ఈ సంచికలో

హేవళంబి నూతన సంవత్సర వాకిలి సంచికకు స్వాగతం.

ఏప్రిల్ 2017

సంచికలో-

అలంకారాల ఆడంబరాల దారినుండి సరళత వైపు, దృశ్యమానమైన వచనంవైపు తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన కవి ఇస్మాయిల్. ఈ కవి రచనలు, సదరు రచనలపై వచ్చిన పలు విమర్శ వ్యాసాలతో కూర్చిన “ఒకే ఒక్కడు ఇస్మాయిల్” ఈ నెల ఎడిటర్స్ పిక్.

అందరూ ఒకేరకంగా ఎందుకూ రాయడం అంటున్న కవీ, కథకుడూ ‘కన్నెగంటి చంద్ర’తో ముఖాముఖం.

రానారె గారి గొంతులో స.వెం.రమేశ్ గారి ప్రళయ కావేరి కథ ‘ఉత్తరపొద్దు’.

ఏప్రిల్ 17న మార్క్వెజ్ వర్ధంతి. One Hindered years of solitude పుస్తకానికి ఈ ఏడాదితో యాభయ్యేళ్ళు నిండుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని “యాభయ్యేళ్ల వందేళ్ల ఏకాంతం” పేరుతో సురేష్ గారు తెలుగులోకి అనువాదం చేసిన మార్క్వైజ్ ఇంటర్వ్యూ.

చిన్న పిల్లలనుండి విశ్రాంత ఉద్యోగుల వరకూ అందరికీ ఆసక్తి కలిగించే వ్యాపకం నుడికట్టు. ఈ క్రాస్వర్డ్ పజిళ్ళ పరంపరలో చెప్పుకోదగ్గది హిందు పత్రికవారు నిర్వహిస్తున్న Crossword. ‘ద హిందు’ క్రాస్ వర్డ్ పజిళ్లలోని చమత్కార వైవిధ్యం, విస్తృతి, వైచిత్రి గురించి ఎలనాగ గారి ప్రత్యేక వ్యాసం.

1989 లో ‘ఆనంద వికడన్’ పత్రికలో వచ్చిన ప్రముఖ అరవ రచయిత సుజాత గారు రాసిన “ముదల్ మనైవి” కథకి అవినేని భాస్కర్ గారి అనువాదం.

కళాకారుల జీవితాల గురించి ప్రజలకి ఎప్పుడూ కుతూహలం ఉండటం సహజమే. వాళ్ళు నివసించిన ఇళ్ళు, వాడిన వస్తువులు, పదిలపరిచిన జ్ఞాపకాలు అన్నీ అపురూపమే. ఇటువంటి విషయాల గురించిన సమాచారమూ అరుదే. ఇటువంటి అరుదైన సమాచారాన్ని మనకందిస్తున్న సుజాత గారి వ్యాసం “హెమింగ్వే మ్యూజియం” ఈ నెల వాకిలి ప్రత్యేక ఆకర్షణ.

మిగతా కవితలు.. కథలు యధావిధిగా…