కథ

కొంచం నిజం

అక్టోబర్ 2016


అబ్బ… నిజం. పుట్టినపుడు కూడా ఇంత ఏడ్వలేదు. ఇందాక చెప్పాను కదా. అందర్ని ఆమెకోసం వదిలేసినందుకు ఆమె కూడా వదిలేసిపోయిందని. అంతే.

ఆ తర్వాత ట్యాక్సి వాడు మిగిలిన డబ్బులకోసం నానా తిప్పలు పెట్టాడు. నా జేబు ఖాళీ. అసలే వాడి తలనొప్పిరా దేవుడా అంటే మాటిమాటికి ఆ పోలిసోడి ఫోనొకటి. హ్మ్. నీకొచ్చిన ఆలోచనే నాకు వచ్చిందిలే. చివరికదే చేసా. ఆ సింకార్డ్ తీసి నా కొత్త ఫోన్ కాస్తా ఆ డ్రైవర్‌గాడి చేతిలో పెట్టి ఏ పాట పాడుతూ అడుక్కుంటే ఎక్కువ డబ్బులొస్తాయా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెనక్కి నడిచా.బై ద వే. ఈ గొడవకి ముందంతా మేం పాటలు పాడుకుంటూనే ఉన్నాం.


పూర్తిగా »

అన్య

సెప్టెంబర్ 2016


అన్య

నాలుగు రోజుల నుండీ ఒకటే ముసురు. ఐదో రోజు సాయంత్రం కాస్త తెరిపి ఇవ్వడంతో రంగరాయపురం అమ్మలక్కలంతా బిందెలు తీసుకుని ఒక్కొక్కరే కృష్ణ ఒడ్డుకు చేరారు. జమీందారుగారి కోడలుపిల్ల కృష్ణమ్మలాగా గలగలా నవ్వుకుంటూ వచ్చి "అబ్బ! నాలుగు రోజులు కృష్ణని చూడకపోతే ఎంత దిగులేసిందో” అంది. పెద్దింటి కోడలు ఏం మాట్లాడినా అందమే అన్నట్లుగా "ఓయమ్మ నాలుగు రోజులకే దిగులేసుకున్నావా?" అంటూ ఆమెని అల్లరి పట్టించారు ఆమె స్నేహితులు.
పూర్తిగా »

నేను చెప్పనీ కథ

నేను చెప్పనీ కథ

వినరన్నమాట. సరే. ఎలాగూ చదువుతున్నారు కాబట్టి చెప్తాను వినండి. నేను ఊహించినదాంట్లో తప్పే ఉ౦దో ఒప్పే ఉ౦దో మీకే తెలుస్తుంది. ఆ పాప పేరు.. వద్దులెండి పేరెందుకు. పాప అనే అనుకోండి. చిన్నదే - యల్కేజి. నాకు అప్పటికింకా ప్రమోషన్ రాలేదు. నర్సరీ పిల్లలకి టీచర్ గా వున్నాను. మొదటిసారి ఆ పాపని చూసినప్పుడు భలే అనిపించింది. అసలు చిన్నపిల్లలా బిహేవ్ చేసేదే కాదు. ఏం పద్ధతి! ఏం శుభ్రత! మాటల్లో కూడా ఎంతో స్పష్టత? భలే ఆశ్చర్యం వేసింది. మొదట్లో నేను ఇంటికి వచ్చాక మా ఆయనకి పిల్లలకి ప్రతి రోజూ చెప్పేదాన్ని. మా పిల్లల సంగతే చెప్పాలి ఇక. ఇంటి నిండా బొమ్మలు…
పూర్తిగా »

ఆరోమలె

ఆగస్ట్ 2016


ఆరోమలె

తను ఏం మాట్లాడకున్నా నాకు మాత్రమే అర్థమవుతుంది ప్రపంచంలో. తన భాషేంటో, తన కలలేంటో, తన ప్రతీ శ్వాసా నాకేదో చెప్తూనే ఉంది. మన్నింపులు ఒదగని గాలేదో ఇద్దరి మధ్యలో వీస్తూనే ఉంది. మృదువుగా ఆమె చేతులు పట్టుకున్నా. మునుపటి మోహమేదీ లేదు ఇద్దరిలో. కళ్లలోకి చూసుకునేంత ధైర్యం రాలేదు. తనకి తినిపించాలని, నుదుటిపై ముద్దిచ్చిపోవాలని అర్థమవుతోంది. కానీ, సినిమా కాదని, ఎప్పుడెవరొచ్చి పిలిచేది తెలీదని, అవకాశమే లేదని కూడా అంతే స్పష్టంగా...
పూర్తిగా »

అద్భుతం

అద్భుతం

“ఇప్పుడు నీకు దేవుడి కనపడి ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటావు?” అడిగాడు ఆయన. ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. దాదాపు యాభై ఏళ్ళ సంసార సాంగత్యం. దేవుడి విషయంలో వాదన జరగని రోజు లేదు.

“చివర్రోజుల్లో చాదస్తం వస్తుందంటారు. మీరు దేవుడిగురించి మాట్లాడటమేమిటి? పడుకోండి” అంటూ అప్పుడే ఆయనకు వేసిన మందుసీసా మూత పెట్టిందామె.

“ఇప్పుడు మాత్రం నేను దేవుడున్నాడన్నానా? నీకు నమ్మకం కాబట్టి నీకు కనిపిస్తే ఏం అడుగుతావనే కదా అడిగాను” తల తిప్పి తన వైపు చూస్తున్న అతని తలని నేరుగా పెట్టింది ఆమె. “ఎప్పుడూ ఆ సీలింగ్ నే చూడమంటే ఎలాగ పద్దూ. వుండే నాలుగు రోజులు నీ…
పూర్తిగా »

దిగంతపు అంచుల్లో

దిగంతపు అంచుల్లో

రేపే నా ప్రయాణం! ఇంత దాకా ఆశయాలని, అవసరాలని మోస్తూ నడిచాను. రేపు దారం తెంచుకున్న గాలి పటంలా గిరికీలు కొడుతూ కొత్త చిరునామాకి చేరుకుంటాను.

అర్థరాత్రి ఊహలతో రహస్య మంతనాలు జరుపుతున్నాను. ఎదురుచూపులు తప్ప లాప్టాప్ లో అలికిడి లేదు, కనీసం కారణం తెలియజేస్తూ ఈమెయిలు అయినా రాలేదు. తను వస్తుందనే ఆశ సన్నగిల్లి కార్పెట్ పై మెత్తగా ఒరిగిపోయాను.

వస్తావో రావో తెలియక
ఊసులు నిండిన రహస్యపుటరలు
ఒక్కొక్కటీ తెరిచి చూసాను
అన్నిట్లో ఒకటే రహస్యం

ఏమీ లేని సమయంలో
నాకు, నల్ల తెరకి
మధ్య సుదీర్ఘ సంభాషణ
ఏమీ తోచక కాదు..…
పూర్తిగా »

అద్భుతాల్రావు వాచి

అద్భుతాల్రావు వాచి

మొదటిసారి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కనిపించాడతను.

నీ కోసం ఒక ఉద్యోగం వుంది చేస్తావా? అనడిగాడు. ఏం వుద్యోగం అంటే సంబరంగా చెప్పాడు – నక్షత్రాలు వెదజల్లే ఉద్యోగమని.

నీకేమైనా పిచ్చి పట్టిందా? అన్నాడు నాన్న. రిటైర్డ్ లెక్చరర్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్. ఊరూ పేరూ లేని ఓ కాలేజిలో. అలాంటి ఉద్యోగం ఒకటి వుందంటే నేను నమ్మను. నువ్వూ నమ్మకు అన్జెప్పాడు.

అప్పట్నించి నేను చెక్ పోస్ట్ తప్పించుకోని మెహదీపట్నం మీదుగా పోతున్నా.

ఒకసారి రోడ్ నెంబర్ టెన్ దగ్గర కూడా కనిపించాడు. వస్తానంటే చెప్పు. నిన్ను ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసేశారు. అంటూ నా బైక్ కి అడ్డంగా…
పూర్తిగా »

గడ్డి తాడు

ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక గూండా రాజకీయ నాయకునిది. వాడికి ఓ ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజ్ లు, ఓ పదిపదిహేను బార్లు, ఐదారు  బ్రాండీ షాప్స్, ఐదారు రియల్టర్ కంపనీలు, నేషనల్ లెవెల్ ప్రభుత్వ రోడ్ కాంట్రాక్ట్ లు ఉన్నాయి. వాడి ముగ్గురు కొడుకులు ఓపెన్ టాప్ ఆడి కార్లలో ఇరుప్రక్కలా అందమైన అమ్మాయిలను వేసుకుని తను చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ కు అలా వాహ్యాళికొచ్చినట్టు వస్తారు. అంతా బహిరంగ శృంగార రసాత్మక చర్యలే. కాలేజంటే వాళ్ళ ఎస్టేట్. అడిగేవాడెవ్వడూ ఉండడు. ప్రిన్స్ పాల్ లక్షలిచ్చి పోషించబడే దిక్కుమాలిన అప్రాచ్యపు స్టాఫ్ ఒట్టి   వెధవలు. ఒక్కనికీ పాఠాలు చెప్పరావు.
పూర్తిగా »

తను-నేను

తను-నేను

తల గిర్రున తిరుగుతోంది. దాంతో పాటే కళ్ళూ. మెల్లిగా మూతలుపడుతున్న కళ్ళ ముందు దానంతట అదే తెరుచుకునే ఎలక్ట్రానిక్ డోర్ గుండా వస్తూ కనిపించిందామె. నీలం రంగు డ్రెస్ వేసుకుందన్న విషయం తప్ప మరేదీ కనిపించలేదు. అంతా మసక మసకగా ఉంది.

కళ్ళు పూర్తిగా మూతలు పడ్డాయి. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందామె. ఎంతందంగా ఉందీ!?

రిసెప్షనిస్ట్‍ను ఏదో అడిగి వచ్చి, పక్కనే కూర్చుంది. ఇప్పుడింకా అందంగా ఉంది.

5, 10, 15, 20.. నిమిషాలు గడుస్తూనే ఉన్నాయి. రాని మెసేజ్ కోసం ఈ గ్యాప్‍లో ఓ పదిసార్లు ఫోన్ చూసుకొని ఉంటా. ఆమెను చూడ్డం కోసమే! ఒకమ్మాయిని చూడ్డమంటే, చూడ్డమనే పనితో…
పూర్తిగా »

బౌండరీ దాటిన బాలు

బౌండరీ దాటిన బాలు

ఆరో క్లాసు చదువుతున్న జంగారెడ్డి పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. సాయంత్రం ఆట మొదలు పెట్టినపుడు “కొత్త కార్కు బాలు జర మెల్లగ కొట్టున్రి… ” అని అందరికీ మరీ, మరీ చెప్పాడు. ఆ ఫుల్టాస్ పడేదాకా అంతా అతని మాట విన్నట్టే అనిపించింది. బౌలర్ చెయ్య జారడం..బాటింగ్ చేస్తున్న షాజర్ కి బాలు బదులు ఫుట్బాలు కనిపించడం అరక్షణం తేడాలో జరిగింది, మిగిలిన అరక్షణంలో బాలు తాడి చెట్టంత ఎత్తెగిరి మైదానం పక్కనున్న ముళ్ళ పొదల మధ్యన పడింది.

ఆటగాళ్ళు జరిగింది దిగమింగుకునే లోపు షాజర్ కాలనీ వైపు బాణంలా దూసుకుపోయాడు, జంగారెడ్డి కసిగా కాస్త దూరం వెంబడించాడు కానీ బాలు వెతకాలనే ఆలోచన…
పూర్తిగా »