అన్ని గతాలూ ఊడ్చుకుపోయి
ప్రతినిమిషం ఒక మొదలూ-చివరా ఉన్న
ప్రత్యేక జీవితంలాగా వెలిగింది.
వెలిగిన క్షణాలకు ముందు గడిపిన
బాల్య జీవితపు వాసనలు, కర్మ వైఫల్య భయాలు
కరిగిపోవడం చూశాను.
ఏళ్ళకొద్దీ పాదుకుపోయిన సంప్రదాయపు
శృంఖలాలను తెగ్గొట్టలేక పడిన వేదనలు
కాలిపోవడం చూశాను.
ముల్లుల్లా గుచ్చుకుంటున్న
ఆశల ఆశయాల నాటకపు రంగ పాత్రలు
అదృశ్యమవడం చూశాను.
ప్రభాత వీచికల సుగంధం -
వర్ణశోభితమైన కొండ చరియ దర్శనం –
భాసిల్లిన గంగోత్రీ గానం -
సాకార ప్రతిపాదనలన్నీ నైరూప్యాలై
చివరికి మిగిలేది ఇదే ననడం చూశాను.
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?