నుడి

నుడి-13 (నవంబర్ 2016) & నుడి-12 (అక్టోబర్ 2016) ఫలితాలు

నవంబర్ 2016


నుడి-12 ఫలితాలు, జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం.

ఈసారి ఎక్కువ మంది 15 నిలువు, 28 నిలువు, 37 అడ్డం దగ్గర తడబడ్డారు.

ఆల్ కరెక్ట్ గా పూరించినవారు:
1. దేవరకొండ

ఒక తప్పుతో పూరించినవారు:
1. రవిచంద్ర ఇనగంటి
2. కామేశ్వర రావు

విజేతలకు అభినందనలు.

ఇటువంటి Cryptic puzzles పట్ల ఎంతమాత్రం అవగాహన లేని కొత్తవాళ్ల కోసం మాత్రమే జవాబులకు వివరణలు ఇస్తూ వస్తున్నాను. వారికి ఈ రకమైన ప్రహేళికలను అలవాటు చెయ్యాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఒక సంవత్సరం గడిచింది కనుక, ఇకమీదట కొన్ని ఆధారాలకు/జవాబులకు (కొంచెం జటిలంగా ఉన్నవాటికీ, చెప్తే తప్ప చమత్కారం అర్థం కానివాటికి) మాత్రమే వివరణలనిస్తాను – అది కూడా సంక్షిప్తంగా.

వివరణలు:
13 అడ్డం: రివర్సులో రాలిపోగా = గాపోలిరా. ‘రా’లేదు ‘పో’లేదు అన్నాం కనుక, సమాధానం గాలి.
21 అడ్డం: పాదం = అడుగు, కింద = అడుగు, పన్నెండంగుళాలు = అడుగు, ప్రశ్నించు = అడుగు!
29 అడ్డం: విలువైన రాయి = పచ్చ. యుద్ధం = రణం. రోజూ పెళ్లి = నిత్యకల్యాణం!
33 అడ్డం: మధ్యమధ్య = ‘తామర పూలు’ లో 2, 4 స్థానాల్లోని అక్షరాలు
37 అడ్డం: కుటిల = వంకర అయిన లేక వంకరగా ఉన్న. అలకలు = కురులు
15 నిలువు: కరీ (curry) = శాకం

హిందూ క్రాస్ వర్డ్ పజిళ్లలోని చమత్కార భరిత అక్షర/పద క్రీడ (wordplay) విధానాలను తెలుగు పాఠకులకు పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. పూర్తిగా నావే అయిన కొత్తరకం ఆధారాలను కూడా ఎన్నింటినో యిస్తున్నాను. కొంచెం జటిలత ఉంటుంది కనుక, వీటిని ఫాలో అవలేని వారు ఇవి బాగో లేవని పెదవి విరిచే అవకాశం కూడా వుంది!

**** (*) ****