దానిలోనే లేదా దానిగానే ఉండడం
విడివడనిదేదో దుఃఖపు పోగులుగా పేనుతూ పోవడం
గాద్గదత శరీరమయినప్పుడు పొలమారినదంతా ఇక నీ మాట
మరరణం సన్నిధిన గొంతుక కూర్చొని తన తడి చేతులతో పుణుకుతున్నపుడు కలుస్తూ విడిపోతూ కన్నీటి చారికల దారి
ఇంకాసిన్ని అక్షరాల చితుకులతో చలి కాచుకుంటున్న చేతులపై విచ్చిపోతూ కొన్ని వీడ్కోలు ముద్దులు
మాటలు పిగిలిపోయి పర్రున హృదయం జారిపోతున్నపుడు భయంబరువుగా తొణకిసలాడే జీవితపు నిండుకుండ
ఇంకా ఎప్పుడైనా ఒకసారి తిరిగి కలుసుకునేందుకుగాను కాలాలకావల గురుతుగా పేర్చుకొన్న రహస్యపు చోటు
చివరాఖరుగా ఇంకా ఎప్పుడైనా ఏదైనా చెప్పుకోవలసి వస్తే చేయెత్తి చూపించవలసిన దేహపు గూడు
చెరిపేసుకోవడమొక్కటే నిక్కమని తెలిసాక బహుశా ఇదే ఇక చివరి మజిలీ
నాగరాజు గారు,
మీ కవితల్లోని చిక్కదనం నాకు బాగా నచ్చుతుంది.
“ఇంకాసిన్ని అక్షరాల చితుకులతో చలి కాచుకుంటున్న చేతులపై విచ్చిపోతూ కొన్ని వీడ్కోలు ముద్దులు..” Nice Expression!
మరరణం సన్నిధిన గొంతుక కూర్చొని… ఇలాంటి లోతైన, గాఢమైన భావ సముదాయంతో కవిత చిక్కగా, కళ్ళ మీద బరువుగా వాలింది. అభినందనలు.
- ఎమ్వీరామిరెడ్డి