కవిత్వం

ముత్తెంతసేపు

ఫిబ్రవరి 2016

త్కు నీళ్లసుక్క
గడియల్నే ఆవిరైపోతది
ఇద్దరి నడ్మ ఊపిరి సెగలు
పొగలు గక్కినపుడు.

మబ్బుల్నే నడిసొచ్చే ల్యాత ఎండపొడ లెక్క
నిప్పుల తట్టల్ని మోసే పగటాల్ల లెక్క
సల్లని మాపటాల్ల లెక్క
గాయిగాయి తిరిగే రాతిరి గాలి లెక్క
మూసిన గుప్పిట లెక్క
గుడ్లకాయ బుక్కనిండ పోసుకున్నప్పుడు మర్రని నాల్కె లెక్క
కొచ్చెని ముల్కు అరికాళ్లల్ల దిగబడ్డప్పుడు సమ్మని మూల్గులెక్క

కోపంలో మందలిత్తె
పచ్చగడ్డి భగ్గుమన్నట్టు
ప్రేమతో కావలిత్తె
ఎన్నముద్ద కరిగినట్టు

ఏ గడియకు ఆ గడియ
షానా కొత్తగా… షాన్ గ
ఆత్రంగ ఆవురావురుమన్నట్టుంటది
ఆమెతో… ఆ ముత్తెంతసేపు.