కవిత్వం

ముఖాముఖి

సెప్టెంబర్ 2017

గవారికి నచ్చే మగువలు;
చెడుమాటలు వింటే మూసుకుంటారు చెవులు.

ఒకేవొత్తితో వెలుగుతుందివాళ్ల దీపం,
రాత్రయితే మాత్రం బయటికి రారు పాపం.

నడిరాత్రి మేలుకోవటం కాదు వారి తత్వం,
చదవరు అసలే శృంగార కవిత్వం.

చెడునడతను వాళ్ళు ఒప్పుకోలేరు,
కచేరీలో రాగాలేమిటో చెప్పుకోలేరు.

మొహమ్మీదైనా కాగితమ్మీదైనా- రంగులకి ఆమడ దూరం…
ఈమాత్రానికే ఐతే వాళ్లమీద నేనేం మోపను నేరం.

 
 
 
Translated By: Swathi kumari . B
Original: Dorothy Parker – https://www.poetryfoundation.org/poems/44830/interview-56d22412c4b44