నుడి

నుడి – 21

జూలై 2017

Nudi 21 PDF (ప్రింట్ చేసుకుని తీరిగ్గా పెన్నుతో గడులను నింపుకోవాలనుకుంటే ఈ పి.డి.ఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.)


నుడి-20 ఫలితాలు, జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం.

ఈ సారి ‘నుడి’ని ఒక్క తప్పు కూడా లేకుండా పూరించినవారు ఇద్దరు. వారు:
1. రవిచంద్ర, ఇనగంటి
2. పి. సి. రాములు.

ఒక తప్పుతో పూరించిన వారు ముగ్గురు.
1. కార్తీక్ చంద్ర, పి.వి.ఎస్.
2. రాంమోహన్ రావు, తుమ్మూరి
3. ఫణీంద్ర, పురాణ పణ్డ.

విజేతలకు అభినందనలు.

ఇక కొన్ని ఆధారాలకు సమాధానాలను, వాటికి వివరణలను చూద్దాం.

1 అడ్డం: ఎస్ = S. ఎస్ తర్వాతది = T (ఆంగ్ల వర్ణమాలలో). సగం = అర. ఎస్ తర్వాతది సగం అంటే టి-అర. దీన్నే అరటి అని మార్చినా అర్థం మారదు. కనుక సమాధానం అరటి. కొందరు అనాస అని, మరికొందరు అవును అని నింపారు.

3 అడ్డం: తుంపర వర్షం = ముసురు. దాన్ని రివర్స్ చేస్తే వచ్చే రుసుము సమాధానం.

8 అడ్డం: దీనికి జవాబు పిడికిలి. ఇది ఆధారంలో అటుదిటుగా ఉంది, చూడండి.

15 అడ్డం: దీనికి జవాబైన అంతస్తు కూడా ఆధారంలో కుడినుండి ఎడమకు ఉంది.

16 అడ్డం: పువ్వు = విరి. ఆవిరి మైనస్ విరి = ఆ. దాచిపెట్టం = దాయం. ఆ + దాయం = ఆదాయం. అదే జవాబు.

19 అడ్డం: మ్యాట్రెస్ = పరుపు. మ్యాట్రెసే = పరుపే. దీన్ని తారుమారు చేస్తే వచ్చే పేపరు జవాబు.

22 అడ్డం: మానయము, మాముయన అని నింపారు కొందరు. ‘నయమై’ క్రమంగా వస్తే ‘యమైన’ ఏర్పడుతుంది. దీన్ని ‘మా’కు కలిపితే = మాయమైన = అదృశ్యమైన. కాబట్టి, మాయమైన అన్నది జవాబు.

1 నిలువు: సు అనే అక్షరం విశేషణం కదా (సు = మంచి). సుతారి అవక మైనస్ సు = తారి అవక. దీన్ని కలగాపులగం చేస్తే వచ్చే అవతారిక జవాబు.

4 నిలువు: సమాన దూరంలో ఉన్నవి అంటే ఇక్కడ అక్షరం విడిచి అక్షరం అన్న మాట. ‘మేము మూసగాలిలోన చుక్కలం’ లోని 2, 4, 6, 8, 10 వ అక్షరాలను కలుపగా వచ్చే ముసలి నక్క సమాధానం.

5 నిలువు: దీనికి సమాధానం భయంగా. క్షతి = గాయం. భయంగాలో గాయం కిందనుండి పైకి వచ్చింది, చూడండి.

6 నిలువు: మోట = కపిల. జుట్టు = పిలక. కనుక, కపిల జవాబు.

12 నిలువు: పదారణాలలో – ఇందులో ఆరు అక్షరాలున్నాయి. మొదటి మూడక్షరాలను మిశ్రమం చెయ్యగా వచ్చే పరదా = తెర. కనుక, అదే జవాబు.

14 నిలువు: కారణాలు ‘కా’లేదు అన్నాం కనుక, కారణాలు మైనస్ కా = రణాలు = యుద్ధాలు. సమాధానం అదే.

16 నిలువు: ‘ఆకులు’ రాసి, మధ్యన ‘రాధ’ను చేర్చితే వచ్చే ఆరాధకులు ఇక్కడ సమాధానం.

18 నిలువు: ఎయిర్ హోస్టెస్ కు గగనసఖి అనే తెలుగు పదాన్ని సూచించారెవరో. కనుక, అదే సమాధానం.

19 నిలువు: పొలతి నడుము అంటే పొలతి అనే పదంలోని మధ్య అక్షరమైన ల. దీనికి బయట కిందనుండి పైకి ‘వంపే’ వస్తే పేలవం ఏర్పడుతుంది. పేలవం = పస లేని కనుక, అదే సమాధానం.

24 నిలువు: ఇక్కడ చాలా మంది తడబడ్డారు. కఱ్ఱ, కర్రి, కడై, కడా, కప్పి – ఇన్ని రకాలుగా పూరించారు. దీనికి జవాబు కప్పు. కప్పు = డాగురించు, నల్లని, cup.

**** (*) ****