‘ అవ్వారి నాగరాజు ’ రచనలు

చిలీ కవి ‘నికనర్ పారా’ రెండు కవితలు

ఫిబ్రవరి 2018


శవపేటికలూ, అస్థి కలశాలూ అమ్ముకునే వ్యాపారా?
దేనిపైనా నమ్మకంలేని మతబోధకుడా?
తనపై తాను అనుమానపడే సైన్యాధికారా?
జరామరణాలను కూడా తమాషాగా భావించి చరించే నిత్య సంచారియా?
దేనిపైనా నమ్మికలేని వక్తనా?
అగాధపు అంచున నర్తించే నర్తకియా?
ప్రతీ ఒక్కరినీ ప్రేమించే స్వీయ ప్రేమికుడా?
సదా విషాదగ్రస్తుడై ఉండే హాస్యగాడా?
కుర్చీలో కూచొని జోగుతున్న కవిగారా?
ఆధునిక రసవాదా? పడకకుర్చీ విప్లవకారుడా? పెటీ బూర్జువానా?
కుహనుడా? దేవుడా? అమాయకుడా? చిలీ, సాంటియాగో నుండీ వచ్చిన రైతుకూలీనా?
పూర్తిగా »

వయా యెరుషలేము

ఒక కొడుకు తన తల్లితో -
శిలువనెత్తి, ధారలు కట్టిన నెత్తుటి ప్రయాసపు తడబాటులో,
"ఈ రోజు ఒకతల్లి హృదయంలో పదునైన ఖడ్గము నాటబడబోతున్నద"ని చెప్పినపుడు

యెరుసలేమూ
నువ్వొక బాధాకరమైన దారివి
పూర్తిగా »

కలత నిద్దుర

డిసెంబర్ 2017


ఏదో దారి
చెమ్మవాసన
రాతిరి మసకనీడల మాటున
ఎవరో నీపై పెనుగులాట
ఎంతకూ తెగని నడక
ఊపిరి తూలిపోయి
ఒళ్ళంతా జలదరించే పొడల చీకటి
తడబడిన పాదం కింద
మెత్తగ జారే రక్తపింజర
పూర్తిగా »

విలుప్తం

రెప్పలగోడలను తొలుచుకొని
ఎవరో లోపలకు వొచ్చినపుడు తడి వెలుతురు వొకింతైనా లేని
గది కన్నులకు చెవులు లేవు
అది వొట్టి మూగది
నలు చదరాల నిటారు ముంగాళ్ళపై
కూర్చున్నది కూర్చున్నట్టుగానే
కుళ్ళిన జంతు కళేబరంలా

పూర్తిగా »

ఒక్కటే

అక్టోబర్ 2017


మరరణం సన్నిధిన గొంతుక కూర్చొని తన తడి చేతులతో పుణుకుతున్నపుడు కలుస్తూ విడిపోతూ కన్నీటి చారికల దారి. ఇంకాసిన్ని అక్షరాల చితుకులతో చలి కాచుకుంటున్న చేతులపై విచ్చిపోతూ కొన్ని వీడ్కోలు ముద్దులు.
పూర్తిగా »

ఈ వెన్నెల సదా ఇలాగే వర్షించును గాక…

దూరంగా ఎక్కడో
వెలిసిపోతున్న రంగు దీపాలకావల

పాదాల కింద నెమ్మదిగా కదిలి
అడుగుల ముద్దరయ్యే మట్టి అలల మీద

కాళ్ళ చుట్టూ పసిదానిలా పారాడుతూ
నేలంతా లేలేత వెన్నెల

1
పరవాలేదు
మనం ఇంకా బతికే ఉన్నాం

ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆకులు రాల్చుకొంటూ
కొత్త చివురుల కోసం
ఒక్కొటొక్కటిగా సిద్ధమవుతున్న చెట్టుకొమ్మల నీడల కింద నిలబడి

నెమ్మదిగా తల పైకెత్తి చూసినప్పుడు
ఆకాశంలో అంతటా పరుచుకున్న నునులేత కాంతి

2
పరవాలేదు
ఇంకా మనం బతికే ఉన్నాం

దిగంతాల జలతారు కదలికల మీద
పారాడే చుక్కల మిణుగురులను లెక్క…
పూర్తిగా »

ఎప్పుడో జరిగింది…

ఎప్పుడో జరిగింది…

ఇది ఇప్పుడు జరిగినది కాదు

మనం మన పడక గదుల్లో పిల్లలతో పాటుగా లోకంలో ఉన్న సిలబస్ సమస్తాన్నీ
తిరగేసి మరగేసి కుస్తీపడుతున్నప్పుడు
మనలాగే ప్రపంచమూ, కలలకూ భవిష్యత్తుకూ కొత్త అర్థాలు తొడుక్కుంటున్నప్పుడు
తుపాకీ కొసల మీద అలుముకుంటున్న ఆకాశపు ఉనికిలా
ఇది ఎప్పుడో ఇంతకు క్రితమే జరిగింది

ఇది ఇప్పుడు జరిగినది కాదు
బతుకును ఓ పోటీలా నిర్వచించుకొని
దరిదాపులకు ఎవ్వరూ రానివ్వకుండా చుట్టూ గోడలు కట్టుకొని సాగుతున్నప్పుడు
మనలాగే ఈ లోకమూ ట్రాఫిక్‍లో ఇరుక్కపోయిన స్వప్నంలా ఊపిరాడక అటు ఇటూ మెసలుతున్నప్పుడు
విలువల పదునంచు చివరల వేలాడుతున్న భూగోళం పువ్వులా

పూర్తిగా »

ఊరికనే

ఊరికనే

వస్తూ వస్తూ జ్వరంతో వస్తాయి అక్షరాలు

రాత్రిని భోంచేసి మూతి తుడుచుకుంటున్న
పిల్లి ఒకటి ఊరకే అలా పడుకొన్నది

ఎవరూ అడగని వాటిని గురించి ఇక్కడ సంసిద్ధత

నీకు కలలే రావు కదా ఇక కవిత్వం ఎలా రాస్తావూ
అని అడుగుతారనే భయం లేదు

అంతా పద్ధతి ప్రకారమే కదా జరగుతోంది

తెలిసిన నిశ్చింతత పుటం కట్టి మానని గాయమై
తనలోనికి తాను కళ్ళు పెట్టి చికిలించుకొని చూసుకుంటున్నప్పుడు
కలుక్కుమని విరిగిన ఒక కవితా పాదం ముందుకు కదలక మరో పాదంతో
ఇల్లా అంటూందట:

ప్రేయసీ, ఇక్కడ మరీ అంత ఏమీ లేదు

కొన్ని దుఃఖించే హృదయాలున్నట్టుగానే వేడుకగా…
పూర్తిగా »

అసింటా-

అసింటా-

ఈ ఎండా కాలపు రోజులలో ఏం చేసినానూ?
ఒక నిశ్చితార్థంతో తెలిసిన విషయాన్నే తిరిగి తిరిగి తెలుసుకుంటూ
మిట్టమధ్యాహ్నపు నిప్పుల కుంపటిలో నాలోనికి నేను చొరబడి కొద్దికొద్దిగా
నన్ను నేను కొరుక్కతింటూ సుప్తావస్థలో పవళించినాను

చూడు చూడు వీడు అధ్వైతం బోధించువాడు, మోడీ ముందొక పరవశ గీతమై సాగిల
పడుతున్నాడు చూడుడని, ధిక్కారపు చాటింపులో వీధివీధికీ దోసిళ్ళ కొలదీ
మైకాన్ని తాగి తాగి వొదిరినాను

కొన్ని పనులను చేసి మరికొన్నింటిని ఇష్టంగా పక్కనపెట్టి తిరగని దారులలో
తల చెడినట్టుగా తిరిగినాను

కొందరిని ఇంపితంగా గారాము చేసి మరికొందరిని పక్కకవతలనెట్టి మాటకు మాట మహా
పెడసరంగా చెప్పకనే…
పూర్తిగా »

ఖాళీ

సెప్టెంబర్ 2013


దేహపు గూడు నుండి కొన్నాళ్ళకు పక్షులు ఎగిరిపోతాయి
ఇక అప్పుడు ఎందుకు దుఃఖించిందీ అడిగేందుకు ఎవ్వరూ ఉండరు

గడిచిన కాలపు పద్దుల నుండి
క్షణాల లెక్కన ఒక్కొక్కటిగా అన్నీ తుడిచి పెట్టుక పోతాయి

ఖాళీ అయిన పాత్రతో నడచి వెళుతున్నప్పుడు
నాతో సహా ఇక నన్నెవరూ గుర్తు పట్టలేరు

బతికినందుకు ఏదైనా ఒక దానిని గుర్తుగా ఎందుకు మిగిల్చి పోవాలనే సందిగ్ధతలో

రాసి చించేస్తూ పోగా మిగిలిన
ఒకేఒక్క ఆఖరి పేజీలో
కొట్టకొస పంక్తిని కొట్టేస్తూ-


పూర్తిగా »