గడియారం ముల్లు గుచ్చుతోంది
జ్ఞాపకాల లేసులు గుండె గలీబు అంచవుతున్నాయి
ఒకటా రెండా.. చుక్కల్లా లెక్కకు అందవు
మరుపు దాగుడుమూతవుతూ
నిన్ను తీసుకెళ్ళడం మరుస్తూనే వుంటుంది..
నువ్వొక మబ్బు తునక
మనసు కప్పుకున్న దుప్పటివి
దూదిపింజలా తేలిపోయే కాలం
సూర్యుడ్ని గుండెలో నింపుకుంటూ నేను
నువ్వొక వాన జల్లు
మనసు కురిసినంత సేపు
తడిచి ముద్దైన ప్రేమ
దోసిట్లో నిలవని నీళ్ళంత జ్ఞాపకం
నువ్వొక మమతల మెరుపు
కళ్ళు మిరుమిట్లు వెలుగు
వెన్నముద్దగ చేసే లోపే
చిమ్ముతున్న నవ్వుల జలపాతంలా వెళ్ళిపోతుంది
గుప్పెడు ఆలోచనలు కుమ్మరించి
లాలనగా నా వంక చూస్తూ వుంటుంది ఏకాంతం
చీకటివెలుగుల మొజాయిక్ అల్లుకుంటూ
నేనూ నా ఆలోచనలూ మాత్రమే మిగిలేది!
ఓహ్! చదువుతున్నంతసేపూ “సూర్యుణ్ణి గుండెలో నింపుకుని” మరీ మీరు మాట్లాడుతున్నట్టే ఉంది. ఇవాళ పొద్దున్నె ఇంతమంచి కవిత్వం చదవగానే ఎందుకనో స్విన్ బర్న్ గుర్తుకొచ్చాడు. సాయంత్రానికల్లా మళ్ళీ అతనివి కొన్ని చదవాలనిపించారు. ఓ సీజన్డ్ కవయిత్రి కవిత చదువుతున్న అనుభూతి జయాజీ. క్యుడోస్
Thank you Devji.. Reading your appreciation made my day!
గుప్పెడు ఆలోచనలు కుమ్మరించి
లాలనగా నా వంక చూస్తూ వుంటుంది ఏకాంతం
చీకటివెలుగుల మొజాయిక్ అల్లుకుంటూ
నేనూ నా ఆలోచనలూ మాత్రమే మిగిలేది!
conceptual words…with high thought provoking lines…great madam
Thank you Cv Suresh garu
నువ్వొక వాన జల్లు
మనసు కురిసినంత సేపు
తడిచి ముద్దైన ప్రేమ
దోసిట్లో నిలవని నీళ్ళంత జ్ఞాపకం
these lines reflect the crux of the pain. good poem. go ahead
Thank you Theresh garu
pain of poem – బాగుంది అక్కా ..
మనసులో ,ఆలోచనల్లో నిలుకడ లేని సమయాలను సృష్టిస్తూ అనుభూతులన్నిటిని , భావాలన్నిటిని కవిత చేసే వరకు మనసు ఊరుకోదు కాదు … ఆ బాధను అంతే చక్కగా వ్యక్తీరరించారు అచ్చం మీ నవ్వులోని సున్నితత్వం లాగా … //
“నువ్వొక మబ్బు తునక
నువ్వొక వాన జల్లు
నువ్వొక మమతల మెరుపు
దోసిట్లో నిలవని నీళ్ళంత జ్ఞాపకం “- అని మీరు కవితను పిలుస్తుంటే మీతో దోబూచులాడుతున్న కవిత మీకు తీయని బాధనివ్వడం సబబే నేమో
dearMercy నిజమే ఆ తీయని బాధ వేదనలే సాహిత్య సృజనవుతాయి.
వరించి మరీ భరించాలి…అనుభవించాలి. తప్పదు
జయశ్రీ గారు: ఇంతకు ముందు కంటే భిన్నమయిన వ్యక్తీకరణలోకి మీరు వెళ్ళడం ఈ కవితలో చూస్తున్నా. నాకు అర్థమయినంత మటుకు కవిత్వ వాక్యానికి వొక వుద్వేగపు తూగు చాలా అవసరం. మొట్టమొదటి సారి ఈ కవితలో ఈ వుద్వేగపు తూగు వినిపిస్తోంది.
“గుప్పెడు ఆలోచనలు కుమ్మరించి/
లాలనగా నా వంక చూస్తూ వుంటుంది ఏకాంతం”
ఏకాంతం అలా లాలనగా చూడడమే కవిత్వం అనిపిస్తుంది నాకు.
ఎప్పటికప్పుడు మనసుకు గ్రీష్మ వసంతాలుండటం తప్పని సరేమో అఫ్సర్ జీ
రాలిపోవడం లోనూ, కొత్త చిగురు రావడమూ రెండూ.. వేదనా భరిత ప్రక్రియలే.
అది సంపూర్ణంగా అనుభవిస్తూ రాయడం కొత్త అనుభవమయ్యింది నాకు
నువ్వొక వాన జల్లు
మనసు కురిసినంత సేపు
తడిచి ముద్దైన ప్రేమ
దోసిట్లో నిలవని నీళ్ళంత జ్ఞాపకం.. touching lines Madam..
థాంక్యూ వర్మ గారు