‘ వాకిలి ’ రచనలు

ఆమె ఒక అమ్ములపొది

సెప్టెంబర్ 2017


ఆమె మాటలు సూటిగా, నిర్మొహమాటంగా, ఒక్కోసారి ఘాటుగా ఉంటాయి. “పొద్దుపొద్దునే మొహం కడుక్కోగానే నేను చేసే పని నాలుకకు పదును పెట్టడం” అని నిస్సంకోచంగా చెప్పగలిగే తెగువ కూడా ఉంది. స్వేచ్చనీ, ప్రేమనీ సమానంగా కోరుకుని ఒంటరితనంతో మిగిలిపోయే ఒక స్త్రీ గొంతుక ఆమె రచనల్లో వినపడుతుంది.

కథకురాలిగా, కవయిత్రిగా, విమర్శకురాలిగా, సంపాదకురాలిగా సాహిత్యంతో సుదీర్ఘమైన, గాఢమైన అనుబంధం ఉన్న మహిళ డొరోతీ పార్కర్ (ఆగస్ట్ 22, 1893 – జూన్ 7, 1967). ఆవిడ స్క్రీన్ ప్లే రాసిన సినిమాలు అకాడమీ అవార్డులని గెలుచుకుని ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. డొరోతీ రచనలు ఆమె ఆదర్శాలకి, రాజకీయ, సామాజిక అభిప్రాయాలకి అద్దం పడతాయి.

“నేనొక…
పూర్తిగా »

జూలై సంచికకు స్వాగతం

జూలై 2017


వాకిలి జూలై సంచికకు స్వాగతం. ఈ సంచికలోని విశేషాలు కొన్ని:

అతనికి కడుపునిండా తిండి దొరుకుతుంది, కానీ, వేళ కానీ వేళ, తను తినేది మరెవరికోసమో, ఆకలికి అజీర్తికీ మధ్య శరీరం సతమతమౌతుంటుంది. పెళ్ళాం పిల్లల్ని పస్తు పడుకోబెట్టి తను మాత్రం అతిగా తినకతప్పని ఒక మనిషి (ఒక వృత్తి)ని గురించిన అరిపిరాల కథ “తెల్లతాచు”-

బీఫ్ గురించిన చర్చలు, చట్టాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాతావరణాన్ని, సంస్కృతిని అత్యంత సహజంగా చూపించే చంద్రశేఖర్ కథ “బోరచెక్కు”-

స్నేహం, ప్రేమ, కొసమెరుపులతో సాగే ఆ ఐదుగురు స్నేహితుల మధ్య దాగిన రహస్యం “సాక్షి” కథ, విజయ కలం నుండి-

అనిల్ ఎస్.…
పూర్తిగా »

పుస్తక విమర్శకు ఆహ్వానం

జూన్ 2017


"ఈ పుస్తకం కొని అలమరాలో భద్రంగా దాచుకోదగింది". "...ప్రక్రియకు ఈ రచయిత్రే(తే) ఆద్యురాలు(డు)". "తన జాతి/వర్గం/ప్రాంతం/మతం/కులం/జెండర్ కోసం నిరంతరం పలవరిస్తుంటాడు". "ఎంతో సున్నితమయిన కవి. ఎక్కడా ఎప్పుడూ ఎవరినీ నొప్పించిన దాఖలాలు లేవు". "తన శత్రువుని సరిగ్గానే గుర్తించాడు, గుర్తించటమే కాదు సూటిగా శషభిషలు లేకుండా గురిపెట్టాడు. గురిపెట్టటమే కాదు తనేమిటో ప్రపంచానికి ప్రకటించాడు...". "అతడి కవిత్వాన్ని మౌనంగా చంపే పెద్ద కుట్ర జరుగుతోంది". "సాహితీలోకం అతడికి బ్రహ్మరథం పట్టింది". "కాలం అతన్ని కలగనింది. నిజానికి కాలాన్ని అతడే కన్నాడు". "కాదు అతడొక్కడే కనీ వినీ ఎరుగని ఒకే ఒక కవి (లేదా రచయిత)..."
పూర్తిగా »

కవిత్వం – 2016

జూన్ 2017


కవిత్వం – 2016

2016వ సంవత్సరంలో వివిధ పత్రికలలో, అంతర్జాల సాహిత్య పత్రికలలో వెలువడిన 60 ఉత్తమమైన కవితలను ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య సంపాదకత్వంలో ‘కవిత్వం – 2016’ పేరిట వరంగల్ కేంద్రంగా గల ‘కవన కుటీరం’ వెలువరించింది. దర్భశయనం గత 15 ఏళ్ళుగా ఈ వార్షిక కవితా సంకలనాలకు సంపాదకత్వం వహిస్తున్నారు.

‘కవిత్వం – 2016’ సంపుటిని 28 మే 2017 ఆదివారం ఉదయం, విప్లవకవి శ్రీ వరవరరావు గారు హైదరాబాద్ జవహర్ నగర్ లోని వారి ఇంట్లో కవిత్వ మిత్రుల నడుమ ఆవిష్కరించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో సంపాదకులు శ్రీనివాసాచార్య తో పాటు కవులు రమణజీవి, బా రహమతుల్లా, కూర్మనాధ్, కోడూరి విజయకుమార్,…
పూర్తిగా »

మే సంచిక

మే 2017


కాలేయం గురించి కవిత్వం రాస్తాడు. కథలతో కీమో థెరఫీ చేస్తాడు. సంకోచాలు లేని పద సంచయం అతనిది. సందేహాలు, మొహమాటాలు లేని సూటిదనం అతని వచనంలో గుచ్చుకుంటుంది. ఎవరికివారు నేనేనేమో అని తరచిచూసుకునేలాంటి పాత్రలు, వాస్తవంలోంచి త్రీడీ చిత్రాలుగా మనముందుకొచ్చే సన్నివేశాలు అతని స్పెషల్ మార్క్. డాక్టర్, రచయిత వంశీధర్ రెడ్డితో ఇంటర్వ్యూ ఈనెల ప్రత్యేకం.

గిరికుమారుని నవయవ్వన ప్రేమగీతాలనుంచి, కిన్నెరసాని పరుగులమీదుగా ప్రవహించి, భ్రష్టయోగి తత్వాన్ని చూపిన విశ్వనాథ గారి అసమాన కవితా ప్రతిభ, నవరసాల మేళవింపుతోసాగే ఆయన కాల్పనిక సృజనలను స్మరిస్తూ ఈ నెల ఎడిటర్స్ పిక్.

క్రైమ్ వెనక కథలు, కథల వెనక కరడుగట్టిన జీవితపు కత్తిపోట్లు, కలగలిసిన ఉత్కంఠ.…
పూర్తిగా »

విశ్వనాథ సత్యనారాయణ

మే 2017


విశ్వనాథ సత్యనారాయణ

మనుషులను అర్థం చేసుకోవటమూ, అపకారం జరిగితే మనసులో పెట్టుకోకుండా ఉండటమూ, మననీ ఎదటివారినీ కూడా క్షమించుకోగలగటం విశ్వనాథ గారి రచనల నుండి నేర్చుకావొచ్చు. చుట్టూ ఉన్నదాన్ని దాటి ముందుకూ నేలబారుతనాన్ని మించి ఎత్తుకూ చూడగల రచయిత. తనదైన తాత్విక దృక్పథం అతి బలవత్తరంగా ఉన్నప్పటికీ దానికి అవతల ఉన్నవారిపట్లా తీర్పు చెప్పేయరు. మానవీయమైనదంతా ఆయనకు పట్టుబడింది… అతిమానుషమైన దాని కోసం చేసే సాధన లౌకికానికి అడ్డురాలేదు. ప్రపంచాన్ని, కాలగమనాన్ని అంగీకరించేశాంతిని ఆయన వదులుకోలేదు. గిరికుమారుని నవయవ్వన ప్రేమగీతాలనుంచి, కిన్నెరసాని పరుగులమీదుగా ప్రవహించి, భ్రష్టయోగి తత్వాన్ని చూపిన విశ్వనాథ గారి అసమాన కవితా ప్రతిభ, నవరసాల మేళవింపుతోసాగే ఆయన కాల్పనిక సృజనలను స్మరిస్తూ ఈ నెల…
పూర్తిగా »

హేవళంబి నూతన సంవత్సర వాకిలి సంచికకు స్వాగతం.

ఏప్రిల్ 2017


ఈ సంచికలో-

అలంకారాల ఆడంబరాల దారినుండి సరళత వైపు, దృశ్యమానమైన వచనంవైపు తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన కవి ఇస్మాయిల్. ఈ కవి రచనలు, సదరు రచనలపై వచ్చిన పలు విమర్శ వ్యాసాలతో కూర్చిన “ఒకే ఒక్కడు ఇస్మాయిల్” ఈ నెల ఎడిటర్స్ పిక్.

అందరూ ఒకేరకంగా ఎందుకూ రాయడం అంటున్న కవీ, కథకుడూ ‘కన్నెగంటి చంద్ర’తో ముఖాముఖం.

రానారె గారి గొంతులో స.వెం.రమేశ్ గారి ప్రళయ కావేరి కథ ‘ఉత్తరపొద్దు’.

ఏప్రిల్ 17న మార్క్వెజ్ వర్ధంతి. One Hindered years of solitude పుస్తకానికి ఈ ఏడాదితో యాభయ్యేళ్ళు నిండుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని “యాభయ్యేళ్ల వందేళ్ల ఏకాంతం” పేరుతో…
పూర్తిగా »

ఒకే ఒక్కడు ఇస్మాయిల్

ఏప్రిల్ 2017


ఒకే ఒక్కడు ఇస్మాయిల్


భావచిత్రాల ద్వారా బలమైన అనుభూతిని అందించే ప్రతిభావంతులైన కవులలో ఇస్మాయిల్ ఒకరు. దృశ్యవర్ణనకు కవితాత్మకతను జోడించి, దాని మనోహరత్వాన్ని పాఠకుల అంతరంగాల్లో రిజిస్టర్/ఎస్టాబ్లిష్ చేయడమనే కళ ఆయనకు బాగా తెలుసు. దీన్ని సాధించటం కోసం ఏవైనా ప్రత్యేకమైన, అరుదైన పదాలను ఏరి కూర్చుతాడా అంటే అదీ లేదు. మామూలుగా అందరం మాట్లాడుకునే అలతి అలతి పదాలతోనే అలవోకగా సాధిస్తాడు ఆ విద్యను. భావాలను పదాల ద్వారా అద్భుతంగా దృశ్యమానం చేయటంలో ఆయన దిట్ట. లేదా దీన్నే దృశ్యాలు మెదడులోకి చొరబడేలా వాటిని పదాల్లో పొదగడం అనవచ్చునేమో. ఈ రెండు వాక్యాల మధ్య స్వల్పమైన భేదం ఉంటే ఉండొచ్చును కాని, ఇటువంటి నేర్పు ఉన్నవాళ్లకు…
పూర్తిగా »

మీరూ రాయండి చూద్దాం!

మార్చి 2017


“అట్లాగని పెద్ద బాధా ఉండదు” అనేది ఒక మో కవితలో మొదటి పంక్తి. ఈ పంక్తికి ముందు (తర్వాత కాదు) మీరేదన్నా పంక్తిని ఊహించి రాయగలరా? అది తమాషాగానూ ఉండవచ్చు, కవితాత్మకంగానూ ఉండవచ్చు, మీ ఇష్టం.


పూర్తిగా »

ప్రయాణానికే జీవితం

జనవరి 2015


ప్రయాణానికే జీవితం

ప్రయాణం ఒక సంగీతం, ఆరోహణలు, అవరోహణలు, అపస్వరాలు అన్నిటినీ దాటి చివరికి ఒక పాటని గుర్తుంచుకోవడం లాంటిది. ప్రయాణం ఒక సాహసం. సౌకర్యాన్ని వదులుకుని కొత్త అవసరాల్లోకి, సమస్యల్లోకి కోరి మరీ ప్రవేశించడం. వాటిలోంచి బయటపడి విజయగర్వంతో అనుభవాల్ని గెలుచుకు రావడం.
పూర్తిగా »