నుడి

నుడి-15 & నుడి-14 ఫలితాలు

జనవరి 2017


నుడి-14 ఫలితాలు, జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ సారి ‘నుడి’ని ముగ్గురు ఆల్ కరెక్ట్ గా పూరించారు. వారు
1. రవిచంద్ర ఇనగంటి
2. వి. దీప్తి
3. కామేశ్వర రావు
విజేతలకు అభినందనలు.

చాలా మంది 28 నిలువు, 30 నిలువుల దగ్గర తడబడ్డారు.

ఇక ఆధారాల్లోంచి కొన్నింటికి జవాబులు, వివరణలు.

8 అడ్డం: ‘మీసం రాక ఇట మేము తూలుతూ’ – ఇందులో ఒకటి విడిచి ఒకటి (అంటే 2, 4, 6, 8, 10 స్థానాలలోని అక్షరాలను) కలిపితే సంకటములు వస్తుంది!

10 అడ్డం: నవల = స్త్రీ; నవల = పుస్తకం

21 అడ్డం: సామము, దానము, భేదము, దండము (సామ దాన భేద దండోపాయాలు) – ఇవి చతుర్విధ ‘ఉపాయాలు’. చాలా మంది బేధము సరైన పదమనుకుంటారు. కాని, అది తప్పు.

23 అడ్డం: దేవతల తల్లి = అదితి. కొంత వరకు, అంటున్నాం కాబట్టి, ఒక అక్షరం తీసేసి ‘అది’ మాత్రమే తీసుకోవాలి. ‘ఇది’ కానిదే ‘అది’!

27 అడ్డం: కొంత ఒప్పా‘రుచు’ = రుచు. కాంతులు = రుచులు. కాని, అవి అసంపూర్ణం అంటున్నాం కనుక, ‘రుచు’ ఇక్కడ సమాధానమౌతుంది.

29 అడ్డం: పాఠశాలలో పా, శా అనే అక్షరాలు గురువులు (రెండు మాత్రల అక్షరాలు). అవి ‘యమలు’లో చేరితే యమపాశాలు వస్తుంది!

5 నిలువు: అలసట = అలుపు. అంతు (చివర) లేదు కాబట్టి, అలు మిగులుతుంది. ప్రథమాక్షరం (తెలుగు వర్ణమాలలో) = అ. దానికి బహువచనం ‘అలు’.

11 నిలువు: కూతురు = పట్టి; తాలూకు = పట్టి; జాబితా = పట్టి; పట్టుకుని = పట్టి!

28 నిలువు: దీనికి సమాధానం చుక్కల మందు. చాలా మంది చుమం లక్కదు అని పూరిచారు. విజేతలను మినహాయిస్తే దీనికి సరైన జవాబును రాసినవారు ఒక్కరే. ఇక్కడ ‘మంచు దుక్కల’ అన్నది anagram.

30 నిలువు: చాలా మంది పాల దాలి, పాలి దాల అని నింపారు. సగం పైకి రావాలి ‘కదా’ అన్నాం కనుక, కదా దాక అవుతుంది. దాక = కడవ, భాండము.

34 నిలువు: కార్ల కంపెనీ = మారుతి. మారుతి మైనస్ మా = రుతి!

**** (*) ****