ఈ సంచికలో

జూలై సంచికకు స్వాగతం

జూలై 2017

వాకిలి జూలై సంచికకు స్వాగతం. ఈ సంచికలోని విశేషాలు కొన్ని:

అతనికి కడుపునిండా తిండి దొరుకుతుంది, కానీ, వేళ కానీ వేళ, తను తినేది మరెవరికోసమో, ఆకలికి అజీర్తికీ మధ్య శరీరం సతమతమౌతుంటుంది. పెళ్ళాం పిల్లల్ని పస్తు పడుకోబెట్టి తను మాత్రం అతిగా తినకతప్పని ఒక మనిషి (ఒక వృత్తి)ని గురించిన అరిపిరాల కథ “తెల్లతాచు”-

బీఫ్ గురించిన చర్చలు, చట్టాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాతావరణాన్ని, సంస్కృతిని అత్యంత సహజంగా చూపించే చంద్రశేఖర్ కథ “బోరచెక్కు”-

స్నేహం, ప్రేమ, కొసమెరుపులతో సాగే ఆ ఐదుగురు స్నేహితుల మధ్య దాగిన రహస్యం “సాక్షి” కథ, విజయ కలం నుండి-

అనిల్ ఎస్. రాయల్ గారి ‘నాగరికథ’ కథాసంపుటిపై చంద్రశేఖర రెడ్డి రాసిన సమీక్షా వ్యాసం-

చిన్ననాటి షికారీలు గుర్తుకు తెచ్చే నాగరాజు రవీందర్ కథ “షికారి”-

ఇకపోతే, నౌడూరి మూర్తిగారి Wakes on the Horizon పుస్తకంపై మానస సమీక్ష, నోబెల్ అవార్డ్ రచయిత విలియం ఫాక్‌నర్ పై సురేష్ గారి వ్యాసం ఈ నెల ప్రత్యేకం.

నుడి, కవితలు, ముషాయిరా గట్రా షరా మామూలే.