‘ బండారి రాజ్ కుమార్ ’ రచనలు

ఖాళీచేయాల్సిన సమయం

రాత్రి తెగిపడిన అవయవాలన్నీ
ఉదయపు నడకలో
గడ్డిమైదానంపై మంచుబిందువుల్లా మారి
నీ పాదాల కింద చిట్లిపోయి
నెత్తుటి పారాణి దిద్దిపోతయినీకు నువ్వు ఇక కనిపించవు
పూర్తిగా »

గొంతు తడిపిన చెయ్యి

గొంతు తడిపిన చెయ్యి

నెలపొడుపును జూసిన ప్రతీసారి
కాంతుల్ని నింపుకుని
కండ్లుమూసుకుని
చేతులతో నన్ను వెదికి పట్టుకుని
చూపుల్ని నా మొఖం మీదికి
చిరునవ్వుతో గుమ్మరించేది
గప్పుడు నా ముందు
నెలపొడుపు సుత దిగదుడుపే.

తానమాడితె
నున్నగ నిగనిగలాడుతవని
అట్టగట్టిన పెయ్యిమీది మట్టికి
గిర్నికాడ పట్టిచ్చిన సున్నిపిండికి పందెం గట్టేది
ఒత్తుల కాగిన ఉడుకునీళ్లుబోసుకుంటె
పానం అల్కగుంటదని
వాయిలి ఆకేసి మర్గబెట్టిన నీళ్లు
మొఖంమీద గుప్పిత్తె
పడిశం పరారయ్యేది

అలుకు జల్లిన వాకిట్ల ముగ్గేసి
గడపలు పుదిచ్చి
బాయినీల్లు చేది
గోలెం నింపిపూర్తిగా »

రంది రౌస బత్కులు

రంది రౌస బత్కులు

పందిరిగుంజను కావలిచ్చుకున్న బీరతీగలు
సాలెగూటిలో చిక్కుకున్న తేనెటీగలు
అనుభవిస్తేగాని తెలీని కొన్ని బాధలు
ఇసుకలోకి నీరింకినట్టుగా కొన్ని మనాదులు
మాటల్లో ముంచి ప్రేమల్ని అద్దినా మానని గాయాల గురుతులు
పూర్తిగా »

తెలంగాణ అస్తిత్వపు నిషానీలు

ఈడ నిత్తెం యుద్ధమే…
తకరార్ బెట్టుడే దెల్వనోల్లు
కయ్యానికి సై అన్న సైనికులైన్రు !

గావురాల ప్రేమలు
గంజికి ఏడుత్తాంటె
ఖాయిసుపడ్డ మన్సులు
నెగట్ల ప్యాలాలై ఏగుతాంటె
ఉప్పిడి ఉపాసం బతుకులు
నూరుగాని రాయి మీద కక్కుబెడ్తాంటె
దెశమంతులమని …
కట్టమీదగూసోని
ఎంటికెలీరబోసుకుని
పబ్బతిబట్టినమని.. ఈరేషమేత్తాంటరు

లగుదొర్కితె లగ్గమేనని
ఉట్టిమీద ఊరేగుడేనని
ఊరంత సాటింపేషి
అరుగుమీద కూసోని ఆరిందెనని
మూడు ముచ్చట్లకు ముప్ఫై యాటలు నర్కి
మూలకున్న కుండ
ముచ్చెమటలుబోత్తాంటె
ముక్కుమీద ఏలేసుకుంటరు

సోడు నూకలు లేకున్నా
నిండుకున్న…
పూర్తిగా »

ఇచ్ఛంత్రం

నిజాల నిప్పుకణికెల మీద పొర్కనెగేషి పొగబెట్టితె
కండ్లమంటేషం ఒళ్లంత కాలబెట్టినంక
పాలకంకుల గింజల్ని ఒలిషి పావురాలకు పచ్చులకు తినబెడ్దమంటె
సొప్పబెండ్లు దొరకని కరువున్నదని కతలల్లుతరు

పూర్తిగా »

ఓ.. వుల్లా, గిటు సూడున్రి

పానం వున్నా కొన్ని వస్తువులకు ఫకరుండదు
మనిషి వస్తువుగా మారినంక
వస్తువు మనిషిపై పెత్తనంజేత్తున్నదన్క

గలగలలాడే చెల్లని సత్తుపైసల గొంతుకలు మూగబోతయి
కళకళలాడే రూపాయిని గతచరిత్రపు పునాదులపై నిల్పి పట్టంగట్టినంక
అంతర్జాతీయ అంగట్లో మారకపు మాంజాతో కరెన్సీ నోట్ల పతంగిని ఎగరేషినంక

నిండైన నీళ్లపట్వలు పటుక్కున పల్గిపోతయి
బతుకంటే పల్గిపోయే నీటిబుడగలని ఎరుకైనంక
గోసలువడ్డ పెయిల మబ్బులపిట్టలు రెక్కల్నిసాపి ఎగిరిపోయినంక

తరతరాల ఆలోచనల గూనపెంకలు ఇరిగిపోతయి
ఇత్తునం బద్దలయ్యే సప్పుడుతో నరాలు చిట్లినంక
షిలుంబట్టిన నెత్తురు నొసట్ల తిలకంబొట్టుబెట్టినంక


పూర్తిగా »

ముత్తెంతసేపు

బత్కు నీళ్లసుక్క
గడియల్నే ఆవిరైపోతది
ఇద్దరి నడ్మ ఊపిరి సెగలు
పొగలు గక్కినపుడు.

మబ్బుల్నే నడిసొచ్చే ల్యాత ఎండపొడ లెక్క
నిప్పుల తట్టల్ని మోసే పగటాల్ల లెక్క
సల్లని మాపటాల్ల లెక్క
గాయిగాయి తిరిగే రాతిరి గాలి లెక్క
మూసిన గుప్పిట లెక్క
గుడ్లకాయ బుక్కనిండ పోసుకున్నప్పుడు మర్రని నాల్కె లెక్క
కొచ్చెని ముల్కు అరికాళ్లల్ల దిగబడ్డప్పుడు సమ్మని మూల్గులెక్క

కోపంలో మందలిత్తె
పచ్చగడ్డి భగ్గుమన్నట్టు
ప్రేమతో కావలిత్తె
ఎన్నముద్ద కరిగినట్టు

ఏ గడియకు ఆ గడియ
షానా కొత్తగా… షాన్ గ
ఆత్రంగ ఆవురావురుమన్నట్టుంటదిపూర్తిగా »

బడుగుజీవుని బతుకుసిత్రం

కావడిబద్దకు రెండు కల్లులొట్టీలు
భుజానికెత్తుకుని ఈడ్సుకుంట
బతుకు పోరుపయనం సురువైతదిమొగులును ముట్టిచ్చుకోవాలనే ఆశతో
కొమ్మలు లేని తాడిసెట్టు విర్రవీగుతది
మట్టలూపుతూ వేలెడంతలేవని ఎక్కిరిత్తది
గాలి ముచ్చట్లకు షెవులూపుతది
గాలి సవ్వడికి, సంగీతానికి
ఒళ్లంతా పులకరించి తందనాలు ఆడుతదిమోకుతో తాటిని కావలిచ్చుకుని
కాళ్లకు గుజిబంధమేసుకుని
కాల్జేతులు ఒడుపుగ పట్టి
సర్రసర్ర సగమెక్కినంక
గుజిపట్టుదప్పి మోకు మొరాయిచ్చిందంటే
పైపానాలీ పైనే..!

ఒక్కసారి కళ్లు మూసుకుని
పెళ్లాం బిడ్డల దల్సుకుని
లేని ధైర్నం కూడబలుక్కుని
మొగులుకు, న్యాలకు నడ్మ ఊగిసలాడుతూ
పొట్ట కూటి కోసం కల్లులొట్టి నింపుతడు


పూర్తిగా »