ఈ ఎండా కాలపు రోజులలో ఏం చేసినానూ?
ఒక నిశ్చితార్థంతో తెలిసిన విషయాన్నే తిరిగి తిరిగి తెలుసుకుంటూ
మిట్టమధ్యాహ్నపు నిప్పుల కుంపటిలో నాలోనికి నేను చొరబడి కొద్దికొద్దిగా
నన్ను నేను కొరుక్కతింటూ సుప్తావస్థలో పవళించినాను
చూడు చూడు వీడు అధ్వైతం బోధించువాడు, మోడీ ముందొక పరవశ గీతమై సాగిల
పడుతున్నాడు చూడుడని, ధిక్కారపు చాటింపులో వీధివీధికీ దోసిళ్ళ కొలదీ
మైకాన్ని తాగి తాగి వొదిరినాను
కొన్ని పనులను చేసి మరికొన్నింటిని ఇష్టంగా పక్కనపెట్టి తిరగని దారులలో
తల చెడినట్టుగా తిరిగినాను
కొందరిని ఇంపితంగా గారాము చేసి మరికొందరిని పక్కకవతలనెట్టి మాటకు మాట మహా
పెడసరంగా చెప్పకనే చెప్పినాను
బతికి ఉన్న వాళ్ళందరికీ దణ్ణం పెట్టి చచ్చిన వాళ్ళనందరినీ వాటేసుకొనీ
బోరుబోరున ఏడ్చినాను
ఒకానొక మహానుబావుడు చారెడు మందు పోయిస్తానని మాటవరసకు ఎప్పుడో అనినందుకు
వుట్టి మాటలేనాని మహా తాగుబోతు మాదిరి నీలిగి నీలిగి దెప్పినాను
కాసింత అసింటా జరిగి వెలుతురు దార్లనొదిలి చీకటి పీలికలనొకదానికొకటి
ముడివేసి జీవితం ఒంటిస్థంబపు మర్యాదల మేడ దాటుకొచ్చాను
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్