మా చిన్నోడ్ని చిన్నోడంటే ఒప్పుకోడు. బదులుగా తన మూరెడు కొలతను చూపిస్తాడు. వాడికిప్పటికీ వాడి అన్న వాడికన్నా ముందు ఎందుకు పుట్టాడనేది సహించలేని విషయమే! అదేదో తానే పుట్టవచ్చుగా! అయితే వాడు పెద్దోడయ్యాడని అంగీకరించాల్సిన సందర్భం ఒకటి వచ్చింది.
యూరినరీ బ్లాడర్లో ఉన్న రాయినొప్పి వల్ల మా బాపు మొన్న హైదరాబాద్ రావాల్సివచ్చింది. అల్ట్రాసౌండులు, పీఎస్ఏలు, డిజిటల్ ఎక్సురేలు, రక్త పరీక్షలూ అవీ అయ్యాక- ఈసీజీలూ, 2డీ ఎకోలూ, టీఎంటీలూ చేశాక- ఆపరేషన్ను తట్టుకునే సామర్థ్యం గుండెకు ఉందని తేలాక- ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయి ఉందనికూడా నిర్ధారణ కావడంతో ఆ రెంటికీ కలిపి ఆపరేషన్ డేట్ ఫిక్స్ అయ్యాక- బాపు మళ్లీ ఊరెళ్లిపోయాడు.
ఎన్నడూ లేనిది నాలుగైదురోజులు వరుసగా మా దగ్గర ఉండటంతో, ఆ వెళ్లిపోయిన తెల్లారి, నిన్న ఇంట్లో ఉన్న తాతను గుర్తు చేసుకుంటూ, తాత ఊరు ఎందుకు వెళ్లిపోవాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పెద్దోడు అడిగాడు: ‘‘నానా, తాత ఊరు నర్సింగాపురం ఎందుకయింది?’’
వాళ్లమ్మ అప్పటికే నిద్ర లేచి నీళ్లు పడుతోంది. మేము ఇంకా మంచం దిగలేదు. ఊరికే పొద్దుటి బద్దకాన్ని ఆనందిస్తున్నట్టుగా అలా సగం పడుకున్నాం. వాడి ప్రశ్నకు ఏం జవాబివ్వాలో తెలియక, ‘‘వాళ్ల నానది అదే ఊరుగద నానా’’ అన్నాను.
ఈ ప్రశ్న పక్కకుపోయి, అంతకుమించిన అనుమానం వచ్చింది వాడికి. ‘‘మరి ఆ తాత ఏడి?’’
మా తాత నేను పుట్టకముందే చనిపోయాడు. నేను కూడా చూడని మా తాత ఉనికితో నా కొడుక్కు పరిచయం కలగడం ఆనందమేగానీ ఏమని జవాబు చెప్పను! ‘‘ఆ తాత ఎప్పుడో చచ్చిపోయిండు నానా’’ అని నెమ్మదిగా చెప్పాను.
ఇక వాడి మెదడులో జీవన్మరణాలకు సంబంధించిన కొత్త ఆలోచనలేవో కలిగివుంటాయి. దాని ఫలితంగా, ‘‘అట్లయితే మన తాత కూడా చచ్చిపోతడా?’’ అని అడిగాడు, చచ్చిపోకపోతే బాగుండు అన్నట్టుగా.
మృత్యువుకు సంబంధించిన మాయ ఎందుకు? అందుకే నిజమే చెప్పేశాను.
‘‘చచ్చిపోతడు నానా; ముసలోళ్లయినంక అందరు చచ్చిపోతరు’’.
అప్పటికే లేచిన చిన్నోడు పెద్దోడిలాగే కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ జవాబులు వాళ్లను నిశ్శబ్దంలోకి జార్చాయి.
ఇక మరింత వాస్తవాన్ని వాడు తేల్చుకోవడానికే సిద్ధపడినట్టుగా చివరి ప్రశ్న వేశాడు పెద్దోడు:
‘‘మరి పెద్దగైనంక నువ్వు కూడా చచ్చిపోతవా?’’
వాడి ప్రశ్నల క్రమం కలిగించిన ఆనందంతో, ‘‘ఊ’’ అన్నాను, ‘‘చచ్చిపోత బిడ్డ’’.
ఈ జవాబు వినగానే, అప్పటిదాకా ఈ ప్రశ్నల్లో వింటూ మాత్రమే భాగస్వామి అయిన నా చిన్నకుమారుడు ఠక్కున అన్నాడు: ‘‘అయితే నానా, నేను పెరుగ’’.
(ఆగస్ట్ 2015)
**** (*) ****
అయ్యో పిచ్చి తండ్రీ
మైథిలి గారికి,
మర్యాద మీరుతున్నాననుకోకపోతే, మీ పేరు తెలిసినప్పట్నుంచీ మీ పేరుమీద నాకున్న ఫిర్యాదును చెప్తాను. మైథిలి అబ్బరాజులో- మైథిలి అనే అందమైన పేరును “అబ్బరాజు” మింగేస్తున్నారు:-)
అలాకాకుండా- మీరు అబ్బరాజు మైథిలి అని గనక రాస్తే, ఉచ్ఛరించినప్పుడు, ముందువచ్చే అబ్బరాజు వెంటనే పక్కకు తొలగి, మైథిలి మీద నోరు ఆగుతుంది.
అందరు చిన్న పిల్లల వేదాంతం ‘ వట్టి ‘ వేదాంతం అనుకుంటారు . కాని వాళ్ళ ఆలోచనలు వస్తానికి తార్కికంగా వుంటాయి. బ్రతుకు మరియు చావు తప్పని సరి కదా ! మరి మృత్యువు జయించాలంటే కాలన్ని ఆపగలగాలి . కాలం ఎప్పుడు ఆగుతుంది ? మనం పెరగక పోతె !! చిన్న గల్పిక లో లోతైన వేదతంతము చెప్పినందుకు ధన్య వాదాలు .
పి.రాజిరెడ్డి గారు మీ రాతలు మన యాసకి బాగా జీవం పోస్తున్నాయి … మాములుగా మాట్లాడుకోవడానికి ఇలా చదవటానికి వ్యత్యాసం అని అనలేం కాని ఏదో చదువుతుంటే బాగుంది మా చిన్న అల్లుడికి వాడి బామ్మరిది(ఆద్విక్ రెడ్డి) హాయ్ చెప్ప్పాడని చెప్పండి .మే సన్మానం మిస్ అవడం bad luck..
…
మీ చిన్నోడు ఖతర్నాక్.
పిల్లలందరూ అంతే. తమ స్వచ్ఛమైన అమాయకత్వంతో మన కల్మశాన్నిఛేదిస్తారు. బాగా చెప్పారు.
konni konni sarlu pedda paragraph cheppalenidi oka padamo,vaakyamo chepthundi
samudram motham theechaleni daaham dosedu manchinellu cheyagalavuga
anduke “chaalaa baagundi” antunna anthe
-BVG
కాండీడ్ ను ఫ్రెంచి తత్వవేత్త వోల్టేర్ రాసిండా ( “మనిషిని, మతాన్ని, దేవుణ్ని, దెయ్యాన్ని, రాజును, రాజ్యాన్ని, యుద్ధాన్ని, న్యాయస్థానాన్ని.. దేన్నీ వోల్టేర్ వదల్లేదు. ప్రతిదాన్నీ హేతువనే గీటురాయిపై రుద్ది మంచిచెడ్డలను విచారించాడు. మంచిని తలకెత్తుకున్నాడు. చెడ్డను నరికి పోగులు పెట్టాడు” )
లేక తెలుగు అనువాదంలో పి.మోహన్ ఇరగదీసిండా అని తెలుసుకునేలోపే మమ్మల్ని కన్ఫ్యూసు జేసిన ఖతర్నాక్ అప్ప, నువ్వూ ఒకరేనా సామీ?
వారూవీరూ ఒకరైతే, నాన్నాయన ఎట్టాగో వోపికతెచ్చుకుని కాండీడ్ పదో భాగము, 25వ చాప్టర్ తర్వాతది కూడా రాసిపెట్టు బాబో. kalasahiti.blogspot.in లో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాము; నీ అభిమాన పాఠక పిలకాయలమంతా (చందుతులసి తో కలుపుకుని ).
Extraordinary
మేము ఎక్కిన మెట్లే మీరు ఎక్కుతున్నారు , మంచి చెడు ,వాళ్ళతో పంచుకోవడం ,
ఏదో ముందు పుట్టేసి వాళ్లకు నేర్పిన తృప్తి . ఇక్కడ మనం వాళ్లకు ఇచ్చిన సమాధానాలే
వారి రేపటి ఆటిత్యుడ్. మీ సాహచర్యం వాళ్లకు వాళ్ళ సాన్నిహిత్యం మీకు మంచి జ్ఞాపకాలుగా
చేసుకోండి . చాక్కగా ఆలోచిస్తున్నారు పిల్లలు . కీప్ రైటింగ్