ప్రత్యేకం

పాత సామాన్లు – ఉల్లిపాయలు

పాత సామాన్లు – ఉల్లిపాయలు

తమ కవిత్వానికి కావాల్సిన వస్తువుల విషయంలో కొత్త బాటలు పట్టకుండా కవులు తరచుగా బాగా నలిగిన పాత బాటలోనే గుంపుగా నడవడం కద్దు. కవులు తరచుగాను, తరతరాలుగాను వాడతున్న ఆ పాత వస్తువుల్లో మచ్చుకి కొన్ని.

1. బంధాలు-అనుబంధాలు

అమ్మ అన్నా, అన్న అన్నా, నాన్నన్నా ఇంకా ఇతర బంధుత్వాలన్నా పిచ్చి ప్రేమ. అమ్మ పెట్టిన ముద్ద, నాన్న కొట్టిన దెబ్బ, చెల్లితో పంచుకున్న జీడీ, మరదలు పెట్టిన ముద్దు, అన్న కొన్న చొక్కా ఇలాంటివి. జ్ఞాపకాల పుట్టని కదిలిస్తే కాగితం మీద పరుగులు తీసే నల్ల చీమల్లాంటి కవితాక్షరాలు వేలకు వేలు. ఇవికాక కన్నఊరన్నా, పుట్టిన దేశం అన్నా వల్లమాలిన అభిమానం.

సాధారణంగా హైదరాబాదులోనో,…
పూర్తిగా »

అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య

అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య

తొలితరం ఉద్యమ రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యులు అస్తమయం తెలుగు జాతి ప్రజలకు – సాహిత్యానికి తీరని లోటు. వేదం నుంచి ఉద్యమం దాకా దగ్గరగా లోతుగా పరిశీలించి రచనలు చేసిన విలక్షణ రచయిత రంగాచార్య. బాల్యం నుంచి చివరి శ్వాస దాకా వివిధ సాహితీ ప్రక్రియల్లో ఆయన రచనలు చేశారు. రంగాచార్య జీవితం భిన్న వైరుధ్యాల నిలయం. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లా ఉండే అంశాలు ఆయనలో ఒక్కటిగా కలిసి కాపురం చేస్తాయి. ఆయనను చూస్తే, నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన పోరులో తుపాకీ పట్టిన యోధుడని, ఆయన నుదిటి పై కనిపించే తిరునామాలు చూసి ఆయనొక మార్క్సిస్ట్…
పూర్తిగా »

నత్కీరుడు… నిబద్ధతా

నత్కీరుడు… నిబద్ధతా

పూర్వం దక్షిణదేశాన్ని పాండ్య రాజు పరిపాలించేవాడు. ఆ రాజుదగ్గర వంశపారంపర్యంగా వచ్చిన సరస్వతీదత్తమైన ఒక "శంఖపీఠం" ఉంది. దాని ప్రత్యేకత… దాని మీద కవులైనవారు ఎవరైనా కూర్చుంటే మరొక్కరు కూచుందికి అవకాశం కల్పిస్తుంది. అలా కల్పించలేదంటే, కూచున్న వ్యక్తి కవి కాదన్నట్టే లెఖ్ఖ. అటువంటి శంఖపీఠంపై కూర్చున్న అతని ఆస్థాన కవులలో అగ్రగణ్యుడు నత్కీరుడు.
పూర్తిగా »

ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?

ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?

నేను చ్ఛందో బద్ధ కవిత్వం అనే పదం వాడను.ఛందోయుక్త కవిత్వం అంటాను.ఈ వ్యాసం యొక్క ఉద్దేశం చందస్సు తెలియని వారికి కొంత పరిచయం ఇవ్వటం, తెలిసినా వ్రాయటానికి జంకే వారికి కొన్ని సులభోపాయాలు ఇవ్వటం.

ఛందస్సు అంటే ఏమిటి? ఛందస్సు కూడా ఒక సంగీతం వంటిది.ఒక లయ.అక్షరాలని ఒకవిధమైన అమరిక లో ఉంచటం ద్వారా ఆ అక్షరాలు అసంకల్పితంగా ఒక లయని తయారు చేస్తాయి.అదే ఛందస్సు. ఇంతకీ ఛందస్సు కష్టమా? తేలికా? అంటే-”ఇది చాలా ఈజీ అనటం అహంకారమే అవుతుంది. నిర్లక్ష్యము అవుతుంది.”చాలా కష్టం” అంటే నేర్చుకొనే వారిని నిరుత్సాహ పరచటం అవుతుంది.కాస్తా కూస్తా కష్ట పడకుండా ఏ విద్యా రాదు. మన మొహం ,…
పూర్తిగా »

వొస్తే రానీ పొద్దుమీకి..

జూన్ 2015


వొస్తే రానీ పొద్దుమీకి..

ఆ గట్టు మీంచి ఈ గట్టుకి రివ్వురివ్వున దూకే మెరుపు పురుగు రెక్కవిరిగిన చప్పుడుకి గుండె గుభేల్మంటుంది. బండి లాంటి వెండి వాడు నడుస్తూ నడుస్తూ అలా.. ఆ మలుపు లోయలో జారిపడి కళ్ళ ముందే శూన్యమైపోయినప్పుడు- పగిలిన కాలానికి, మిగిలిన నిశ్శబ్దానికి మనసు బరువై దివులౌతుంది.
పూర్తిగా »

ఒకే కవిత నాలుగు అనువాదాలు!

ఒకే కవిత నాలుగు అనువాదాలు!

కవిత్వం ఒక క్రియాత్మక వ్యవసాయం అనుకుంటే అందులో రెండు రకాలున్నాయి. ఒకతీ కవి స్వతహగా తన ప్రేరణతో రాసే కవిత్వం. రెండో రకం, అంతకంటే తక్కువ స్థాయిది అయినప్పటికీ, ఒక మూల భాషలోని సౌందర్యాన్ని తనకి ఒద్దికగా ఉన్న మరో భాషలోకి చేసే అనువాదం. అందుకే అనువాదాన్ని అనుసృజన అనవచ్చు. నిజానికి ప్రతి భాషలోను తొలుత వచ్చేవి అనువాదాలే. కారణం ఆ భాష ఇంకా స్థిరపడకపోవడం, అంతవరకు మరొక భాషతో కలిసి ఉన్న ఆ భాష తన అస్థిత్వాన్ని నిలుపుకోవడంలో భాగంగా సాహిత్య సృష్టి చెయ్యవలసిన అవసరం రావడం కొన్ని ముఖ్యమైన కారణాలు. అనువాదాల్లో మాతృకకి దగ్గరగా ఉన్నవి కొన్నయితే, కొన్ని కేవలం నామమాత్ర…
పూర్తిగా »

రాలిన తెలియనితనం : ‘Nutting’ by William Wordsworth

ఫిబ్రవరి 2015


రాలిన తెలియనితనం : ‘Nutting’  by William Wordsworth

ప్రకృతిని అద్భుతంగా వర్ణించటం ఎందరో కవులు చేశారు, కాని- దానితో ఒక అత్యవసరమైన లయను పొసగించుకోవటాన్ని, అప్పుడు రాగల శాంతిని [ఏదో మరొక లోకం లోకి ముక్తి కోసం కాక ] వాస్తవజీవి తంలోకి తెచ్చుకోవటాన్ని- వర్డ్స్ వర్త్ మాత్రమే చెప్పారు.

పద్యం ఒక గంధర్వగాథ [fairy tale ] లాగా మొదలవుతుంది, అయితే ఇక్కడి నాయకుడు సాధించే సంపద భౌతికమైనది కాదు. ఉత్తమపురుష లో సాగే కథనం ఒక కుర్రవాడి పరంగా ఉంటుంది, కాని అతని ప్రయాణం, అన్వేషణ చదువరిది కూడా.

‘’ అదొక దివ్యమైన రోజని అనిపిస్తుంటుంది ఇప్పుడు. ఎవరో పురమాయించారు నన్ను…ఎవరివో బట్టలు వేసుకు కుటీరపు ముంగిలి వదిలి అడవిలోకి…
పూర్తిగా »

ఆత్రమే ఆనందం

ఫిబ్రవరి 2015


ఆత్రమే ఆనందం

“ఏనుగమ్మా ఏనుగు
మా ఊరొచ్చిందేనుగు
మంచినీళ్ళు తాగిందేనుగూ…”

వీథిలో కొత్త వింత కానీ, ఇష్టమైన జంతువు కానీ, అపురూపమైనదేదైనా కానీ, లేక గొప్ప వ్యక్తి కానీ కనబడబోతుందంటే చాలు – పట్టరాని ఆత్రుత మనకు. ఈ ఆత్రుత విషయంలో పిల్లలకూ పెద్దలకూ తేడాయే కనబడదు. ఆ ఆత్రుత వల్ల ఒక్కోసారి ఒళ్ళు కూడా తెలీదు.

80 వ దశకంలో బాల్యాన్ని గడిపిన వారికి తెలిసి ఉంటుంది. సినిమా బండి వస్తే చాలు. ఆ బండి వెనక పరిగెత్తటం, ఆ బండి వాడు ఇచ్చే సినిమా ప్రచారకరపత్రాన్ని ఎలాగైనా తీసుకోవటం ఎంత సంబరంగా ఉండేదో!

ఈ ఆత్రుత పసిపిల్లల విషయంలో ముద్దు.

ఐసుక్రీము బండిపూర్తిగా »

ఒక గుండుబాబు కథ!

జనవరి 2015


ఒక గుండుబాబు కథ!

ఒక విషయానికి మనం నిజంగా కే వీ రెడ్డిగారిని మెచ్చుకోవాలి. ఎస్వీరంగారావు గారి ఆహార్యం డిసైడ్ చేసేప్పుడు కోరలూ, అవీ లేకుండా ఎంచక్కా అందగాడుగా, అదే సమయంలో భీతావహుడుగా తీర్చిదిద్దారు. నన్నయ్య గారి హీరోలా కారుమేఘంలా చేయక దబ్బపండు ఛాయలో మెరిసే ఎస్వీ యారు గారిని పెట్టేరు. ఘటోత్కచుని తల్లి రాక్షసి కాబట్టి నల్లగా కారుమేఘంలాంటి శరీరమని కవులు చెప్పేరు. తద్విరుద్ధంగా మాయాబజారు ఘటోత్కచునిది తండ్రి పోలిక. "ఛాంగురే బంగారు రాజా" అన్నట్టున తండ్రి రంగులో మనవాడినీ తీర్చిదిద్దారు. కిరీటం వెనకాల చిత్రమైన జుత్తు పెట్టేరు. తెలుగు "వాడి" స్టయిలుకు ప్రతిరూపంగా మీసమూ పెట్టేరు.
పూర్తిగా »

దారా షుకోయ్ (20 మార్చి 1615 – 9 సెప్టెంబర్ 1659)

దారా షుకోయ్ (20 మార్చి 1615 – 9 సెప్టెంబర్ 1659)

ప్రపంచానికి వెలుగు చూపించినవి ఉపనిషత్తులని మనం మురిసిపోవచ్చుగాని, బహుశా 4 వందల ఏళ్ళ క్రిందట ఒక మొగలాయీ యువరాజు, ముస్లిము మేధావి …  లాహోరుకి చెందిన ప్రముఖ Qadiri Sufi Saint Hazrat Mian Miir శిష్యుడూ,  50 ఉపనిషత్తులని కాశ్మీరునుండి పండితులని రప్పించుకుని, స్వయంగానో, వారి సహాయంతోనో సంస్కృతం నుండి పెర్షియనులోకి  అనువాదం చేసి ఉండి ఉండకపోతే, బహుశా ఈ నాటికీ అవి వెలుగుకి నోచుకుని ఉండేవి కావు… అని అంటే ఆశ్చర్యం కలగక మానదు.  అంతే కాదు, చక్రవర్తి అక్బరు అవలంబించిన పరమత సహనాన్ని బాహాటంగా సమర్థించి, ఆచరణలోచూపిన వాడు అతను.

అతని ఉపనిషత్తుల అనువాదాన్ని Sirr-e-Akbar (The Greatest Mystery) అని…
పూర్తిగా »