కథ

గెలుపు గుర్రం

గెలుపు గుర్రం

అమ్మ ఫోటో ముందు నిలబడ్డాను. అమ్మ పోయి అయిదేళ్ళు అయ్యింది. నాకు 35 ఏళ్ల వయసొచ్చినా నేనింకా అమ్మ ముందు చిన్నపిల్లాణ్నే. నా జీవితంలోనాకు ఆనందం పంచిన ఒకే ఒక స్త్రీ అమ్మ. నెమ్మదిగా కదిలి కిటికీ దగ్గరికి వచ్చి బయటకు చూశాను. మనుషులూ, కార్లూ, స్కూటర్లు, సైకిళ్ళతో రోడ్డు బిజీ గా వుంది. అందరినీ అలా చూస్తూవుంటే…‘నేనే ఎందుకలా?’ అన్న ప్రశ్న నాలో ముల్లులా గుచ్చుకుంటోంది. చాలా రోజుల తర్వాత ఆప్రశ్న మళ్లీ మళ్లీ నాలో ఉదయిస్తోంది.

కిటికీ దగ్గర్నుంచి వెనక్కి వచ్చి నా రీడింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లాను. పేపర్ వెయిట్ ని కూడా పట్టించుకోకుండా మైథిలి రాసిన ఉత్తరం గాలికి…
పూర్తిగా »

పాఠం

డిసెంబర్ 2014


పాఠం

నా మొబైల్ రింగవుతోంది. స్క్రీన్ మీద ‘రాధాకృష్ణ’అని డిస్ప్లే అవుతోంది. కాల్ కట్ చేసాను. మరల రింగ్ అయ్యింది. ఇగ్నోర్ నొక్కాను. రెండు నిమిషాల తరువాత మరల రింగ్ అయ్యింది. ఈ మాటు ‘అనూహ్య’ పేరు డిస్ప్లే అవుతోంది. ఇక భరించలేక ఫోన్ ఎత్తి రాష్ గా ‘హలో’ అన్నాను. “నా ఫోన్ లో చార్జ్ అయిపోయింది ఆందుకే అమ్మాయి ఫోన్ నుండి.....” అవతల ఫోన్ లో రాధాకృష్ణ గారు, నా మామ గారు. “అసలు విషయమేమిటో చెప్పండి” ఆయనని కట్ చేస్తూ విసురుగా అడిగాను.
పూర్తిగా »

చందమామ బిస్కత్తు

డిసెంబర్ 2014


చందమామ బిస్కత్తు

మల్లెపువ్వులాంటి తెల్లని బట్ట బుట్టపైన కప్పి ఉంటుంది. ఎవరైనా బిస్కెట్టు కొనుక్కుంటుంటే ఆ గుడ్డను కొంచెంగా తొలగించి అడిగిన బిస్కెట్టు తీసి ఇస్తాడు. మేం పిల్లలందరం ఆ కొంచెం సందులోంచే బిస్కెట్లని చూడాలని ఉబలాటపడేవాళ్ళం. నేనైతే అందర్నీ నా మోచేతులతో తోసేసి సాయిబు పక్కకెళ్ళి చూసేదాన్ని. గుండ్రనివి, వంకలవి, నిలువువి, చతురస్రాకారపువి, త్రిభుజాలు, నక్షత్రాలు ముఖ్యంగా చంద్రవంకలు వీటన్నింటికీ మధ్యలో పెద్ద చందమామ బిస్కెట్టూ...... తీపివి, ఉప్పువి, జీలకర్ర బిస్కెట్లు, వాము బిస్కెట్లు అన్ని రకాలూ ఉండేవి సాయిబు దగ్గర. కొన్ని బిస్కెట్ల పైన వేరుశనగ పప్పు ముక్కలు, పిస్తా పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు చల్లి ఉండేవి. అవి కాస్త రేటు ఎక్కువ. అన్నిటికంటే…
పూర్తిగా »

కిటికీలోని బాల్యం

డిసెంబర్ 2014


కిటికీలోని బాల్యం

వెలుతురూ గాలీ ధారాళంగా ఉన్న ఆ గదిలోనే గత పదేళ్ళుగా నా నివాసం! గది కిటికీ దగ్గరే ఇన్నేళ్ళుగానూ నా మకాం కూడాను. ఆ కిటికీలోనుంచి చిత్రకారుడు తీర్చిదిద్దినట్టుగా కనిపించే పచ్చిక బయలు కనువిందుగా కనిపిస్తూ ఉంటుంది. “అరణ్య ” అన్న ఈ ఎస్టేట్ కు పెట్టిన పేరును సార్థకత చేకూరుస్తూ ఏపుగా పెరిగిన చెట్లు, గుబురుగా ఉండే పొదలు ఇవన్నీ వందల అపార్ట్ మెంట్ భవనాల మధ్యలో చక్కని పచ్చదనాన్ని కళకళలాడిస్తూ ఉంటాయి.

నా భర్త చనిపోయాక నా ఒక్కగానొక్క కొడుకూ, వాడి భార్య, నేనూ అద్దె ఇంట్లో మిగిలాం. వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులే కావడంతో నగరానికి చివరలో వాళ్ళకు అందుబాటు ధరలో వచ్చిందని…
పూర్తిగా »

పునరుత్థానం

పునరుత్థానం

“కిటికీ బయటి వెన్నెల” పుస్తక ఆవిష్కరణ 2014 నవంబర్ 16న జరిగింది. పది కధలున్న ఈ “కిటికీ బయటి వెన్నెల” – చదువరులందరికీ అంతో ఇంతో సంతృప్తినీ, ప్రపంచం పట్ల ఒక సానుభూతినీ, కొంత ప్రేమనూ కలిగేలా చేస్తాయి. అయోమయపు సందిగ్ధంలో ఉన్న వారికి ఒక ఆత్మా విశ్వాసాన్ని, కొంత ఆలోచనా పఠిమనూ అందిస్తాయి. ఒక జీవన తాత్వికత, ఒక అనుభవైక వేద్యమయిన భావన ఈ కధలు అందిస్తాయి. ఒక పార్శ్వం నుండి కాక అన్ని కోణాలను౦డి ఒక వ్యక్తిని, సమాజాన్ని అంచనా వేసి గీసిన అక్షర చిత్రాలివి. రచయితకి ఎంతో నైపుణ్యత ఉంటే తప్ప వ్యక్తి అంతర్గతం నుండి సమాజపు లోలోపలి…
పూర్తిగా »

బామ్మ గుట్టు

బామ్మ గుట్టు

మిట్టమధ్యాహ్నం సూరీడు నడినెత్తిన ఉండి తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ స్కూలు వదలగానే రోడ్డు మీద పడ్డాను మాసిపోయిన యూనీఫాంతో, అవ్వాయి చెప్పులేసుకుని. ఓపక్క ఆకలి, మరోపక్క వేడెక్కిన రోడ్డుమీద నడక, ఎంత తొందరాగా ఇంటికి వెళ్ళి అన్నం తింటానా అనే తొందరలో ఉన్నాను. సరిగ్గా మా గుడి సందు దాటుతుంటే, ఎత్తరుగు మీద ఇంటి చూరు కిందగా, కాళ్ళు బారజాపుకుని చేతి కర్రతో కాకుల్ని తోలుతూ వడియాలకు కాపలాకాస్తూ కూచునుంది సిద్ధేర్వరి బామ్మ. ఆకలి వల్ల కళ్లానక ఇలావచ్చేసాను. “చచ్చానురా దేవుడా… ఉత్తపుణ్యాన బామ్మకు పలారమైపోతానే” పక్కదారిగుండా పోకుండా ఎందుకు గుడి దారిన వచ్చానురా అనుకున్నాను. నేను తనను చూడక మునుపే బామ్మ తన…
పూర్తిగా »

ఐస్ క్యూబ్

అక్టోబర్ 2014


ఐస్ క్యూబ్

ఎంత మురికైనా నీరు కడిగేస్తుంది, మరి నీటికే మురికైతే? ఆలోచనలు మలినమైనా, మనసు పవిత్రంగా ఉండాలా? మనసు ఆలోచనలూ వేరువేరా? బుధ్ది మనసు ఒకటేనా? వాటికి శుధ్ది మరణమేనా? కాలిపోడమేనా? నేనే ఏదో ఆశిస్తునాను పావనిద్వారా, అందుకే అదెక్కడ దొరక్కుండా పోతుందేమో అన్న భయం కలిగించిన సూడో కన్సర్న్ యే కదా ఇదంతా, సెక్స్ అంత ముఖ్యమా, అదిలేకుండా ఓ ఆడా మగా స్నేహితుల్లా ఉండలేరా, కనీసం అలా ఉండగల నియంత్రణకు లోబడగలరా, ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఏదోమూల అగ్నిపర్వతం బద్దలవ్వాల్సిందేనా, బాసూ, ఆపుతావా నువ్వూ నీ లూసర్ ఫిలాసఫీ ఉవాఛల వాచాలత, దొరికితే ఏదైనా తిను, లేదా దొరికింది తిను, ఆకల్తో మాత్రం ఛావకు, ఇక్కడ…
పూర్తిగా »

పునీత

సెప్టెంబర్ 2014


పునీత

ఎన్ని రోజులైందో గుర్తుకు రావట్లేదుగాని చాలా రోజులైనట్లే ఉంది. నెలదాటిందా అంటే!  ఉండు ఒక్కసారి సరిగ్గా గుర్తుకు తెచ్చుకోనీ.  ఆ..  ఆరోజు రమావాళ్ళింట్లో ముక్కోటి ఏకాదశి, విష్ణుసహస్రనామ పారాయణానికి వెళ్ళామా అక్కడే కదా అయ్యింది! ఎక్కడ తెలిసిపోతుందో అనుకుని హడావిడిపడుతూ వచ్చేసాను కానీ నా మొహం, ఎలా తెలుస్తుంది? అయినా ఏం పూజలో ఏం పాడో, భక్తి మీద ధ్యాస కన్నా బయటవుతామేమో అన్న భయం ఎక్కువ కదా. ఇంతకీ పారాయణం ఏ రోజు జరిగింది? పోయిన నెల ఏకాదశి అంటే, ఏది తెలుగు కాలెండరు? జూలై ఎనిమిదిన. ఈ రోజేంటి? ఓరి దేముడోయ్ సెప్టెంబరు ఇరవైమూడు! ఇంకా అవకపోవడమేంటి?! దడ పుట్టేస్తుంది.

నా మొహం…
పూర్తిగా »

అక్కడక్కడా … ఒక్కడు

అక్కడక్కడా … ఒక్కడు

తాజ్‌మహల్ అందాన్నిచూసి తన్మయులైపోయేవాళ్లని, దాని నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో ఆలోచించమని శ్రీశ్రీ చెప్పారుగానీ, ఆ కట్టడంలోని అందంవెనుక బంధం మాత్రం ఎవరి ఆలోచనల్లోకీ అంత తొందరగా ప్రవేశించదు.

# # #

కనకధారాస్తవాన్ని వింటున్నప్పుడు ఫోన్ మోగడం వినిపించిందిగానీ, అది పూర్తి అయిన తరువాత మాత్రమే మా ఆవిడ నాతో సంభాషణ మొదలుపెట్టడం నా అదృష్టమనే చెప్పుకోవాలి. శంకరాచార్యుని సృజనాత్మకత నన్ను అబ్బురపరుస్తూంటుంది. ఆయన పుట్టిన కొన్నివేల ఏళ్ల తరువాత కూడా ఆయన స్తోత్రాల్లోని భాష సొబగులు, భావ సౌందర్యాలచేత ప్రభావితులయిన లక్షలమందిలో ఒకణ్ణయినందుకు గర్వపడుతుంటాను.

“సత్యనారాయణ గారమ్మాయి పెళ్లి లైవ్ చూపిస్తున్నార్ట కంప్యూటర్లో. ఆ పుస్తకాన్ని కాస్త పక్కనపెట్టి చూద్దురుగాని రండి!” అని…
పూర్తిగా »

ఇప్పుడైనా చెప్పనీయమ్మా…

ఆగస్ట్ 2014


ఇప్పుడైనా చెప్పనీయమ్మా…

“ఈరోజు ఇంతటి గురుతరమైన బాధ్యత, యింతటి గౌరవించదగిన ఉద్యోగం నాకు లభించిందంటే దానికి ముఖ్యకారణం మా అమ్మగారు. ఆవిడ కడుపున పుట్టడం నా అదృష్ట మయితే, ఆవిడ ప్రవర్తన నాకు స్ఫూర్తి అయింది.” టీవీ ముందు కూర్చుని, కొడుకు యిస్తున్న ఇంటర్వ్యూ చూస్తున్న శంకర్రావు, పార్వతి ముందుకువంగి యింకాస్త శ్రధ్ధగా వినసాగారు.

   అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థకి సీ.ఈ.వో.గా ఎంపికయిన విజయ్ హుందాగా కూర్చుని యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలిస్తున్నాడు. నలభై అయిదేళ్ళ విజయ్ పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఆ ఫ్లడ్‍లైట్లముందు వెలిగిపోతున్నాడు. అమెరికాలో ప్రముఖసంస్థల జాబితాలో మొదటి నాలుగుస్థానాల్లో నిలబడే ఆ…
పూర్తిగా »