‘ నౌడూరి మూర్తి ’ రచనలు

అనుభూతులు

08-ఫిబ్రవరి-2013


అల్లావుద్దీన్ దీపంలోని భూతంలా
ప్రకృతి గాలిపోగుజేసి నన్ను తయారుచేస్తుంది

అనంత నీరవ, నిర్జీవ రోదసిలో ప్రాణం మొలకెత్తినట్టు
ఈ ఎడారి ఎదలో ప్రేమ బుగ్గలా పుట్టి వరదలౌతుంది.

నా కూతురు
నా గుండెను కాగలించుకుని నిద్రిస్తుంటే,
మట్టినై నేనున్నప్పుడు
నామీద పచ్చగడ్డి అల్లుకున్న భావన
ఒక పురానుభవమై కదలాడుతుంది.

తోడు వెతుక్కుని
తన గమ్యం వైపు తిరిగినపుడు,
చవిటినేలల్ని కేదారాలుగా మలచడానికి
పరిగెత్తుతున్న పాయను వీడి
బాధపడుతున్ననది నౌతాను

చితిపై మండుతున్నప్పుడు,
నాకోరికను మన్నించిన ప్రకృతి,
విసుగూ, అలుపూ, భయం లేకుండా
విశ్వవీక్షణానికి వేల రెక్కలననుగ్రహించిన

పూర్తిగా »

Your Chariot

Your Chariot

నీ రథము

 

ఓ ప్రభూ! నీ రథము దీక్షాప్రణీత

విధురవేగమ్ము పరువులు వెట్టుచుండె

నా శరీరమ్ము దానిక్రింద బడి నలిగి

నలిగి పోయినయది రక్త నదము లింకి.

 

దివ్యతేజోవిరాజత్త్వదీయ రథము

ఈ గతుకుడేమియనియైన  నాగలేదు

నా విరోధించిన హఠాన్నినాదమునకు

వెనుదిరిగియైన మరి జూచికొనగలేదు.

 

నాదు రక్తము నీ రథచోదకుండు

కడిగివేయును రేపు చక్రములనుండి

అచట బహుజన రక్త చిహ్నములయందు

నాదియిదని గుర్తేమికన్పడును, సామి?

 

-విశ్వనాథ సత్యనారాయణ

 

 

Your Chariot

 

Your chariot, O my Lord, is racing

With an ordained speed, uninterrupted!

This corp came under it, got crushed;…
పూర్తిగా »

లోచూపుతోనే… (రెండవ భాగం)

ఫిబ్రవరి 2013


లోచూపుతోనే… (రెండవ భాగం)

తనని సమీపించబోయే మృత్యువుగురించి హ్యూం ఎప్పుడూ సరదాగా మాటాడినప్పటికీ, ఆ హుందాతనాన్ని పదిమందిముందూ ప్రదర్శించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. సంభాషణ సహజంగా ఆ విషయం వైపు మళ్ళితే తప్ప తనంత తాను ఆ ప్రస్తావన తీసుకు వచ్చేవాడు కాదు; అప్పుడుకూడా ఆ విషయం గురించి ఎంతసేపు మాటాడాలో అంతసేపే తప్ప అంతకుమించి కొనసాగించేవాడు కాదు; అయితే ఆ విషయం తరుచూ ప్రస్తావనలోకి వస్తుండేది, కారణం, అతన్ని చూడడానికి వచ్చిన మిత్రులు ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి సహజంగానే అడిగే వాళ్ళు. నేను పైనప్రస్తావించిన సంభాషణ ఆగష్టు ఎనిమిదవ తేదీన మా ఇద్దరి మధ్యా జరిగింది; ఆ తర్వాత మరొక్క సారే మాటాడగలిగేను. అతను ఎంతగా నీరసించిపోయాడంటే, అతని ఆత్మీయమిత్రుల…
పూర్తిగా »

విషమ పరిస్థితి… ఓరిక్ గ్లెండే జాన్స్

25-జనవరి-2013


కళ్ళు మిరిమిట్లు గొలిపేలా
చంద్రుడు ఆకాశంలో మెరిస్తే నేమిటి
ఆ చిట్టడవి చివర చెట్లగుబురులతో
చుక్కలు దోబూచులాడితే నేమిటి?

తుప్పలునరికి, చదునుచేసీ కలుపుతీసీ
మనిషి విత్తు నాటవలసిందే,
దానికి రక్షణగా దడికట్టినపుడు
హెచ్చరికగా తెల్లగీత గీయవలసిందే.
.
అందమైన వయిలెట్ పువ్వులగురించీ
మనుషులు చేసే పనులు చెప్పడానికీ
వానలా పెద్దచప్పుడు చేసుకుంటూ
దేముడు వస్తేనేమిటి?

నా మెదడుకి పదునుపెడుతూ
నా పాట్లు నే పడవలసిందే
నాకు తెలిసిన అన్న మాటల్లోంచి
ఒక సత్యాన్ని ఆవిష్కరించవలసిందే.

***
ఓరిక్ గ్లెండన్ జాన్స్
జూన్ 2,…
పూర్తిగా »

హేమంతపు ఉదయం… రాధిక

ఫిబ్రవరి 2013


హేమంతపు ఉదయం… రాధిక

హేమంతపు ఉదయం…

వేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలు
దోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులు

ఒకపక్క ధనుర్మాసపు తొలిపొద్దు
ఆవిష్కరించే అందమైన చిత్రాలు

మరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య
చలిమంటల వెచ్చదనాలు

ముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళు
మనసునిండుగా హరిదాసు దీవెనలు

ఎంత పొద్దెక్కినా
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో
చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో.

***

కవిలాగే, ఆధునిక కవిత్వం కూడా ఏ ఇతరేతర ఛాయలూ, వాసనలూ లేకుండా ఒంటరిగా ఉండగలిగే వస్తువు కాదు (Just as the poet himself, modern Poetry is not…
పూర్తిగా »

హస్తినా, నీ వారసత్వం నిలబెట్టుకున్నావ్!

ఆమె మృత్యువు అనైతికతకి ప్రతీక కాదు
ప్రజల మితిలేనిసహనానికి ప్రతీక
సమాజపు నిశ్చైతన్యానికి ప్రతీక
ప్రభుత్వాల అలసత్వానికి ప్రతీక
అదిచేసే అత్యాచారాలకి ప్రతీక.

చనిపోయింది కాబట్టి బ్రతికిపోయింది.
లేకపోతే
మార్చ్యురీలో ఉన్నట్టో,
క్వారంటైన్లో ఉన్నట్టో
జీవితాంతం బ్రతకాల్సిందే.
వెంటాడే నీలికళ్ళ ఎక్స్ రేలు ఎదుర్కోవలసిందే
రాబందుసమాజానికి
జీవితాన్ని కణకణం సమర్పించవలసిందే.

నేరంచేసినవాడే దోషికాదు
వాణ్ణి శిక్షించని చట్టమూ, న్యాయమూ
ఆమెను రక్షించని రాజ్యమూ దోషులే.

మేధావులకేముంది
ప్రతి జంతువుకీ ఒక రేటు ఉంటుంది

ఈ నాగరికత
కుక్కమూతిపిందెలు కాస్తోంది.
కౌరవసభలో వికర్ణుడిలా

పూర్తిగా »

లోచూపుతోనే… (మొదటి భాగం)

లోచూపుతోనే… (మొదటి భాగం)

(వయసు పెరుగుతున్నకొద్దీ మనం స్పష్టంగా దర్శించగలిగేది లోచూపుతోనే…)

“To philosophize is no other thing than for a man to prepare himself for death” …Cicero.

“That is the reason why study and contemplation does in some sort withdraw our soul from us, and severally employs it from the body which is a kind of apprenticeship and resemblance of death”… Montaigne.

 

 

(నౌడూరి మూర్తి)

18వ శతాబ్దంలో స్కాట్లండులో తాత్త్విక చింతన, శాస్త్రీయ ఆవిష్కారాలతో ఒక కొత్తశకానికి తెరలేచింది. గ్లాస్గో, ఎడింబరో, ఏబర్డీన్ వంటి…
పూర్తిగా »

కవిత ఎలా ఉండాలి ?

 

స్ఫటికం లా… అంది నిశ్చల సరస్సు మెరుస్తూ

నాలా ఉదాత్తంగా — గంభీరంగా పలికింది మహావృక్షం

నిరాఘాటం గా ప్రవహించాలి — గలగలలాడింది సెలయేరు

సద్యః స్ఫురణ కలిగిస్తూ జీవం తొణికిసలాడాలి — కూని రాగాలు పోయింది పిట్ట

సువాసనలతో మత్తెక్కించాలి — ఝుంకరించింది తుమ్మెద

మనసు దోచుకోవాలి — నవ్వింది సీతాకోక చిలుక

రమణీయం గా ఉండాలంటేనో ? అడిగాయి పూలు

లోతుగా సారవంతంగా ఉండాలి — ఘోషించింది లోయ

కొంత రాజసం కూడా ఉండాలి — ప్రతిధ్వనించాయి కొండలు

ఆహ్లాద పరచాలి సుమా— గుసగుస లాడింది వేసవి తెమ్మెర

కరిగిపోతూ ఆలోచనలు గిలకొట్టాలి — గలగలమన్నాయి శిశిర పుటాలు

 

ఇకనేం…
పూర్తిగా »

స్వరకర్త… WH ఆడెన్

ఇతర కళాకారులంతా అనువాదకులే;
చిత్రకారుడు కనిపిస్తున్న ప్రకృతిని గీస్తాడు, మెచ్చినా, మరచినా;
తనజీవితాన్ని శోధించి శోధించి కవి బయటకి తీస్తాడు ప్రతీకల్ని,
మనసుని కలచి, అనుభూతి పంచుకుందికి.
“జీవితం నుండి కళ” ఒక బాధామయమైన రూపాంతరీకరణ
మధ్య అగాధాన్ని మనమేదో పూడ్చగలిగినట్టు ఆధారపడుతూ;
ఒక్క నీ స్వరాలే స్వచ్ఛమైన కల్పనలు
ఒక్క నీ గీతమే పరిపూర్ణమైన బహుమతి!
.
ఓ చెవులపండువా! జలపాతంలా సాక్షాత్కరించు!
ఈ స్తబ్ధ వాతావరణాన్నీ, మా సందేహాల్నీ ఛేదిస్తూ,
వంగుతున్న నడుముల్నీ, వాలుతున్న మోకాళ్ళనీ లేవనెత్తు.
ఓ నిరాకార గీతమా! ఒక్కతెవే, ఒక్క నువ్వొకతెవే,పూర్తిగా »