ఈ శీర్షికలో ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి, అప్పుడప్పుడు ఇతర భాషల, ఇతర దేశాల సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మీ సమాధానాల్ని ఈమెయిలు (vaakili.editor@gmail.com) ద్వారా తెలియజేయండి. సరైన సమాధానాలను తరువాతి సంచికలో తెలియజేస్తాము.
***
ఈ నెల ప్రశ్నలు
1. శత్రువు, హృదయం అనే రెండు కథలు ఉన్న ఒక కథల పుస్తకం పేరు?. (ఈ పుస్తకం 2013 లో ప్రచురించబడింది. పుస్తకం పేరులో ఒక జంతువుంది.)
(క్లూ: పాండవులెంతమందీ అనడిగితే నలుగురే అంటారు ఈ రచయిత.)
2. “మట్టిపెళ్ళలు ఎప్పటికప్పుడు విరిగిపడుతున్నాయి,
పంకం పొగలాగా నీళ్లల్లో సుళ్ళు తిరుగుతున్నది
గట్టు నిలదొక్కుకోడానికి కొద్దిసేపు పడుతుంది
చెయ్యగలిగిందల్లా వేచిచూడటమే”
ఈ కవిత్వపాదాల కవి ఎవరు?
(క్లూ: ఈకవి చిత్రకారుడు కూడా!)
3. “పైన ఉదాహరించిన ప్రభువరేణ్యుని అద్భుతచర్యలు మా ప్రాంతములలో తఱచుగా చెప్పుకుంటూ వుంటారు. నాకు కొంచం ప్రాజ్ఞత కలిగేటప్పటికి వీరు తుట్టతుది దశలో ఉన్నారు. ……. నేను కాశీకావడి బుజాన్ని పట్టుకుని వచ్చే రోజులలో తునికిన్నీ అన్నవరానికిన్నీ మధ్యగావున్న తేటగుంట, తిమ్మపురం వద్దకు వచ్చేటప్పటికి యీ మహారాజు ద్వాదశాహస్సునాటి సంభావన పుచ్చుకున్న బ్రాహ్మణ్యం ఎదురుగా వచ్చింది.”
ఈ పరిచయంతో మొదటి అధ్యాయం మొదలైన పుస్తకం ఏది?
(క్లూ: ఈ పుస్తకం రచయిత తెలుగునాట పేరుమోసిన జంటకవుల్లో ఒకరు)
**** (*) ****
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్