‘ స్వాతికుమారి బండ్లమూడి ’ రచనలు

ఎంతెంత దూరం?

ఎంతెంత దూరం?

దొరికిన చుక్కలన్నీ కలుపుకు పోతున్నా పూర్తికాని ముగ్గులా, అనుగ్రహించబడిన గాయాలన్నిటితోనూ అల్లిక వీలుకాని కవితలా, ఈ ప్రయాణం ఎప్పుడూ ఒక పలవరింతే. పలవరించే గొంతుక మాత్రం పలుకుపలుకుకీ బెంగటిల్లి పసిదై పోతుంది. జీవితకాలపు అనుభవాల అట్టడుగునించీ, వంటబట్టించుకున్న మాయమర్మపు లౌక్యపు మాటల చీలికల్లోంచి, ఒక యవ్వనపుజీరగా ఎగిసెగిసిపడుతుంది. మొహమాటాన్ని, మర్యాదల్నీ ధిక్కరించి, పలుకే బంగారమైన ప్రేయసిని పంతంగా ప్రేమిస్తూనే ఉంటుంది.
పూర్తిగా »

పలు సందర్భాల్లో – ప్రేమ

పలు సందర్భాల్లో – ప్రేమ

నీకో ముద్ద తినిపించి
దిష్టితీసి మొటికలు విరిచి
"తూ... తూ" అనిపించి
దోసిలి విసిరాను-
అవే
ఈ నక్షత్రాలన్నీ

పూర్తిగా »

ఒక ఫోన్ కాల్ – డొరోతీ పార్కర్

ఒక ఫోన్ కాల్ – డొరోతీ పార్కర్


దేవుడా దేవుడా, అతను నాకు ఫోన్ చేస్తే బాగుండు. పోనీ నేనే చేస్తే? నిజంగా ఇంకెప్పుడూ నిన్నేం కోరుకోను, నిజ్జం. భగవంతుడా…ఇదంత పెద్ద కోరిక కూడా కాదు, నీకిది చాలా చిన్నది. చాలా చాలా చిన్నది. దేవుడా అతను ఫోన్ చేసేలా చూడు. ప్లీజ్ ప్లీజ్.

ఒకవేళ నేను ఈ సంగతి ఆలోచించకపోతే ఫోన్ మోగుతుందేమో. అవును, కొన్నిసార్లు అలాగే ఔతుంది. పోనీ వేరే ఏదైనా విషయం గురించి ఆలోచిస్తే? ఐదైదు అంకెలు వదుల్తూ ఐదొందలు లెక్కపెట్టుకుంటా, నిదానంగా. లెక్క పూర్తయ్యేసరికి మోగొచ్చు. అన్ని అంకెలూ లెక్కపెడతా, ఏదీ వదలను. మూడొందలు లెక్కపెట్టేశాక మోగినా కూడా లెక్క ఆపను. ఐదొందలూ పూర్తయ్యేదాక ఫోన్…
పూర్తిగా »

ముఖాముఖి

ముఖాముఖి

మగవారికి నచ్చే మగువలు;
చెడుమాటలు వింటే మూసుకుంటారు చెవులు.

ఒకేవొత్తితో వెలుగుతుందివాళ్ల దీపం,
రాత్రయితే మాత్రం బయటికి రారు పాపం.
పూర్తిగా »

ఆ తర్వాత

ఆ తర్వాత

తనని తాను రెండుగా చేసుకొనుటకు ఆమె చేత వాళ్ళు అంగీకరింపజేసిన వృత్తాంతాన్ని నిన్న ఆసాంతం చదువుకున్నాం.
ఏడ్చి రప్పించడం, ఏడిపించి పంపించడం ఎన్ని యుగాలనాటి ఆట కదా వాళ్లకి!
లతలు పన్నడం, వలలు దాచడం,
ప్రాణం నింపడం, పిట్టలై ఎగిరాక గురిచూసి పడగొట్టడం
ఏ జన్మలోనో వంటబట్టిన కిటుకులు.

సుదీర్ఘ కావ్యాల, ఆకర్ణాంత నేత్రాల, కనకమయచేలాంచలాల చాటుని జీర్ణదేహాలు,
మానని గాయాల, ఆగని స్రావాల, ఆరని దుఃఖాల వెనక నదీమూలాలు.
ఇదిలా ఉండగా…
పూరేకు మబ్బులు ఉప్పుటేళ్లపై వర్షించాక,
ఎగిరిపోయిన పావురాల గుర్తుగా రాలిన ఈకలు మాత్రం మిగిలిపోయాక,
అమ్మ మీద…
పూర్తిగా »

పుస్తకానికో నివాళి

పుస్తకానికో నివాళి

పుస్తకాన్ని మూసేసి జీవితాన్ని తెరిచిన క్షణాన
ఓడరేవులనుంచి పీలగొంతుల అరుపులు,
ఇసుకలో తవ్వుకుంటూ స్వదేశానికి సాగిపోయే రాగితెడ్ల చప్పుళ్ళు
వినపడతాయి.
రాత్రిళ్ళు ద్వీపాల మధ్యన మా సముద్రం
ఎగిరిదూకే చేపలతో తుళ్ళిపడుతుంది,
దేశపు పాదాల్ని తాకి, తొడలమీదుగా పైపైకి ఎగబాకి,
పాలిపోయిన పక్కటెముకల్ని చేరుతుంది.
రాత్రంతా తీరాన్ని కావలించుకు పడుకుని,
తెల్లారేసరికి గిటార్ తీగల్ని ఉన్మత్తపరిచే
పాటలతో నిద్రలేస్తుంది.

అదిగో.. ఆ మహా తరంగం పిలుస్తోంది.
ఆ సముద్రపు గాలి పిలుస్తోంది.
నా సావాసగాళ్ళు, తోటి ఉద్యమకారులు పిలుస్తున్నారు.
మైన్ యూనియన్ నుండి ఒక ఉత్తరం…
పూర్తిగా »

మా మంచి చెల్లెలు

మా మంచి చెల్లెలు

మా చెల్లెలు కవితలు రాయదు ఇప్పుడు అకస్మాత్తుగా రాసే అవకాశమూ లేదు. తను కూడా అచ్చం అమ్మలాగే. అమ్మ ఎప్పుడూ ఏం రాయలేదు. కాస్త నాన్నలా కూడా, ఆయనా ఎప్పుడూ ఏం రాసిన గుర్తులేదు.
పూర్తిగా »

మీకు తెలుసా?

ఈ శీర్షికలో ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి, అప్పుడప్పుడు ఇతర భాషల, ఇతర దేశాల సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మీ సమాధానాల్ని ఈమెయిలు (vaakili.editor@gmail.com) ద్వారా తెలియజేయండి. సరైన సమాధానాలను తరువాతి సంచికలో తెలియజేస్తాము.

***

ఈ నెల ప్రశ్నలు

1. శత్రువు, హృదయం అనే రెండు కథలు ఉన్న ఒక కథల పుస్తకం పేరు?. (ఈ పుస్తకం 2013 లో ప్రచురించబడింది. పుస్తకం పేరులో ఒక జంతువుంది.)
(క్లూ: పాండవులెంతమందీ అనడిగితే నలుగురే అంటారు ఈ రచయిత.)

2. “మట్టిపెళ్ళలు ఎప్పటికప్పుడు విరిగిపడుతున్నాయి,
పంకం పొగలాగా నీళ్లల్లో సుళ్ళు తిరుగుతున్నది
గట్టు నిలదొక్కుకోడానికి కొద్దిసేపు పడుతుంది

పూర్తిగా »

ఉలిపికట్టె

ఉలిపికట్టె

అనగనగా ఒక ఊరు. ఆ ఊరంతా దొంగలే. చీకటి పడగానే ప్రతీవాడూ దొంగతాళాల గుత్తి బొడ్లో దోపుకుని గుడ్డి లాంతరు చేత పట్టుకుని బయల్దేరేవాడు. దొరికిన ఇళ్ళల్లో దూరడం, చేతికందింది మూటగట్టుకోడం. తెల్లారేవేళకి దొంగసొమ్ముతో ఇంటికి చేరేసరికి వాడిల్లు ఇంకెవడి చేతిలోనే గుల్లయి ఉండేది.

అలా అందరూ ఒకరినొకరు దోచుకునే వాళ్ళు. కలిసి మెలిసి సుఖంగా బతికేవాళ్ళు. ఒకడు ఎదిగిందీ, ఇంకోడు చితికిపోయిందీ లేదు. ఒకణ్ణొకడు దోచుకుంటూ, ఆ గొలుసు దొంగతనాలు ఊళ్ళో చివరి వాడు తిరిగి మొదటివాడిల్లు కొట్టెసేదాకా క్రమం తప్పకుండా సాగేవి. ఆ వూర్లో వ్యాపారమంతా అమ్మేవాళ్ల, కొనేవాళ్ళ మోసపు తెలివితేటల మీదే నడిచిపోయేది. అక్కడి ప్రభుత్వం ఒక మాఫియా. ప్రజల్ని వీలైనన్ని…
పూర్తిగా »

గడ్డిపోచలు – 5

అడుగెయ్యగానే కర్రలవంతెన ఊగుతుంది. వెనక్కి తగ్గి మురుగునీళ్ళలోంచే అవతలికి నడిచెళ్తావు. టార్చి వెలుతురు గుండ్రంగా కదుల్తూ ముందుకెళ్తుంది. పేరు తెలీని ఆ వూళ్ళో చేపల వాళ్ళెవరో భోజనానికి పిలుస్తారు. రేపు రాత్రికెలాగో ఉల్లిపాయలు, దుంపలూ కాల్చుకు తినాలి అనుకుంటూ వాళ్ళ వరండాలో ఆకు ముందేసుకుని కూర్చుంటావు. బారు లంగా, పూల గాజులు వేసుకున్న పిల్ల ఒక్కత్తే కంకర్రాళ్ళతో గిల్లాయిలాట ఆడుకుంటుంది. ఆ పిల్ల నాన్న వెర్రిబాగులోడు, అరుగు మీద బోర్లా పడుకుని ఆపకుండా గొణుగుతూనే ఉంటాడు. లావుపాటి అన్నం లోకి, పెద్ద పెద్ద కూరముక్కల పులుసు. నీకు ఇల్లు గుర్తొస్తుంది. ఓ మూలన సొట్ట పడ్డ ఇరవయ్యేళ్ళనాటి నీ అరిటాకు కంచం, ఈ మధ్యనే పెళ్ళి…
పూర్తిగా »