ఓ దీర్ఘ వర్ణనాధీశ్వరా
నేనెక్కడ మొదలెట్టాలో తెలియ జెయ్యి
నేను చెప్ప వలసినంత చెప్పాక
ఆపేలా చెయ్యి
అతిగా శబ్దించే నా కంఠస్వరాన్నీ
కీచుమనే నా గుసగుసల్నీ
క్రమబద్ధం చెయ్
తామసం నిండిన
ఆ దీర్ఘమైన పగటి వేళల్లో
నాకు పదాలను ప్రసాదించు
పోగొట్టుకున్న భూఖండాలను
నా నాలుక మీద పొందేందుకు
అనూహ్యానంద సంఘటనల తాలూకు
అనుగ్రహాన్ని అనుమతించు
నాకు నిశ్శబ్దం తాలూకు ప్రజ్ఞనిచ్చి
స్వేచ్ఛగా తేలిపోయేలా చెయ్ నన్ను
తెలుగు అనువాదం: ఎలనాగ
(జెరీ పింటో భారతీయ ఆంగ్లభాషా కవి. మీడియా రంగంలో పని చేస్తాడు. ఇతని నివాసం ముంబయిలో)
అనువాదం fluent గా ఉంది ఎలనాగ గారూ! అయితే మరీ సంస్కృత ప్రదాలు ఎక్కువయ్యాయేమో అనిపించింది!
కృతజ్ఞతలు నారాయణ మూర్తి గారూ!
కవిత లోని భాష గురించి మీరు చేసిన కామెంటు మొదటి పంక్తి విషయంలో కరెక్టే.
కానీ అందులో అర్థం కాని పదాలేవీ లేవనుకుంటా. అయినా compactness కోసం
ప్రయత్నించగా వచ్చిన impact అది!