సంచిక: జనవరి 2013

వసంతంలా వచ్చి వెళ్లిపోయింది ఆపా!

జనవరి 2013 : జిందగీ


వసంతంలా వచ్చి వెళ్లిపోయింది ఆపా!

మా ఇంట్లో నేను ఆరో ఆడ  సంతానం, మా  ఇంటిని చుట్టేసుకుని ఉన్న చుట్టం గరీబీ. నాకు చదువంటే చాలా ఇష్టం. అక్కల చదువులు  అలీఫ్ ..బె ., దగ్గరే ఆగిపోయినా,  నా చదువు మాత్రం ఏడో  తరగతి వరకూ సాగింది. అబ్బాజాన్ కు  తన కుట్టు మిషనే ప్రపంచం.   నమాజుకు మజీదుకు వెళ్ళడం కోసం తప్ప వీధి ముఖం  ఎరుగడు, కుట్టు మిషను  తనతోనే పుట్టినట్లు భావిస్తాడు. తలకి మించిన భారమైనా ఊరిబట్టలన్నీ  తీసుకొని రాత్రి పగలూ కుడుతుంటాడు. ఆయన కుట్టే రంగు, రంగుల బట్టలు చూస్తుంటే  అవి మా వంటి మీద ఎలా ఉంటాయో ఊహించుకునేవాళ్ళం. అవి కుట్టిన తర్వాత ఎదో వంకతో మా వయస్సు వారైతే ఆల్తీ చూసినట్లుగా మమ్మల్నిఆ బట్టల్లో  …
పూర్తిగా »

చరిత్రహీనులు

జనవరి 2013 : కథ


ఇంత ఉద్వేగాన్ని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు, నేను. ఆవేశం, అసహాయత, ఆత్మ న్యూనత అన్నీ కలసికట్టుగా ఒకే సారి నా మస్తిష్కం లో చొరబడి నా వ్యక్తిత్వాన్నీ, నా అభిమానాన్నీ, గాయపరచి  నడి బజారులో నన్ను నిర్వస్త్రుడిగా చేసి నిలబెట్టినట్టుగా ఒక ఘాటైన భావన. “జానకి ఎందుకిలా చేసింది? ఎలా చెయ్యగలిగింది, నా జానకి?” ఇలా, ప్రశ్నలే తప్ప జవబులివ్వలేని ఉత్తరం నా ఎదురుకుండా పడి ఉంది. ఒకటా, రెండా, ఇరవయ్యేళ్ళ అనుబంధం మా ఇద్దరిదీ. తను క్యాన్సర్ తో  గత  నాలుగేళ్లగా పోరాడుతూ  అంతిమ  క్షణాలలో హాస్పిటల్ బెడ్ మీద పడి ఉందన్న విషయం కుడా మర్చి పోయేటట్లు చేసింది ఈ ఉత్తరం. ఉదయం,…
పూర్తిగా »

నేలని నమ్ముకున్న వాళ్ళ కథలు!

జనవరి 2013 : చదువు


నేలని నమ్ముకున్న వాళ్ళ కథలు!

కొన్ని పుస్తకాలు ఎంచేతో జీవితం మీద గొప్ప ఇష్టాన్ని కలిస్తాయి.  పుస్తకం ముగిసి పోయాక గొప్ప ఆలోచనలు అలా చుట్టు ముడతాయి. ఆ ఆలోచనలు అలా ముసురుకుంటూ ఉంటే , ఆ ఇష్టం తాలూకు మైకంలో అలా ఉండి పోవాలనిపిస్తుంది. అలాంటి పుస్తకాల్లో చేరేదే ఫ్రెంచ్  నవల “భూమి”!  La Terre  పేరుతో దీన్ని ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత ఎమిల్ జోలా ఎంతో శ్రమకోర్చి…రాశారు.
ఇది రైతుల కథ. రైతులకు భూమి మీద ఉండే ప్రేమ, వ్యవసాయం మీద ఉండే వ్యామోహం,పాషన్ ఇవన్నీ కూలంకషంగా , క్షుణ్ణంగా చదివి రాయడం అంటే  సామాన్య మైన విషయం కాదు. వ్యవసాయ  స్వరూపాన్నే కాక, అప్పటి సామాజిక,…
పూర్తిగా »

వొక గూడు – కొన్ని పక్షులు

జనవరి 2013 : ప్రవాసీ బంధం


వొక గూడు – కొన్ని పక్షులు

సెప్టెంబర్ నెల చిరుచలి. వేడి వేడి కాఫీ కప్పుతో బాల్కనిలోకి వచ్చాను. సూరీడు మబ్బుల చాటున దాక్కుంటూ నేలతో దోబూచులాడుతున్నాడు. బంగారు వర్ణపు కిరణాలు సూర్య భగవానుడిని ఇట్టే పట్టించేస్తున్నాయి. రాత్రి ఏ ఘామునో చినులు కురిసినట్టున్నాయి. నేలంతా చెమ్మగా వుంది. కుంపట్లో విరబూసిన గులాబీ చిరుగాలికి తలాడిస్తుంది. కాఫీ సిప్ చేస్తూ మొక్కల దగ్గరకు వెళ్ళాను. ఆదివారం ఉదయాలంటే నాకెంతో ఇష్టం. ఆకాశాన్ని చూస్తూనో, మొక్కలను స్పర్శిస్తునో గడపటం కోసం వేకువ జామునే మేల్కొంటాను. వీకెండ్ అని పగలు పదింటి దాకా పక్కపై దొర్లటం నాకస్సలు నచ్చదు. లేట్ గా నిద్ర లేస్తే సగం రోజు అప్పుడే అయిపోయినట్టే వుంటుంది.

ఈ మధ్య ప్రతీ…
పూర్తిగా »

ఎదురుచూస్తున్న వెన్నెల రానే వచ్చింది!

జనవరి 2013 : కొత్త పుస్తకం కబుర్లు


ఎదురుచూస్తున్న వెన్నెల రానే వచ్చింది!

మూడేళ్లుగా ఎదురుచూస్తున్న కెక్యూబ్ వర్మ కవిత్వం మొత్తానికి ఇప్పుడు పుస్తక రూపం దాల్చింది. ఎప్పటినించో రాస్తున్న కవే అయినా, ఈ మూడేళ్లలో వర్మ తనదయిన గొంతు విప్పి, తన కవిత్వ వాక్యాల కింద వర్మ అని సంతకం అక్కర్లేకుండానే ‘ఇది వర్మ రాసిన వాక్యం’ అనే గుర్తింపు సాధించుకున్నాడు. వర్మ కవిత్వం చదువుతున్నప్పుడు వొక ఫైజ్ అహ్మద్ ఫైజ్ గుర్తొస్తాడు. వొక దార్విష్ గుర్తొస్తాడు. వొక నెరూడా మన మధ్యలోంచి నడిచి వెళ్తున్నాడనిపిస్తుంది. సున్నితమయిన ప్రేమనీ, కర్కశమయిన యుద్ధాన్ని రెండీటినీ గానం చేస్తున్న కవి వర్మ. అతని కవిత్వ సంపుటి ‘రెప్పల వంతెన’ కవిత్వ ప్రేమికులకు వొక ఈవెంట్! ఈ పుస్తకం కబుర్లు ఇవిగో!

ఇదీ…
పూర్తిగా »

ఒక సామాజిక సంవాదం చెయ్యాలంటే కేవలం కవిత్వం మీదే ఆధారపడలేం

జనవరి 2013 : మాట్లాడుకుందాం


ఒక సామాజిక సంవాదం చెయ్యాలంటే కేవలం కవిత్వం మీదే ఆధారపడలేం

(ఆంధ్రజ్యోతి వివిధ లో అచ్చయిన అఫ్సర్ గారి ఇంటర్వ్యూ  పూర్తి పాఠం ఇదీ… )

అఫ్సర్…. ఈ పేరు తెలుగు సాహిత్య జీవులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఖమ్మం జిల్లాలో ఒక మారు మూల గ్రామం అయిన చింతకాని ఊరుబడి నుండి  టెక్సాస్ యూనివర్సిటీ దాకా అతని నడక,  మేధో యాత్రలో ఆలోచనల్ని ప్రోది చేసుకొనే క్రమం అంత సులువుగా జరిగింది కాదు. తండ్రి కౌముది నించి అభ్యుదయ సాహిత్య వారసత్వం, తల్లి వేపు కుటుంబం నించి వామ పక్ష రాజకీయాల ప్రభావం…వీటన్నీటి పునాది మీద నిర్మించుకున్న అస్తిత్వ వేదన అఫ్సర్.  ఆమెరికాలో ఉన్నా తన వూరితో  ముడిపడిన మూలాల వెతుకులాట అఫ్సర్.…
పూర్తిగా »

లీ…ఆమెకు కవిత్వమే ఇల్లూ వాకిలీ!

జనవరి 2013 : ఇరుగు పొరుగు ఆకాశాలు


లీ…ఆమెకు కవిత్వమే ఇల్లూ వాకిలీ!

1

వొక మధ్యాన్నపు ఆలోచన: ఖాళీల్ని పూరించడం వొక కళ. ఏ ఖాళీనైనా భర్తీ చేయడం కష్టమే! కానీ, బలవంతాన అయినా దాన్ని భర్తీ చేయలేకపోతే  జీవితమే చేజారిపోతుంది.

-      ఈ మధ్యాన్నపు ఆలోచనలోంచి నేను వొక హీబ్రూ కవయిత్రి ఆకాశంలోకి పక్షిలా ఎగురుకుంటూ వెళ్ళాను.

2

ఎప్పుడూ నాలో అలజడి రేపే నా గురువారం మధ్యాన్నాలు ఇప్పుడు వున్నట్టుండి వొంటరి అయిపోయాయి.

ఇప్పుడు మాకు చలికాలం సెలవులు. మామూలుగా క్లాసులు జరుగుతున్న రోజుల్లో గురువారం మధ్యాన్నాలు వొక గంట నా ఆఫీస్ అవర్. ఆ గంట నాకు ఊపిరాడదు, నన్ను రకరకాలుగా ఉల్లాసపరిచీ, ఉత్సాహపరచీ నా లోపలి నేనుని అనేక ప్రశ్నలతో, కొన్ని…
పూర్తిగా »

వర్తమానాన్ని కోల్పోయి …..

జనవరి 2013 : కవిత్వం


మధ్యధరా సముద్ర కెరటాలు

అరబ్ ప్రపంచంలోని గొప్ప కవులను వారి పద్యాలనీ పరిచయం చేసే చిన్న ప్రయత్నమిది.

మధ్యధరా సముద్ర తీరపు  అరబ్ ప్రపంచంలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ అమితంగా గౌరవించబడి, ప్రేమించబడ్ద కవుల్లో మహ్మౌద్ దర్విష్ ఒకరు. ‘ఐడెంటిటీ కార్డ్ ‘ అనే కవిత్వాగ్రహ ప్రకటన ద్వారా చిరపరిచితుడైన దర్విష్ వర్తమానం గురించి స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండిన కవి, అర్ధ శతాబ్దం పైగా సాగుతున్న మహత్తర పాలస్తీనా పోరాటానికి మనసా వాచా కర్మణా మద్దతిచ్చిన తన కవిత్వం ద్వారా గొంతునిచ్చిన కవి. 1941 లో గెలీలీ లోని అల్ బిర్వా లో జన్మించి2008 లో అమెరికా హూస్టన్ లో మరణించాడు. చిన్ననాడు…
పూర్తిగా »

మనసుకో చిన్న మాట

జనవరి 2013 : కవిత్వం


వెళ్ళిపోకే మనసా
అలా వెళ్ళిపోకే
ఆలోచనల శిఖరాల పైకి
భావ సముద్రాల లోతుల్లోకి
కవితారణ్య సీమల్లోకి
పక్షిలా
చేపలా
కుందేలులా
వెళ్ళిపోకే మనసా
అలా వెళ్ళిపోకే

మహాకవుల శైలిలోకి
మహా స్వాప్నికుల ఊహల్లోకి
కథన రథికుల పథం లోకి
అక్షరమై
ఉత్ప్రేక్షవై
ధూళియై
వెళ్ళిపోకే మనసా
అలా వెళ్ళిపోకే

సిద్ధాంత సౌధాల్లోకి
రాద్ధాంత వీధుల్లోకి
ముఠాలు కట్టిన మఠాల్లోకి
బందీవై
బాధితవై
మూర్ఖవై
వెళ్ళిపోకే మనసా
అలా వెళ్ళిపోకే

తనకు తాను సమధి…
పూర్తిగా »

అమ్మకు ప్రేమతో

జనవరి 2013 : కవిత్వం


అలలను సవరిస్తూ దుఃఖపు సడిలో
ఒక ప్రవాహం ముంగిట నిలబడ్డాను

దరులను ఒరుసుక పారే నదికి
ఈ వైపు నేను ఆవైపు నేను

ప్రవాహం ఒక దూరమే కాదు
ఇద్దరినీ కలిపే ఒక దగ్గర కూడా

2
బహుశా నదికి తెలియదు
అనేకానేక చలనాల నడుమ గిరికీలుకొట్టే పక్షికీ తెలియదు

ఒకే సమయంలో సమాంతరంగా రెండు కాలాలు
అన్వేషణల ఒరిపిడిలో ఇద్దరు మనుషులు

3
నది ఇవాళే మా ఇంటి కొచ్చింది
యుగాలన్నీ ఇన్నాళ్ళూ ఉత్తినే దొర్లి పోయాయి

నది అంచున కవిత్వం
ఇప్పుడే కదా మొదలయింది
ప్రవాహం ఒక దూరమే…
పూర్తిగా »