నుడి-21 ఫలితాలు, జవాబులు, వివరణలు
పాఠకులకు నమస్కారం.
ఈ సారి ‘నుడి’ని ఒక్క తప్పు కూడా లేకుండా పూరించినవారు ఒక్కరే. వారు: టి చంద్రశేఖర్ రెడ్డి.
ఒక తప్పుతో పూరించినవారు కూడా ఒక్కరే. వారు: నాగరాజు రవీందర్.
విజేతలకు అభినందనలు.
ఇక కొన్ని ఆధారాలకు సమాధానాలను, వాటికి వివరణలను చూద్దామా?
అ | ప | ర్ణ | X | శా | X | వా | రా | శి |
ప్ప | X | X | బు | టి | క | X | X | వు |
క | న్న | త | ల్లి | X | వ | క్క | పొ | డి |
వీ | X | X | కు | రు | చ | X | X | క |
యం | త్ర | ణం | X | ద్రా | X | మా | గ | న్ను |
X | య | X | న | వా | బ్దం | X | రి | X |
ఈ | ము | ఖం | X | స | X | కో | డీ | క |
డే | X | X | త | మా | ష | X | X | పి |
రా | కు | మా | రి | X | రా | యం | చ | ల |
య | X | X | కి | తా | బు | X | X | వా |
ట | క్కు | లు | X | తా | X | తు | రా | యి |
1 అడ్డం: పర్ణములు = ఆకులు. పర్ణములు లేనిది = అపర్ణ. సమాధానం అపర్ణ.
7 అడ్డం: నల్లికత లోని మొదటి అక్షరమైన ‘న’ ను బరువు చేయటం అంటే ‘న్న’ గా మార్చటం. అప్పుడు ఏర్పడే న్నల్లికతను క్రమీకరిస్తే కన్నతల్లి వస్తుంది. అదే జవాబు.
8 అడ్డం: ఇక్కడ పొక్క వడి అన్నది anagram. దాన్ని తారుమారు చేస్తే వచ్చే వక్కపొడి సమాధానం.
9 అడ్డం: సమాధానమైన ‘కురుచ’ ఆధారంలోనే తారుమారుగా వుంది. చూడండి.
11 అడ్డం: దీనికి జవాబు యంత్రణ లేక యంత్రణం. యంత్రం = మర.
15 అడ్డం: ఇక్కడ కొందరు తడబడ్డారు: ఉగాది, హేవళం, నవాది అని పూరించారు. దీనికి సరైన సమాధానం నవాబ్దం. అయితే నవాబ్ది అని రాసినా ఒప్పుగా అంగీకరించడం జరిగింది. ఎందుకంటే, ఆ పదం బాగా వాడుకలో ఉండటమే కాక, స్థిరపడిపోయింది (శతాబ్ది ఎక్స్ ప్రెస్ అంటున్నాం). కాని, స్ట్రిక్టుగా చూస్తే నవాబ్ది కూడా తప్పే. ఎందుకంటే తెలుగు భాషలో అబ్ది అనే పదం లేదు, అబ్దము మాత్రమే ఉంది. ఇక నవాబ్ధి అని రాస్తే మాత్రం నిస్సందేహంగా (శుద్ధ) తప్పే. అబ్ధి అంటే సముద్రం కనుక, నవాబ్ధి = కొత్త సముద్రం అవుతుంది.
16 అడ్డం: ఈ ఆధారానికి జవాబు ఈ ముఖం. ఈము = మంచు.
21 అడ్డం: మా వూరి పొలిమేరలు అంటే మా వూరి లోని మొదటి, చివరి అక్షరాలైన మా,రి. వచ్చెయ్యకు = రాకు. రాకు + మారి = రాకుమారి = రాజుగారి పుత్రిక.
22 అడ్డం: అరుదైన పక్షులు = రాయంచలు. ఇక్కడ రాల సంచయంలో ‘సం’ ను హృదయంగా భావించాలి. ఎందుకంటే, అది హృదయం లాగా మధ్యన వుంది. రాల సంచయంలోంచి ‘సం’ ను మైనస్ చేసి తారుమారు చేస్తే రాయంచల వస్తుంది. అదే సమాధానం.
25 అడ్డం: టక్ టక్ అనేవి తలుపు మీద గొళ్లెంతో కాని, వేలి వెనుక భాగం లాంటి మరేదైనా వస్తువుతో కాని కొడితే వచ్చే శబ్దాలు. ఇక టక్కులు అంటే మోసాలు కూడా. కనుక, అదే సమాధానం.
26 అడ్డం: తప్పకుండా రాయాల్సినవి = తు.చ. అనే అక్షరాలు. తు.చ. తప్పకుడా రాయాలి అని అంటుంటాం కదా. ఇక లిఖించు = రాయి. తు + రాయి = తురాయి = ఒక రకమైన అలంకరణ. కనుక, తురాయి జవాబు.
1 నిలువు: M.V. = యంవీ. యంవీ కప్పతో ‘అ’ సంయోజనం చెందితే (కలిస్తే) ‘యంవీకప్పఅ’ వస్తుంది. దీన్ని తారుమారు చేస్తే వచ్చే అప్పకవీయం సమాధానం.
2 నిలువు: దీనికి జవాబు శాటి. శాటి = శాలువ. ఉపగ్రహం = శాటిలైటు. శాటిలైటు మైనస్ లైటు = శాటి.
6 నిలువు: చవకగా అనే పదంలోని చివర ‘గా’. దాన్ని తీసేసి కలగాపులగం చేస్తే వచ్చే కవచ ఇక్కడ జవాబు. ‘లాలు కుండ’ సర్దుకుని అంటే కుండలాలు అన్న మాట. కవచ కుండలాలులో కవచ తర్వాత కుండలాలు వస్తుంది.
10 నిలువు: ఇక్కడ కూడా చాలా మంది తడబడ్డారు. రుద్రాగారమా, రుద్రవాసమా, రుద్రవనమా, అంటూ రకరకాలుగా పూరించారు. నిజానికి రుద్రావాసమా అనే పదమే కనపడింది ముఖ్యమైన నిఘంటువుల్లో. ఈ పదానికి వెండికొండ, శ్మశానం అనే రెండు అర్థాలు ఇవ్వబడినాయి. అయితే ఆవాసము అన్నా, వాసము అన్నా ఇల్లు కనుక, ‘రుద్రవాసమా?’ను కూడా సరైనదిగా ఎంచడం జరిగింది.
14 నిలువు: వ్యాయామంలోని ఒక రకమైన గరిడీ ఇక్కడ జవాబు. సాము = సగము. సాముగరిడీ అంటాం కదా.
16 నిలువు: వయసు = ఈడు. వయసే = ఈడే. శిల = రాయి. శిల అట = రాయట. ఈడే + రాయట = ఈడేరాయట = సిద్ధించాయట. కనుక, ఈడేరాయట అనేది సమాధానం.
18 నిలువు: యిక పిలవాలి అనంతంగా అంటే యిక పిలవాలి లోని చివరి అక్షరాన్ని (‘లి’ని) తీసేయాలని అర్థం. అట్లా చేస్తే ‘యికపిలవా’ వస్తుంది. దాన్ని మిశ్రమం చేస్తే వచ్చే కపిలవాయి సమాధానం. కపిలవాయి లింగమూర్తి గారు శతాధిక గ్రంథకర్త. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత సాహితీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది.
19 నిలువు: చక్రవర్తి = నల. తల నరికి లోంచి నల మైనస్ చేస్తే వచ్చే తరికి ఇక్కడ సమాధానం. తరి = సమయం.
20 నిలువు: ఈ ఆధారానికి షరాబు అనేది జవాబు. షరాబు = సేటు, తాగేది (షరాబ్)
**** (*) ****
ఈ సారి నుడి క్లిష్టత కొంచెం తగ్గింది. ఎక్కువ మంది ప్రయత్నిస్తారనుకుంటా.నా లాంటి వారికి ఉత్సాహంగా వుంది….కృతజ్ఞతల యెలనాఁగఁగారు
.