వమూ మినహాయింపు కాదు. అలాంటిదే ‘మూడవ మనిషి’ దీర్ఘ కవిత. కవితా వస్తువుని ఎంచుకోవటంలోనే కవి తన ధైర్యాన్ని చాటుకున్నాక ఇక కవితలో చదవాల్సింది చాలానే ఉండి ఉండాలి అనుకున్నా.
పూర్తిగా »

బబ్లూ గాడి బుక్ రివ్యూ

సెప్టెంబర్ 2017


బబ్లూ గాడి బుక్ రివ్యూ

నేను పుట్టానో లేదో గొల్లపూడి వాళ్ళేసిన కాశీ మజిలీ కథలు పేద్ద పేద్దవి ఆరు పుస్తకాలూ, కథా సరిత్సాగరం, రంగుల ఎన్‌సైక్లోపీడీయాలూ, ఈసఫ్ , జాతక , భేతాళ, ప్రపంచ కథలూ, రామయణ, మహా భారతాలూ , ఇంకా టాం సాయర్ లాంటి బండెడు పుస్తకాలు ఓ బీరువా నిండా పేర్చిపెట్టాడు మా నాన్న.
పూర్తిగా »

సురపురం – మెడోస్ టైలర్ ఆత్మకథ

ఆగస్ట్ 2017


సురపురం – మెడోస్ టైలర్ ఆత్మకథ

మనకిప్పుడు ఎక్కడికైనా వెళ్ళటానికి బస్సులు, రైళ్లు, విమానాలు, ఎవరితో అయినా మాట్లాడటానికి రకరకాల సమాచార వ్యవస్థలు, ఏ మూల పల్లెటూరికైనా కనీసం ఒక మట్టిరోడ్డు, మన స్థిర చరాస్తు లేవైనా కానీ వాటిమీద మన హక్కు, మనమీద ఎవరైనా దాడి చేస్తే పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఇంకో ఆలోచన లేకుండా మన జీవితంలో బాగం అయిపొయాయి. ఇవన్నీ లేని ఒకానొక కాలంలో – 1824 లో – ఇంగ్లాండు నుండి ఒక 16 ఏళ్ల కుర్రవాడు బొంబాయిలో ఈ దేశపు గడ్డ మీద అడుగుపెట్టి ఒక 36 సంవత్సరాలు ఈ దేశంలో తిరుగుతూ తను చూసిన కళ్ళతో అక్షరాల్లో అవన్నీ చూపిస్తుంటే చూడటం ఎంత…
పూర్తిగా »

‘విలియం ఫాక్‌నర్’ నవల ‘ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ’

జూలై 2017


‘విలియం ఫాక్‌నర్’ నవల ‘ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ’

ఒక రచయిత జీవితం మీద పదికి పైగా జీవిత చరిత్రలు వచ్చాయంటే ఆ రచయితలో ఎదో విశేషం ఉండి ఉండాలి. ఆనాటి సమాజాన్నీ, అక్కడి జీవితాల్నీ, తన సమకాలీనతనూ అతడు ఓ కొత్త కోణంలో ఆవిష్కరించి ఉండాలి. తన రచనల ద్వారా తన కాలపు సాహిత్య ప్రపంచాన్నే కాక తన తర్వాతి తరాల్నీ ప్రభావితం చేసి ఉండి ఉండాలి.

తన తరం రచయితల కంటే భిన్నంగా ఒక కొత్త శైలితో, శిల్పంతో ఉత్తర అమెరికన్ సాహిత్యం మీద తనదైన ముద్ర వేసిన ఆ రచయిత విలియం ఫాక్‌నర్ (1897–1962).

ఫాక్‌నర్ రచనా ప్రాభవం తన రాష్ట్రాన్నీ, దేశాన్నీ దాటి ఎన్నో వేల మైళ్ళ అవతలి…
పూర్తిగా »

స్టైన్బెక్ – ‘ గ్రేప్స్ ఆఫ్ రాత్ ‘ నవల

జూన్ 2017


స్టైన్బెక్ – ‘ గ్రేప్స్ ఆఫ్ రాత్ ‘ నవల

హైవేని క్రాస్ చేయబోతున్న తాబేలు. దాని వీపుమీదగా దొర్లిన భారీ కంటైనర్ టైర్లు. టైరు వెంటే ఎగిరిన తాబేలు వెల్లకిలా మళ్ళీ హైవే మీదే పడింది. ఇంకో వాహనం వచ్చేలోపు అది గిల గిలా కొట్టుకొని ఎలాగో మళ్ళీ బోర్లా పడి ఆ పక్కకు పాక గలిగింది.

ముప్పై పేజీల తర్వాత వచ్చే ఈ తాబేలుకీ పది పేజీలముందు పెరోల్ కింద విడుదలయ్యి ఒక్లాహోమా లోని తన స్వంత ఊరికి బయలుదేరిన టాం జోడ్ కీ ఏమిటి సంబంధం?

నాచురలిస్ట్ రచనల్లో సహజంగా కనబడే పదులకొద్దీ పేజీల వర్ణనల తర్వాత వచ్చే ఇలాంటి ఒక చిన్న ‘ఘటన ‘ కోసం నవలంతా చదవాలా అని…
పూర్తిగా »

ఆధ్యాత్మికంగా మేల్కొల్పే “Only love is real “ by Dr. Brian Weiss

ఆధ్యాత్మికంగా మేల్కొల్పే “Only love is real “ by Dr. Brian Weiss

“అంతా ప్రేమే… అంతా ప్రేమే. ఆ ప్రేమ ద్వారానే అవగాహనా శక్తి, తద్వారానే ఏర్పడే సహనం. అక్కడే… సరిగ్గా అప్పుడే సమయం ఆగిపోతుంది. అంటే అంతా వర్తమానమే అయిపోతుంది. యదార్థమే వర్తమానం. మానసికంగా భూతకాలంలోకో, భవిష్యత్తులోకో ప్రయాణించేసి అక్కడే తిరగాడుతూ ఉండటం ఎప్పటికైనా బాధనీ, అనారోగ్యాన్నీ మాత్రమే కలిగిస్తుంది. అలా మన కాలం మన చేతుల్లోంచి ఒలికిపోకుండా ఒక్క సహనం మాత్రమే ఆపగలదు.

అన్ని ప్రశ్నలకీ ప్రేమే అంతిమ సమాధానం. ప్రేమ నైరూప్యమైనది కాదు. అది నిన్ను నిర్మించి నీ ఉనికిని కాపాడే ఓ దివ్య శక్తి. అందుకే ప్రేమమయమైపో. ప్రేమని అనుభూతించు. ప్రేమని దాచుకోకుండా వ్యక్తపరుచు. ప్రేమ భయాన్ని పోగొడుతుంది. ప్రేమని అనుభూతించేటప్పుడు…
పూర్తిగా »

వ్యవస్థలోని అవకతవకలని ప్రశ్నించిన “చాగంటి సోమయాజులు కథలు”

వ్యవస్థలోని అవకతవకలని ప్రశ్నించిన “చాగంటి సోమయాజులు కథలు”

ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్న పుస్తకం అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా వారు ప్రచురించిన "చాగంటి సోమయాజులు కథలు". చాసోగా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు విశిష్ట కథకులు. వాసి కన్నా రాశి మీద దృష్టి నిలిపిన రచయిత. వస్తువు, సన్నివేశం, పాత్రల ప్రవర్తన, సంభాషణలు అన్నిటిలోనూ ఆయన చింతనా, దృక్పథం అంతర్లీనంగా వ్యక్తమవుతాయి. ధనస్వామ్యంలో ధనం ఏ విధంగా మనుషుల్ని అవినీతిపరుల్ని చేస్తుందో, మానవత్వాన్ని ఎలా నాశనం చేస్తుందో, బూర్జువా సమాజంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో సునిశితంగా పరిశీలించి పాత్రల సృష్టి చేశారు చాసో.
పూర్తిగా »