వస్తూ వస్తూ జ్వరంతో వస్తాయి అక్షరాలు
రాత్రిని భోంచేసి మూతి తుడుచుకుంటున్న
పిల్లి ఒకటి ఊరకే అలా పడుకొన్నది
ఎవరూ అడగని వాటిని గురించి ఇక్కడ సంసిద్ధత
నీకు కలలే రావు కదా ఇక కవిత్వం ఎలా రాస్తావూ
అని అడుగుతారనే భయం లేదు
అంతా పద్ధతి ప్రకారమే కదా జరగుతోంది
తెలిసిన నిశ్చింతత పుటం కట్టి మానని గాయమై
తనలోనికి తాను కళ్ళు పెట్టి చికిలించుకొని చూసుకుంటున్నప్పుడు
కలుక్కుమని విరిగిన ఒక కవితా పాదం ముందుకు కదలక మరో పాదంతో
ఇల్లా అంటూందట:
ప్రేయసీ, ఇక్కడ మరీ అంత ఏమీ లేదు
కొన్ని దుఃఖించే హృదయాలున్నట్టుగానే వేడుకగా సింగారించుకొన్న అనేక
ఆర్థ్రభాష్ప బిందువులున్నాయి
తెగిపడిన రుధిర చారికలు కొన్ని లాగా వొళ్ళంతా పులుముకున్న పులిపులి
వేషగాళ్ళ వొంటి మచ్చలు చాలానే ఉన్నాయి
తెలిసిన విశ్వాసపు కొద్ది ఆకాశాల వెనుక
తెలియని ప్రశ్నల లక్షోపలక్షల సమాంతర విశ్వాలున్నాయి
విరామంలాంటి నిశ్శబ్ధత నీకూ నాకూ మధ్య వ్యూహాత్మకంగా పరుచుకుంటున్నప్పుడు
నుదుటి మీద వానచినుకై చిప్పిల్లే ఒక ముద్దు నీకొక బాకీగా ఇంకా మిగిలే ఉన్నప్పుడు
బొత్తిగా కాలు సాగని ఈ రోజును రికామిగా పిలుద్దాం
ముఖాల మీద తోలు వొలుచుకొని బోలుతనాన్నే పోతపోద్దాం
కొన్ని దుఃఖించే హృదయాలున్నట్టుగానే వేడుకగా సింగారించుకొన్న అనేక
ఆర్థ్రభాష్ప బిందువులున్నాయి.. nice expression sir..
నీకు కలలే రావు కదా ఇక కవిత్వం ఎలా రాస్తావూ..
ఇదొక సైంటిఫిక్ రీజన్..కదా అనిపిస్తుంది..
ఇమ్తకీ కవిత లో ఒకటే సబ్జెక్ట్ లేదు.
‘వస్తూ వస్తూ జ్వరంతో వస్తాయి అక్షరాలు’ అంటూ మెదలైతే ఆ వైపుగా ఆలోచిస్తూ చదివా. కవిత మొత్తాన్ని.
ఈ పై వాక్యం ఒక్కటి నాకు కొత్తగా అనిపించి, నచ్చింది నాగ రాజు గారు.