సంచిక: జనవరి 2013

అమెరికాలో తెలుగు డయాస్పోరా నేపథ్యంలో నా కథలు

జనవరి 2013 : ఆవలి తీరం


అమెరికాలో తెలుగు డయాస్పోరా నేపథ్యంలో నా కథలు

చిన్నప్పటి నించీ కథలంటే ఇష్టం, చదవటమంటే  ఇష్టం. కథలు చెప్పడం కూడా ఇష్టమే. అయితే రాయాలి అనే కోరిక కలగలేదెప్పుడూ. సాహిత్యం అంటే ఒక కథనో నవలనో చదివి పడేసెయ్యడం కాదు, ఆలోచింపచేసే సాహిత్యం ఉన్నది, ఆస్వాదించాల్సిన సాహిత్యం ఉన్నది అని మొదటిసారి గ్రహింపుకి వచ్చింది వరంగల్లో ఇంజనీరింగ చదవడానికి ఆర్యీసీలో చేరినప్పుడు. రావిశాస్త్రి, కుటుంబరావు, బుచ్చిబాబు వంటి పేర్లు అప్పుడే పరిచయమయ్యాయి. ఆ తరవాత బాపట్లలో ఒక సంవత్సరం పాటు లెక్చరర్ ఉద్యోగం చేసినప్పుడు పరబ్రహ్మం అని నా రూమ్మేట్. అతను మంచి సాహిత్య పరిజ్ఞానం ఉన్న కుటుంబం నించి వచ్చాడు. అతనితో చర్చలు నా సాహిత్యాభిరుచికి పదును పెట్టాయి. అటుపైన రెండేళ్ళు కాన్పూరు…
పూర్తిగా »

వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే!

జనవరి 2013 : ముఖాముఖం


వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే!

జగద్ధాత్రి : వేణుగోపాల్ గారు “నికషం ” రాయడానికి గల నేపధ్యం చెప్తారా ?

కాశీభట్ల వేణుగోపాల్ : నా నవలలలో రాతల్లోని పాత్రలందరూ ఎక్కడినుండో ఊహలనుండి  వచ్చిన వారు కాదు. వారందరూ ఎక్కడో ఎప్పుడో జీవితం లో తారస పడ్డవారే. నేను-చీకటి నవల లో భగవాన్లు నాకు ఒక ఆసుపత్రి ముందు పరిచయం అయిన వ్యక్తి. అందులో భగవాన్లు ని చంపేసాను. నికషం లోని అలెక్స్ భగవాన్లు పాత్రకి పొడిగింపుగా అక్షరీకరించాను.

(కాశీభట్ల వేణుగోపాల్ )

ధాత్రి  : భగవాన్లు స్ఫోటకం మచ్చలతో వికారంగా ,ఉంటాడు  అలాగే నికషం లో అలెక్స్ కి బొల్లి వ్యాధి, ఇలాంటి పాత్రలను చిత్రించడం…
పూర్తిగా »

అణువు అణువుగా

జనవరి 2013 : చలువ పందిరి


అణువు అణువుగా

మండుటెండలో తిరిగి తిరిగి దాహంతో ఉన్నప్పుడు గ్లాసుడు నీళ్ళు తాగితే ఎంత హాయిగా ఉంటుందో కొన్ని పాటలు విన్నప్పుడు అంతే హాయిగా ఉంటుంది. భాష ఏదైనా కొన్ని పాటలు వింటుంటే తెలియని ఆనందం, హాయి కలుగుతాయి మనకి. ఓ మంచి పాట మన మనసులను తాకి, వేసవిలో చల్లని పానీయం ఇచ్చినంత హాయిని ఇచ్చి మనల్ని జ్ఞాపకాల వీధుల్లో పరిగెత్తిస్తుంది. ఆనందోల్లాసాలలో డోలలాడిస్తుంది. మన మూడ్ బాలేకపొయినా ఠక్కున సరిచేసేస్తుంది. పాటలోని విచిత్రమేమిటంటే విషాదభరితమైన పాట కూడా ఒకోసారి వినటానికి హాయిగా ఉంటుంది. సాహిత్యానికి ఆ శక్తి ఉంది. అలాంటి హాయినిచ్చే కొన్ని మంచి మంచి పాటల్ని, వాటిలోని సాహిత్యాన్నీ గుర్తుచేసి, వాటి తాలూకూ చల్లదనాన్ని…
పూర్తిగా »

ఓ ఆలోచన… ఓ పదం… కొన్ని పంక్తులు

జనవరి 2013 : ఇంకో పూవు


ఓ ఆలోచన… ఓ పదం… కొన్ని పంక్తులు

కవిత్వం ఒక్కసారి పట్టుకుందంటే ఇక వదిలి పెట్టదు.
మరో లోకాలని సృష్టిస్తుంది.
మరో దృష్టిని ప్రసాదిస్తుంది.
నిజ జీవితానికి సమాంతరంగా మరో జీవితాన్ని నిర్మిస్తుంది.
మనసులో బందీ అయిన భావాల విడుదలకు మార్గాన్ని చూపిస్తుంది.
మామూలు మనుషులనుండి వేరు చేసి ఎక్కడో కూచోబెట్టి ,లేనిపోని భ్రమల్లో భ్రాంతుల్లో గిర్రున తిప్పుతూ తటాలున మళ్ళీ ఆ మనుషుల మధ్యే వదిలేసి పోతుంది.
వంట చేస్తుంటేనో,పుస్తకం చదువుకుంటుంటేనో, ఇంకేదో పని చేస్తుంటేనో లేక ఊరికే ఖాళీగా కూచుని కిటికీలోంచి చూస్తున్నా గబుక్కున ఏదో తడుతుంది.
ఓ ఆలోచన.
ఓ పదం.
కొన్ని పంక్తులు.పూర్తిగా »

మనిషితనపు ఆనవాళ్ళు, మట్టివేళ్ళు

జనవరి 2013 : సమీక్ష


మనిషితనపు ఆనవాళ్ళు, మట్టివేళ్ళు

“పత్రనేత్రాల పరిశీలనతో ప్రపంచపు
నలుదిశలూ పరికిస్తూ మెదిలినా
నాకో గమనింపు ఉంది
వేళ్ళెప్పుడు నేలలోనే ఉండాలని” (2)

“మట్టివేళ్ళు” పేరు వినగానే మొదట స్పురించే వాక్యాలివి. “మట్టివేళ్ళు” కవి కట్టాశ్రీనివాస్ మొదటి కవితా సంకలనం.మట్టిపరిమళాన్ని గుండెల్లో నింపుకొని,గమనింపునెప్పుడూ మర్చిపోకుండా,పచ్చని చెట్టుగా ఎదుగుతూ వచ్చిన  కవి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం.కాంతిని ఆవహించుకోగల శక్తితోపాటే చలించడం అతని సహజ స్వభావం.అయితే వ్యక్తిగా ఎంత పారదర్శకంగా చలిస్తాడో,కవిగాను అంతే పారదర్శకంగా చలిస్తాడతడు.

జీవితంలో నిత్యం తారసపడే సందర్భాలే కట్టా శ్రీనివాస్‌కి కవిత్వ వస్తువులు.తర్కం,తత్వం,సామాజికత,స్నేహశీలత అగుపించే సరళమైన వచనం కట్టాది.ఊహాతీత ఇమేజరీతో ఇబ్బందిపెట్టడు.అర్ధంలేని abstractని ఉపయోగించడు.కొన్నిసార్లు మనసు,కొన్నిసార్లు స్నేహం,చాలసార్లు మానవత్వం అతని కవితల్లో ప్రదర్శింపబడతాయ్. అందరికి అనుభవంలో…
పూర్తిగా »

చివరి క్షణం వరకు ఆయన యువకుడే

జనవరి 2013 : తలపోత


చివరి క్షణం వరకు ఆయన యువకుడే

 

పుట్టుకతో వృద్ధులైన కుర్రవాళ్ళమాటేమోగాని,ఎంత వయసు వచ్చినా మరణించేవరకు యువకులుగా ఉన్న కొందరు విశిష్ట వ్యక్తుల్ని నేను చూసాను. వారిలో పెమ్మరాజు వేణుగోపాలరావుగారు ముఖ్యులు.

అటువంటి స్వభావం ఏర్పడటానికి జీవితంపై ఆయనకున్న ఆశావహమైన దృక్పధమే కారణం. ఆయనతో అనేకసార్లు జరిపిన సంభాషణల్లో ఎప్పుడూ గతంలో జరిగినదాని మీద చింత, గతమంతా గొప్పదన్న నాస్టాల్జియా, ముందేమవుతుందోనన్న ఆందోళన, ఏమీ చెయ్యలేమన్న నిస్పృహ – ఇటువంటివేవీ ఎప్పుడూ కనిపించేవికావు. విశాలమైన జీవితం, అపారమైన అవకాశాలు తన ముందు ఉన్నాయని, వాటిని సద్వినియోగ పరుచుకోవటానికి తనుచెయ్యవలసిన కృషిఏమిటనేదానిమీదే ఆయన దృష్టిఉండేది. నలభైలలో ఉన్న నాకులేని ఇటువంటి ఆశావహమైనదృష్టి,ఎనభైలకి చేరువవుతున్నఆయనకెలా ఏర్పడుతుందోఅని ఆశ్చర్యంకలిగేది. విశ్రాంతిపై ఆయనకున్న…
పూర్తిగా »

పతంజలి లేని ఈ నాలుగేళ్ళు…!

జనవరి 2013 : తలపోత


పతంజలి లేని ఈ నాలుగేళ్ళు…!

పతంజలి గారు చనిపోయి రెండేళ్ళు అయిందా, మూడేళ్ళు అయిందా?  ఏదో పుస్తకం చూసో, ఫ్రెండ్ ని అదిగో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ అది ఇప్పుడు ఏమంత ముఖ్యం కాదు. ఎందుకంటే, అది doesn’t matter నాకు . ఏదైనా రాస్తున్నపుడో, రాజ్యం దాష్టీకం గా ప్రవర్తించినపుడల్లా, పోలీసులు క్త్రౌర్యంగా ప్రవర్తించినపుడల్లా, మర్యాదలకోసం పేరు కోసం ఎవరైనా నంగిరిపోయినపుడల్లా, కోర్టులు అన్యాయమైన వ్యాఖ్యలు చేసినపుడల్లా, కంపరమెత్తే పనులెవరైనా చేసినపుడల్లా   – రోజు మొత్తం మీద పతంజలి గారు గుర్తు కొచ్చే సంఘటనలు ఎన్నో.
   కొందరిని మరిచిపోవడం అసాధ్యం. జాతి జ్ఞాపకంలో, సామూహిక జ్ఞానంలో  సజీవంగా నిలిచిపోతారు. ఆ కొద్దిమందిలో పతంజలి ఒకరు.…
పూర్తిగా »

హైవే

జనవరి 2013 : కథ


ఫిబ్రవరి 6, 2012, 1.30 am

-” హలో, బహ్దూర్ పురా పోలీస్ స్టేషనా, ఇక్కడ జూ పార్క్ కాడ ఆక్సిడెంట్, స్విఫ్ట్ డిజైర్, హా, 100 స్పీడ్ ల డివైడర్ మీదెక్కి పక్కకున్న బండకు పెట్టింది, ఒక్క డ్రైవర్ తప్ప అందరు చచ్చిపోయిర్రు, 108 కా, హా, సార్, ఫోన్ చేశినం..” ఫిబ్రవరి 5, 2012, 11.30 p.m “నాన్నా తొందరగా, ఫ్లైట్ మిస్ ఔతుంది, బాంబే టు జోహాన్నెస్ బర్గ్ కన్నెక్టింగ్ ఫ్లైట్ ఉదయం ఏడింటికే..ఐనా ఇండియాలో ఎక్కడా దొరకనట్టు సౌతాఫ్రికా దాకా పోవాలా నా పెళ్ళికి, ఏంటో మీ పిచ్చిగానీ, సర్లెండి, కష్టపడండి..” “అవునా సిధ్దు, టికెట్స్ కాన్సిల్ చేద్దామైతే, నీకు…
పూర్తిగా »

ఇజాజత్

జనవరి 2013 : కాయితప్పడవ


ఇజాజత్

గుల్జార్ అంటేనే పాటల వనమాలి. 1986లో విడుదలయిన ‘ఇజాజత్” అనే మరచిపోలేని సినిమాలో మరచిపోలేని పాట ఇది.

నేను నాతో తెచ్చుకోలేని జ్ఞాపకాలు కొన్ని నీకై వదిలేశాను ప్రియా, వాటిని పదిలపరుచుకో.

నా మేలిముసుగు మాటున వుండే సిగ్గును, నీ మది దొంతరల వెనకాలె వదిలేశా, దానిని అనునయించి నీ మదిగది దాటకుండా చూసుకో.

మన అబేధ్యమైన హ్రుదయాలు కన్న కలలన్నీ కలిపి అక్కడే వదిలేశా… వాటిని నీ కనురెప్పల మాటునే పదిలంగ దాచుకుంటావ? నీ అడుగుల మాటున వేసిన అందెల సందడి లో నా మావి చిగురుల వెండి పట్టీ  వొకతి ఆ కలల రహదారులలో పడిపోయింది, నీవు మరలి వెళ్ళి…
పూర్తిగా »

శ్రీ శ్రీ దేశచరిత్రలకు పారడీ

జనవరి 2013 : 'ఫన్'డగ


ఏ సినిమా చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం?
సినీమాల చరిత్ర సమస్తం
నరపీడన పారాయణత్వం

సినిమాల చరిత్ర సమస్తం
స్టార్ హీరోల పాద సేవనం
సినిమాల చరిత్ర సమస్తం
చెంచాల వీరవిహారం

సూపర్స్టార్ పాత్ర ప్రధానం
తారాగణ అతివికారం
సినిమాల చరిత్ర సమస్తం
ప్రేక్షకులను కాల్చుకు తినడం

దర్శకుడే హీరొయిన్లచే
వ్యభిచారం చేయించాడా?
పరకాంతలు తెలుగు భామలై
సినీరంగమున ప్రసిద్ధికెక్కిరి

రాసక్రీడలు లేని చోటు టా
లీవుడ్ లో వెదకిన దొరకదు
హీరోయిన్ తడిసె వర్షమున
లేకుంటే హీరో స్వేదములో

కల్లోలిత సంసారాలు

పూర్తిగా »