‘ పూడూరి రాజిరెడ్డి ’ రచనలు

ఒకటీ రెండూ ఐదూ పదీ ఇరవై

ఒకటీ రెండూ ఐదూ పదీ ఇరవై

ఒక రోడ్డు, పార్కు, గుడి, హాస్పిటల్, ఆఫీస్, బాంక్, పబ్, చివరికి స్మశానం…

ఒక రచయితకి ముడిసరుకు దొరకని చోటేదైనా ఉంటుందా? అలాంటి చాలా చోట్లకి తిరిగారు రాజిరెడ్డి. రచయితగా కాదు, జనంలో ఒకడిగా. ముడిసరుకుని పోగుచేసుకుని వాటిని కథలుగా మలుచుకునేందుకు కాదు. రచయిత తాలూకూ లోలోపలి వ్యాఖ్యానాన్ని అదిమిపెట్టి ఒక కెమెరాలాగా, ఒక టేప్ రికార్డర్ లాగా తనకి ఎదురైన అనుభవాల్ని నమోదు చేసుకునేందుకు. ఆయా చోట్లలో తారసపడ్డ విషయాల్ని ఉన్నదివున్నట్టు పాఠకుల ముందు ఉంచేందుకు. ఇదొక సెల్ఫ్ చెక్, సోషల్ చెక్, రియాలిటీ చెక్. మనకి సీదా సాదాగా ఒకే డైమెన్షన్ లో కనిపించేదే రాజిరెడ్డికళ్ళతో చూసినపుడు బహుమితీయంగా, ఫిలాసాఫికల్…
పూర్తిగా »

దేవుడు ఆడే ఫుట్‌బాల్

దేవుడు ఆడే ఫుట్‌బాల్

అయితే నేను ఫిల్టర్ ఎత్తేయడం మంచిదే అయింది. అందుకేగదా కొత్త క్యాండిల్స్ కోసం వెతుక్కుంటూ బజార్‌కు వెళ్లాల్సివచ్చింది; అప్పుడే కదా అక్కడ ‘చోటు’ ఫుట్‌బాల్ చూశాడు. పిల్లలు మాత్రమే దాన్ని ఫుట్‌బాల్ అని నమ్మగలరు! ఫుట్‌బాల్ కాని ఫుట్‌బాల్ లాంటి ఫుట్‌బాల్ అది. లేతాకుపచ్చ రంగులో ఉంది. నాలుగుసార్లు గట్టిగా తంతే నలభై సొట్టలు పడిపోతుంది! అయినాగూడా పొద్దున పార్కులో ఆడుకోవడానికి బాగానే పనికొస్తుంది! ఓ, ఇదొక పెద్ద పార్కు! పార్కు కాని పార్కు లాంటి పార్కు! కానీ పొద్దున మేము ముగ్గురమే వెళ్తాం కాబట్టి, మేము ముగ్గురం వెళ్లడం వల్లే బాగుంటుంది!

అయితే, సాయంత్రం బాల్ తెచ్చాం కాబట్టి, పొద్దుటి కోసం ఆత్రంగా…
పూర్తిగా »

బాడ్ ఇమేజ్

బాడ్ ఇమేజ్

ఇలాంటిదొకటి జరిగే అవకాశం ఉందని మీరు నమ్ముతారా?

మనం ప్రయాణిస్తున్న ఆటో ఏ బైకునో అలా తగులుతూ వెళ్లిందనుకోండి; ఆ బైకువాలా ఆటోడ్రైవర్‌ను ఉద్దేశించి- ‘నీ యమ్మ’ అంటూ కోపంగా చూడబోతాడు; కానీ ఈలోపు ఆటో ఎటూ దాటిపోతుంది; కానీ బైకు అతనికి ఏమైందోనన్న కన్సెర్న్‌తో కూడిన కుతూహలంతో మనంగానీ ముఖాన్ని అతడి వైపు పెట్టామా– ఆ ఆటోడ్రైవర్ స్థానంలో మన ప్రతిరూపాన్ని కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకంటే, ఆటోడ్రైవర్ అనే ఖాళీ స్థానంలోకి ప్రవేశపెట్టగలిగే అత్యంత దగ్గరితనపు సంభావ్యత ఉన్న ఇమేజ్ మనదే కాబట్టి! ఇంకేం, ఆ బూతులన్నీ మనకు తెలియకుండానే మనకు ‘తగులుతాయి’; జీవితంలో ఏ పరిచయమూ లేని వ్యక్తికి మసగ్గానైనా మనం ఒక…
పూర్తిగా »

చిన్నోడు పెద్దోడయ్యాడు

చిన్నోడు పెద్దోడయ్యాడు

మా చిన్నోడ్ని చిన్నోడంటే ఒప్పుకోడు. బదులుగా తన మూరెడు కొలతను చూపిస్తాడు. వాడికిప్పటికీ వాడి అన్న వాడికన్నా ముందు ఎందుకు పుట్టాడనేది సహించలేని విషయమే! అదేదో తానే పుట్టవచ్చుగా! అయితే వాడు పెద్దోడయ్యాడని అంగీకరించాల్సిన సందర్భం ఒకటి వచ్చింది.

యూరినరీ బ్లాడర్లో ఉన్న రాయినొప్పి వల్ల మా బాపు మొన్న హైదరాబాద్ రావాల్సివచ్చింది. అల్ట్రాసౌండులు, పీఎస్ఏలు, డిజిటల్ ఎక్సురేలు, రక్త పరీక్షలూ అవీ అయ్యాక- ఈసీజీలూ, 2డీ ఎకోలూ, టీఎంటీలూ చేశాక- ఆపరేషన్ను తట్టుకునే సామర్థ్యం గుండెకు ఉందని తేలాక- ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయి ఉందనికూడా నిర్ధారణ కావడంతో ఆ రెంటికీ కలిపి ఆపరేషన్ డేట్ ఫిక్స్ అయ్యాక- బాపు మళ్లీ ఊరెళ్లిపోయాడు.

ఎన్నడూ…
పూర్తిగా »

చిన్నప్పటి ఒక సరసపు వాక్యం

చిన్నప్పటి ఒక సరసపు వాక్యం

ఈ విషయం విన్నప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యపోకపోవడానికి కారణం, ఇలాంటిదొకటి జరగడం అనూహ్యం కాదనుకోవడమే!

మావాడి క్లాసులో ఉండే అక్షయ్‌రాజు అనే పిల్లాడు, అదే క్లాసులో చదివే ఒకమ్మాయిని పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటాడట! అలా అని మావాడితో చెప్పాడట! వాడు ఆ మాటను మోసుకొచ్చి వాళ్లమ్మ చెవిలో వేశాడు.

సాధారణంగా, నేను ఆఫీసునుంచి ఇంటికెళ్లాక, చిన్నోడు చంకనెక్కి నా బ్యాగు వెతుకుతాడు, ఏ పళ్లు తెచ్చివుంటానోనని! నేను కూరగాయలు కిచెన్లో ఇచ్చేసి, పళ్లు తినడానికి వీలుగా, కడగాల్సినవైతే గిన్నెలో నానబెడుతుండగానే ముక్కోణఫు ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. ‘నానా, అమ్మ నన్ను…’ ‘పెద్దోడు ఏం జేసిండో తెలుసా?’ వాళ్లమ్మ మీద చిన్నోడు, చిన్నోడి మీద పెద్దోడు……
పూర్తిగా »

మంట

మంట

ఇంకొక ఐదు నిమిషాలు చూస్తానంతే. వీడు వచ్చాడా వచ్చాడు, లేదంటే వెళ్లిపోవాలి. ఇదే ఆఖరి కాల్.

‘‘అన్నయ్యా… ఈ తమ్ముడి కోసం ఇంకొక్క పది నిమిషాలు ఓర్చుకోవే.’’

పది ఇంటూ పది నిమిషాలుగా ఓర్చుకుంటూనేవున్నా. ప్చ్, సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. ఈ మాటంటే: ‘10.12 నిమిషాలకు సరిగ్గా కలవకపోతే ఏమౌతుందీ? పదీముప్పైకైనా కలవడమేగా’!

ఉత్తినే కలవడమే అయితే, దీనికి ప్రాధాన్యత లేనట్టే అయితే, మరి ఎందుకు అక్కణ్నుంచి రావడం, నేను ఎదురుచూడటం?

వేరొకరి ఉద్వేగాల మీద ఆధారపడటమే నాకు నచ్చదు. అలాంటిది, ఇప్పుడు నిర్ణయాల మీద కూడా ఆధారపడాలి! జీవితంలో ఉన్న పెద్ద విషాదం ఏమిటంటే, మనం ఎక్కడికి వెళ్లినా మనుషులతోనే వ్యవహరించాలి.

పనివుంటే…
పూర్తిగా »

కథంటే ఏమిటి?

కథ, అంటే ఏమిటో నేను మొదలుపెట్టబోతున్నానంటే, నన్నెవరో కథ గురించి అడిగినట్టూ, అది అడిగించుకునేంత పెద్దవాణ్ని నేను అయిపోయినట్టూ ధ్వనిస్తోంది కదా!
మొదటిది నిజమే. రెండవది నిజమో కాదో, తర్వాత చూద్దాం.
(వయా కావలి వెళ్లిన) ప్రకాశం జిల్లా రామాయపట్నంలో (2014 ఫిబ్రవరి 15, 16 తేదీల్లో) జరిగిన ‘కడలి అంచున కథ’ సమావేశం కోసం కథకుడు ఖదీర్ బాబు కథంటే ఏమిటో నన్ను మాట్లాడమన్నారు.
కథా?
నేనా?
కథల్ని మొన్నమొన్నటిదాకా నేను సీరియస్గా పట్టించుకోనే లేదు. అయినా, కథంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్వచించాలి? ఒకవేళ నిర్వచించినా, అదంతా ‘ముసలి డొక్కుల’ వ్యవహారం కదా!
ఇలా…
పూర్తిగా »

సినిమాల గురించి కొన్ని పిల్ల ఆలోచనలు

సినిమాల గురించి కొన్ని పిల్ల ఆలోచనలు

(త్వరలో రాబోతున్న ‘పలక పెన్సిల్’ పుస్తకం నుంచి.)

ఒక పిల్లవాడి ఊహా శక్తి ఎలా ఉంటుంది! బహుశా, నాకు నేనే విడివడి గమనించుకుంటే, ఇలా ఆలోచిస్తారా పిల్లలు అనిపిస్తుంది.
కొత్తగా అక్షరాలు నేర్చుకునేటప్పుడు, కనబడే ప్రతి కాగితమూ చదువుతాం. సినిమా పోస్టర్ల లో కింద నిర్మాత, దర్శకుల పేర్లు విధిగా చదువుతుండే వాణ్ణి. అయితే, పైన బొమ్మలో ఉన్న మనుషుల పేర్లే కింద వేస్తారనుకునేవాణ్ణి. . అయితే,. ఈ తర్కాన్ని రెండు పోస్టర్లు దెబ్బ కొట్టాయి.

‘కిరాతకుడు’ టైటిల్ కింద ఎ. కోదండ రామి రెడ్డి అని ఉంది.. అయితే, అప్పటికి నాకు తెలిసిన ఏకైక హీరో చిరంజీవి. మరి పేరు ఇలా ఎందుకుంది.?…
పూర్తిగా »