నుడి

నుడి – 16

ఫిబ్రవరి 2017

Nudi 16 PDF (ప్రింట్ చేసుకుని తీరిగ్గా పెన్నుతో గడులను నింపుకోవాలనుకుంటే ఈ పి.డి.ఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.)


నుడి-15 ఫలితాలు, జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం.
ఈసారి ‘నుడి’ని ఐదుగురు ఆల్ కరెక్ట్ గా పూరించారు. వారు
1. వి. దీప్తి
2. కామేశ్వరరావు
3. కార్తీక్ చంద్ర పి.వి.ఎస్.
4. పి.సి. రాములు
5. దేవరకొండ

11 నిలువుకు సరైన జవాబును కనుక్కునేవాళ్లు ఒకరిద్దరికి మించి ఉండరనే నా పూర్వానుమానం తప్పు అని రుజువు చేసినందుకు విజేతలను అభినందిస్తున్నాను.

చాలా మంది 7 అడ్డం, 11 నిలువు, 25 నిలువుల దగ్గర తడబడ్డారు.
ఇక ఆధారాలలో కొన్నింటికి జవాబులను, వాటికి వివరణలను చూద్దామా?

7 అడ్డం: పుత్రికి బదులు పత్రి అని నింపారు కొందరు. ‘పుత్రి’ లోని మొదటి అక్షరానికి గల ‘కొమ్ము’ను తీసేస్తే పత్రి వస్తుంది. పత్రి = ఆకులు.

17 అడ్డం: సంతోషించాలి = మురవాలి. సుగ్రీవ సోదరుడు = వాలి. మురవాలి మైనస్ వాలి = ముర = చంద్రగుప్తుని తల్లి!

22 అడ్డం: పరభాషలో వీల్లేని అంటే wheel లేని. Wheel = చక్రము. చక్రవాకము మైనస్ చక్రము = వాక = సెలయేరు!

33 అడ్డం: ఆంగ్లంలో శ్వాసకోశం = లంగ్ (Lung). శ్వాసకోశమా? = లంగా?

35 అడ్డం: పరిమళం = సురభిళం. దాంట్లో సగం = సుర = మత్తు పానీయం.

8 నిలువు: ముక్కంటి = ‘త్రినే’త్రుడు. నటి = అభి‘నేత్రి’.

11 నిలువు: కాల్చేసుకునేందుకు = కాల్ (call) చేసుకునేందుకు! ఐఫోను, ఓవెను, రజను మొదలైన సమాధానాలను రాశారు కొందరు.

15 నిలువు: పువ్వు = విరి. ‘విరి’లో ‘లేక’ చేరితే వచ్చేది విలేకరి.
19 నిలువు: పార్వతి = భవాని. మూడింట రెండొంతులు అంటే మొదటి రెండక్షరాలు (భవా) అని భావం.

21 నిలువు: జర = కొంచెం (తెలంగాణ మాండలికంలో). పాము పాకే శబ్దం = జరజర.
25 నిలువు: చాలా మంది ముక్కారు అని నింపారు. కరెక్టు జవాబు మున్నూరు. వివరణ అవసరం లేదనుకుంటా.

30 నిలువు: ‘పాలకులందరూ’ – ఇందులో 6 అక్షరాలున్నాయి. ఆరులో 33.33 శాతం = రెండు. పాల‘కులం’దరూ లో మధ్యన ఉన్న రెండక్షరాలు కులం = కమ్యూనిటీ!

**** (*) ****