సంచిక: జనవరి 2013

అతీతం

జనవరి 2013 : కవిత్వం


నులివెచ్చని ఊపిరి
 అణువణువూ మెలివేస్తుంటే
ఎక్కడో పొంగుతున్న శబ్ధం
మరెక్కడో తొలుస్తున్న నిశ్శబ్ధం
ఆర్తిగా పరుగెట్టే శక్తి
సంతోషం లో
తియ్యని దుఖాన్ని కలిపి
సన్నని మకార శబ్ధాన్ని
మార్చి మార్చి వినిపిస్తుంటే

చూపుల శంఖారావాలతో
మొదలయ్యు
మరణాలులేని
ఓటములులేని
మహాయుద్దం జరుగుతోంది

యుద్దం ముగిసిన ఎప్పటికో
చావులు లేకున్నా
ఏడుపులు వినిపిస్తాయి
వెనువెంటనే నవ్వులూ వికసిస్తాయి

శృష్టి నిండా మిణుగురుపూల వాన
తడవకా తప్పదు
ప్రేమ ద్వారాల గుండా నడవకా తప్పదు

 


పూర్తిగా »

కవిత ఎలా ఉండాలి ?

జనవరి 2013 : కవిత్వం


 

స్ఫటికం లా… అంది నిశ్చల సరస్సు మెరుస్తూ

నాలా ఉదాత్తంగా — గంభీరంగా పలికింది మహావృక్షం

నిరాఘాటం గా ప్రవహించాలి — గలగలలాడింది సెలయేరు

సద్యః స్ఫురణ కలిగిస్తూ జీవం తొణికిసలాడాలి — కూని రాగాలు పోయింది పిట్ట

సువాసనలతో మత్తెక్కించాలి — ఝుంకరించింది తుమ్మెద

మనసు దోచుకోవాలి — నవ్వింది సీతాకోక చిలుక

రమణీయం గా ఉండాలంటేనో ? అడిగాయి పూలు

లోతుగా సారవంతంగా ఉండాలి — ఘోషించింది లోయ

కొంత రాజసం కూడా ఉండాలి — ప్రతిధ్వనించాయి కొండలు

ఆహ్లాద పరచాలి సుమా— గుసగుస లాడింది వేసవి తెమ్మెర

కరిగిపోతూ ఆలోచనలు గిలకొట్టాలి — గలగలమన్నాయి శిశిర పుటాలు

 

ఇకనేం…
పూర్తిగా »

రెండు మర్రి మానులు

జనవరి 2013 : కవిత్వం


ఒక పచ్చటి మర్రి మాను సేద తీర్చుకుంటున్న నల్లని,గోధూళి రంగు ఆవులు నును వెచ్చని కంబళిలా మర్రి నీడలోకి చొచ్చుకుపోతున్న ఎండ. ఇంకొద్ది దూరంలో శిధిలమైన ఇంటి పక్కన కొట్టేసిన మర్రి మాను గోడకి లేలేత ఆకుపచ్చని నీరెండ తోరణం. పుడమింటి నీడలా పునరావృతమయ్యే గుణానికి ప్రణమిల్లి సదా పయనించే కోరికని తీర్చమని మర్రి మాను చుట్టూ దారం కట్టి పచ్చ బూడిద రంగుని నుదుటనద్దుకుని గాలి ఊడల వేర్ల పడవలో నా దారి పట్టాను (కొత్తిల్లు,రామసముద్రం మండలం,చిత్తూరు జిల్లా,22-12-12), 26-12-12
పూర్తిగా »

స్వరకర్త… WH ఆడెన్

జనవరి 2013 : కవిత్వం


ఇతర కళాకారులంతా అనువాదకులే;
చిత్రకారుడు కనిపిస్తున్న ప్రకృతిని గీస్తాడు, మెచ్చినా, మరచినా;
తనజీవితాన్ని శోధించి శోధించి కవి బయటకి తీస్తాడు ప్రతీకల్ని,
మనసుని కలచి, అనుభూతి పంచుకుందికి.
“జీవితం నుండి కళ” ఒక బాధామయమైన రూపాంతరీకరణ
మధ్య అగాధాన్ని మనమేదో పూడ్చగలిగినట్టు ఆధారపడుతూ;
ఒక్క నీ స్వరాలే స్వచ్ఛమైన కల్పనలు
ఒక్క నీ గీతమే పరిపూర్ణమైన బహుమతి!
.
ఓ చెవులపండువా! జలపాతంలా సాక్షాత్కరించు!
ఈ స్తబ్ధ వాతావరణాన్నీ, మా సందేహాల్నీ ఛేదిస్తూ,
వంగుతున్న నడుముల్నీ, వాలుతున్న మోకాళ్ళనీ లేవనెత్తు.
ఓ నిరాకార గీతమా! ఒక్కతెవే, ఒక్క నువ్వొకతెవే,పూర్తిగా »

నేనూ ఓ మట్టిపొయ్యి

జనవరి 2013 : కవిత్వం


రోడ్డు మీదవోయేటోల్లంతా మా సుట్టాలే
ఎవరొస్తె ఆళ్ళకు చాయ్ వోస్తం
ఆల్లే మాకు తిండివెట్టేది
ఆరు గజాల గుడిశే మా ఇల్లు
నేను నా మొగుడు ముగ్గురు పిల్లలు
అండ్లనే మా చాయ్ దుకాణం హైవే మీద

బస్సులన్నీ నా ఇంటిముందే ఆగుతయ్ గానీ
పక్కనున్న దాబాలకే అన్ని కాళ్ళు నడిశేది
ఎవరో ఒకరిద్దరు మా మట్టి చాయ్ కోసమొస్తరు
ఏసీ బస్సులల్ల తిరిగేటోల్లు
మా చాయేందాగుతరని సర్దుకుంటగానీ
ధాబాల సలీంగాని చెమటరాలే చేతుల
కంపుశాయి ఈళ్ళకి ఇంపెట్లయితదో
నాకెంతకీ అర్ధంగాదు

పొద్దుపొద్దుగాల పోరలని పుల్లలేరవంపుత
అవే…
పూర్తిగా »

అమ్మతో మాట్లాడని మాటలు!

జనవరి 2013 : కవిత్వం


 ఎవరైనా ఎప్పుడైనా అమ్మ తో మాట్లాడారా?

దివారాత్రుల నడుమ మూడో కన్నులా
నిరంతరం మెలకువ తో జీవించే అమ్మతో
ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా?

అమ్మా! నువ్వంటే నాకిష్టమని చెప్పేలోగా
నేనంటే ఎంత ప్రాణమో
ఆమె తన ప్రేమ చూపించేది….

అంతే…ఇక నేను మాట్లాడనే లేదు….
నీకేమైనా సహాయం చేయాలా అని అడిగేలోగా
నా పనులన్నీ తనే చేసి పెట్టేసేది

అంతే…ఇక నేను మాట్లాడనే లేదు….

మొదటి సారి నేను ఇల్లొదిలి వెళ్ళేటప్పుడు
ఆమె కన్నీళ్ళ నది లో
వాళ్ళ అమ్మ రూపం కనిపించింది నాకు
నా పిచ్చి తల్లి వాళ్ళ అమ్మ కోసంపూర్తిగా »

ఆఖరితనం

జనవరి 2013 : కవిత్వం


1
ఎప్పుడో గానీ ఎదురయ్యే
ఆ చిన్న పలకరింతకు కూడా
సమాధానం సంధించే భిగువు
ఇప్పుడీ పెదాల్లో లేదు.

2
కలలు వలసబోయిన రెప్పల కింద
కన్నీటి బిందువు కూడా ఎదగనంటే

ఏ తోడూ లేని చిటికెన వేలును
ఊతకర్ర కూడా వెలేస్తే

వ్యాకోచించని ఊపిరితిత్తుల లోయలోకి
ఊయలూగ ప్రాణవాయువు కూడా రానంటే

అరిచేతుల్లోంచి అదృశ్యమైన అదృష్టరేఖలు
అదాటున దేహమంతా పాకి ప్రశ్నిస్తున్నట్టు

అందర్నీ దేవుని సన్నిధికి చేర్చిన గుడిమెట్టు
శిధిలమై దేవునికి దూరంగా రాలిపడుతున్నట్టు

మళ్ళీ మొదలైన
ఆఖరితనం.

3
చెయ్యందించి
చివరి బండెక్కించడానికి

పూర్తిగా »

అనుక్షణికాలు-10

జనవరి 2013 : కవిత్వం


For last year’s words belong to last year’s language
And next year’s words await another voice. (T.S. Eliot).

1
వెళ్లిపోతున్నప్పుడు
తనేమీ చెప్పలేదు
‘సరే, ఇక వుంటాన్లే’ అని కూడా!

2
ఎన్ని సార్లు అలా వచ్చి
ఇలా వెళ్లిపోలేదని!
వచ్చిన ప్రతిసారీ అనుకున్నానా
అలాగే ఇక్కడే వుంటావని!

వెళ్ళిన ప్రతిసారీ అనుకున్నానా
ఇలాగే ఎక్కడికో వెళ్లిపోతావని!

3
ఆశ్చర్యం కాని క్షణం
వొక్కటంటే వొక్కటి
వుందా చెప్పు!
ప్రతీ క్షణం సతమతమే
ఇంకో కొత్త క్షణాన్ని

పూర్తిగా »