ప్రత్యేకం

“చిత్ర”మైన మనిషి – హంపి

ఫిబ్రవరి 2018


“చిత్ర”మైన మనిషి – హంపి

బొమ్మలదేవుందిలే? నాకు తెలీని బొమ్మలా! పేరు ప్రఖ్యాతులదేవుందిలే? ఏ చరిత్రలో నువ్వు మిగిలేవుగనక! డబ్బుదేవుందిలే? కలిమిగలవాని బానిస కొడుకుగా జీవితాంతం సంపాదించుకుందేగా! దాన్నంతా ఇక్కడ ఎవడు లెక్క చేయవచ్చాడు గనక!

కానీ ఓ చిత్రకారుడా, నీలోనా నీబయటా నువ్వుగా కనపడే ఒక సౌకుమారత వున్నదే నీలో! నీ రేఖలో, నీ కుంచె చివరి నీలిమలో, దాన్ని మించి నీ బుద్దిలో నీకంటూ ఒక అరుదైన ఆలోచన వున్నదే, దాన్ని వ్యక్తిత్వం అంటాం. అది అందరికీ అబ్బేది కాదు. ఉన్నదందరిదీనూ వ్యక్తిత్వం కాదు. ఈ వ్యక్తిత్వపు అభివ్యక్తి పేరు పేరు హంపి. నేను ఈ తెలుగు జీవితంలో నా తరం చిత్రకారుల్లో చూసిన అరుదయిన ఒక…
పూర్తిగా »

హంపివిరూపాక్షుడు – దక్షిణ భారతదేశ సాంస్కృతిక ప్రస్థానం

డిసెంబర్ 2017


హంపివిరూపాక్షుడు – దక్షిణ భారతదేశ సాంస్కృతిక ప్రస్థానం

చాలా ప్రాచీన కాలంలో ప్రకృతి యొక్క శక్తులను దేవుళ్ళుగా, దేవతలుగా భావించి ఆరాధించేవారని చెప్పటానికి మన వాఙ్మయంలో కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. వేదకాలంలో ’రుద్రుడు’ ఒక దైవం. ఈ ’రుద్ర’ శబ్దానికి నిరుక్తంలో ’రోరూయమాణః ద్రవతి ఇతి రుద్రః’ అని ఒక వ్యుత్పత్తి చెప్పారు. అంటే "హుర్రు...అన్న తీవ్రమైన శబ్దం చేస్తూ ప్రవహించే వాయువు" రుద్రుడు. వాయుదేవుడే రుద్రుడు అని చెప్పటానికి ఋగ్వేదంలోనూ కొన్ని సూక్తములు ఉన్నవి. తదనంతరకాలంలో రుద్రుడు - ’శివుడు’ గా పరిణమించటం, ఏకాదశ రుద్రులుగా వ్యాప్తి చెందటం జరిగాయి. హిందూ దేవతల వెనుక మార్మికమైన కథలు, కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాలే విరూపాక్షుడికీ ఉన్నాయి.
పూర్తిగా »

క్రాస్ వర్డ్ పజిళ్లు – నా ప్రస్థానం

అక్టోబర్ 2017


క్రాస్ వర్డ్ పజిళ్లను గురించిన నా అభిప్రాయమేమంటే, మూసిన నా పిడికిలిలో ఏముందో చెప్పుకో అన్నట్టుగా ఆధారాలు జటిలంగా ఉండటం కాక, పజిల్ను పూరించింతర్వాత పాఠకులకు తృప్తి, త్రిల్ కలిగించే విధంగా ఉండాలి, అని. అక్షరక్రీడకు/పదక్రీడకు (word play కు) అవకాశం ఉన్నప్పుడే తృప్తి, త్రిల్ కలిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఆధారంలోనే జవాబు దాగి వుండి, బాగా ఆలోచిస్తే అది మెదడుకు తట్టాలి. అట్లాంటి ఆధారాలను వర్ణించడానికి మన తెలుగు భాషలో అంతర్లాపి అనే ఒక పదమున్నదని నా అన్నయ్య (నాగరాజు రామస్వామి) చెప్తే తెలిసింది నాకు. ‘ద హిందు’ ఆంగ్లపత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ పజిళ్లలో అటువంటి లక్షణాలు పుష్కలంగా…
పూర్తిగా »

అమృత వర్షిణి

ఆగస్ట్ 2017


అమృత వర్షిణి

ఒక వేసవి సాయంకాలం కురిసిన ఎదురుచూడని వర్షం- అమృత!

అమృతా ప్రీతమ్- ఎప్పుడు ఎలా పరిచయమైందో గాని చదివిన మొదటి సారే మనసుకి చాలా దగ్గరగా అనిపించిన రచయిత్రి. ఆలోచిస్తే గుర్తొచ్చింది, నా యునివర్సిటీ రోజులనుకుంటాను, ఒక వెన్నెల రాత్రి హాస్టల్లో చాలా మంది నిద్రపోతున్న వేళ, కొబ్బరాకు గలగలల మధ్య ఏదో పుస్తకం తిరగేస్తూ నడుస్తున్నాను-తడుస్తుంది, వెన్నెల్లో అనుకున్నాను కానీ… కాదు తన కవిత్వంలో! ఆ తడి నన్ను చాలా రోజులు వెంటాడింది.

కొందరు మన జీవితంలో ఎందుకు తారసపడతారో తెలీదు- వదల్లేం. వ్యక్తిగతంగా పరిచయం లేకపొయినా కొందరు కవులూ, రచయితలు కూడా అంతే.

అమృతప్రీతమ్ బాధని ఆస్వాదించారు. అదే విలువైనదని, తనమటుకు తనకు…
పూర్తిగా »

మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ నవలలు – ది ప్రెసిడెంట్ , మెన్ ఆఫ్ మైజ్

ఆగస్ట్ 2017


మిగ్యుల్ ఏంజెల్ ఆస్ట్రియాస్ నవలలు – ది ప్రెసిడెంట్ , మెన్ ఆఫ్ మైజ్

తన తల్లిని అవమానించటంతో ఒక యాచకుడు ఓ సైనికాధికారిని పొరపాటున చంపటంతో కథ మొదలవుతుంది. నియంత ఆ హత్యను స్వప్రయోజనానికి వాడుకోవాలని ఆ నేరాన్ని తన అసమ్మతి వర్గానికి చెందిన మరొక సైనికాధికారి మీద మోపుతాడు.
పూర్తిగా »

హెమింగ్వే మ్యూజియం

ఏప్రిల్ 2017


హెమింగ్వే మ్యూజియం

రచయితలు మనుషులుగా నిష్క్రమించినా, రచనలుగా ఎప్పటికీ మిగిలే ఉంటారు. కొన్ని పుస్తకాలు చదువుతుంటే, అయ్యో వీళ్ళు బతికుండగా కలుసుకోలేక పోయినా కనీసం సమకాలికులుగా అయినా లేమే? అనిపిస్తుంది. అలాటి వాళ్లలో జాక్ లండన్, హెమింగ్వే తప్పకుండా ఉంటారు నా లిస్టులో. స్వేచ్ఛా ప్రవృత్తితో ఇష్టమైన జీవితాన్ని బతికినన్నాళ్ళూ గడిపిన వాళ్ళే ఇద్దరూ! జాక్ లండన్ కి రిగ్రెట్స్ ఏమీ లేవేమో గానీ హెమింగ్వే జీవితాన్ని, తనకు తానే రాసుకున్న మరణ శాసనాన్ని చూస్తే ఉన్నాయేమో అనిపిస్తుంది. సొసైటీ లో ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని, తమ నిష్క్రమణ వెనుక సాగబోయే ఊహాగానాల్ని లెక్క చేయక మరణాన్ని కౌగిలించుకునే సెలెబ్రిటీల మనసుల్లో దాగున్న అగాథాలేమిటో, ఎంత లోతైనవో,…
పూర్తిగా »

మెటాకవితలు మూడు

ఫిబ్రవరి 2017


మెటాకవితలు మూడు

కవిత్వం గురించీ, కవిత్వ తత్వం గురించీ, తమకి కవిత్వంతో ఉన్న సంబంధం గురించీ సుమారుగా ప్రతీ కవీ కవితాత్మకంగానే చెప్తాడు. స్పానిష్, హిబ్రూ, ఇంగ్లీషు భాషల్లోంచి అటువంటి మెటాకవితలు మూడు.

హోర్హె లూయిస్ బోర్హెస్ ఆలోచనలూ, వ్యక్తీకరణా, అతని ఊహలూ, అతని ఇమోషన్లూ వీటన్నిటిలో అంతర్లీనంగా ఏదో దగ్గరితనం ఉంది – ఎంతగా అంటే, అతను ఇక్కడే నడయాడి, మనదైన దాన్నెంతో తనలో ఇంకించుకున్నాడేమో అనే అంతగా.

ఇస్రాయెల్ కి చెందిన ప్రసిద్ఢ కవయిత్రి Leah Goldberg. హీబ్రూలో ప్రథమ శ్రేణి కవయిత్రి. రెండో ప్రపంచ యుద్ధం, ఇస్రాయెల్ స్వాతంత్రం, యూదుల వలసలు, హోలోకాస్టు ఇవన్నీGoldberg వస్తువులు.

అమెరికాలో స్థిరపడి, అక్కడే…
పూర్తిగా »

ఒకటీ రెండూ ఐదూ పదీ ఇరవై

ఒకటీ రెండూ ఐదూ పదీ ఇరవై

ఒక రోడ్డు, పార్కు, గుడి, హాస్పిటల్, ఆఫీస్, బాంక్, పబ్, చివరికి స్మశానం…

ఒక రచయితకి ముడిసరుకు దొరకని చోటేదైనా ఉంటుందా? అలాంటి చాలా చోట్లకి తిరిగారు రాజిరెడ్డి. రచయితగా కాదు, జనంలో ఒకడిగా. ముడిసరుకుని పోగుచేసుకుని వాటిని కథలుగా మలుచుకునేందుకు కాదు. రచయిత తాలూకూ లోలోపలి వ్యాఖ్యానాన్ని అదిమిపెట్టి ఒక కెమెరాలాగా, ఒక టేప్ రికార్డర్ లాగా తనకి ఎదురైన అనుభవాల్ని నమోదు చేసుకునేందుకు. ఆయా చోట్లలో తారసపడ్డ విషయాల్ని ఉన్నదివున్నట్టు పాఠకుల ముందు ఉంచేందుకు. ఇదొక సెల్ఫ్ చెక్, సోషల్ చెక్, రియాలిటీ చెక్. మనకి సీదా సాదాగా ఒకే డైమెన్షన్ లో కనిపించేదే రాజిరెడ్డికళ్ళతో చూసినపుడు బహుమితీయంగా, ఫిలాసాఫికల్…
పూర్తిగా »

కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం

కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం

రాయప్రోలు సుబ్బారావుగారి ప్రభావంతో ఆధునిక కావ్యాలలో వియోగ శృంగారానికి ప్రాధాన్యం వచ్చింది. నవరసాలలో ప్రప్రథమంగా చెప్పదగినది శృంగారం. ఇది సంభోగం, విప్రలంభం అని రెండు విధాలు. విప్రలంభ శృంగారం ఐదు విధాలని మమ్మటాదుల అభిప్రాయం. అవి 1. అభిలాష 2. విరహం 3. ఈర్ష్య 4. ప్రవాసం 5. శాపం. ఇందులో ప్రవాసం కృష్ణశాస్త్రి కావ్య పరిశీలనకి అవసరం. ‘అనురక్తులైన నాయికా నాయకులు కార్యాంతర వశమున దేశాంతరగతులగుట ప్రవాసము’.

కాళిదాసు మేఘసందేశం ప్రవాస విప్రలంభానికి చెందిన కావ్యం.

‘త్వా మాలిఖ్య ప్రణయ కుపితాం ధాతురాగైః శిలయా
మాత్మానంతే చరణపతితం యావదిచ్చామి కర్తుమ్
అస్త్రైస్తావమమ్హరు ప చితై ర్దృష్టి రాలుప్యతే మే

పూర్తిగా »

కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం

కృష్ణశాస్త్రి కవిత్వంలో దుఃఖం కొత్త తరహాలో రూపుదిద్దుకుంది. భావకవులు బాధని వరంగా భావించారు. రొమాంటిక్ కవులూ, ఫ్రెంచి కవులూ తమ తమ కవితాప్రస్థానంలో దుఃఖానికి తగిన స్థానాన్నిచ్చారు. ఆంగ్ల సాహిత్యంలో ఈ రకమైన దుఃఖాన్ని రొమాంటిక్ మెలంకలీ అంటారు. దీని తత్వం ఇలా ఉంటుంది.

‘Longing for the unattainable ideal; and the feeling that the sensitive artistic genius is bound to be destroyed by the material crowd’

ప్రపంచం నిర్జీవంగా కనిపించి, కృష్ణశాస్త్రి సంధ్యా సమీరాన్ని ఉద్దేశించి ఇలా అంటారు.

‘ఓయి సంధ్యా సమీరణా, రేయి తోడ
కారు చీకటి తోడ దుఃఖమ్ము కూడ

పూర్తిగా »