‘ పప్పు నాగరాజు ’ రచనలు

మెటాకవితలు మూడు

ఫిబ్రవరి 2017


మెటాకవితలు మూడు

కవిత్వం గురించీ, కవిత్వ తత్వం గురించీ, తమకి కవిత్వంతో ఉన్న సంబంధం గురించీ సుమారుగా ప్రతీ కవీ కవితాత్మకంగానే చెప్తాడు. స్పానిష్, హిబ్రూ, ఇంగ్లీషు భాషల్లోంచి అటువంటి మెటాకవితలు మూడు.

హోర్హె లూయిస్ బోర్హెస్ ఆలోచనలూ, వ్యక్తీకరణా, అతని ఊహలూ, అతని ఇమోషన్లూ వీటన్నిటిలో అంతర్లీనంగా ఏదో దగ్గరితనం ఉంది – ఎంతగా అంటే, అతను ఇక్కడే నడయాడి, మనదైన దాన్నెంతో తనలో ఇంకించుకున్నాడేమో అనే అంతగా.

ఇస్రాయెల్ కి చెందిన ప్రసిద్ఢ కవయిత్రి Leah Goldberg. హీబ్రూలో ప్రథమ శ్రేణి కవయిత్రి. రెండో ప్రపంచ యుద్ధం, ఇస్రాయెల్ స్వాతంత్రం, యూదుల వలసలు, హోలోకాస్టు ఇవన్నీGoldberg వస్తువులు.

అమెరికాలో స్థిరపడి, అక్కడే…
పూర్తిగా »

ప్రోషిత భర్తృక

ప్రోషిత భర్తృక

పరదేశంబున కేగు భర్తృకరమున్ బట్టన్ ప్రయత్నంబుతో
పరుగుల్వెట్టుచు పొంగెనుప్పెనగ హృద్వారాశి, తా జ్ఞాపకా
ల రుచుల్ దాచుకొనన్ ప్రయాస, మదిలో రాగంబు దోగాడగన్
తరమా! ప్రోషితభర్తృకావిరహ మోదార్పన్ నిశారంభమున్!
పూర్తిగా »

మలిన బాష్ప మౌక్తికమ్ము!

నవంబర్ 2016


మలిన బాష్ప మౌక్తికమ్ము!

“నేను కవిత్వాన్ని ఎందుకు ద్వేషిస్తాను” అంటూ పొడుగాటి వ్యాసం ఒకటి రాసాడు బెన్ లెర్నర్. బెన్ స్వయంగా కవి, ఆయన ప్రచురించిన కవిత్వ సంకలనాలకి ఎవార్డులు కూడా వచ్చాయి, కవిత్వాన్ని, కవిత్వ ధోరణులని శాస్త్రీయంగా అధ్యయనం చేసిన విమర్శకుడు ఆయన. మరి అలాంటి ఒక కవే కవిత్వాన్ని ద్వేషించడం ఏమిటి? దీనికి సమాధానంగా కొన్ని ఆసక్తికరమైన కారణాలు చెప్పుకొస్తాడు బెన్.

ఆయన అభిప్రాయంలో, కవిత్వం రానివారంటూ ఎవరూ లేకపోవడమే కవిత్వంతో మొదటి ఇబ్బంది. ఎవరితోనైనా “నేను కవిత్వం రాస్తా” అని చెప్పారనుకోండి, లేదా ఏదో కవితని ప్రస్తావించారనుకోండి. సాధారణంగా, అవతల వ్యక్తి కూడా, “ఓ, నేను కూడా ఒకప్పుడు కవితలు రాసానండోయ్” అనో, లేదా “మా…
పూర్తిగా »

Now, I eat only cannibals

సెప్టెంబర్ 2016


Once upon a time
My nipples were rosebuds of love
My belly was the cradle of an unborn thought
Now, it is just a black mass of a hardened mole
a burden of unwanted fat
Weightless waves
of past love and pain
crash into my eyes
With fermented passion
Now, I eat only cannibals

When machado’s men
rein in my veins
When her beauty…
పూర్తిగా »

మన కథన సంస్కృతులకొక కొత్త వ్యాకరణం

మన కథన సంస్కృతులకొక కొత్త వ్యాకరణం

“మానవ జాతికి ధర్మాలు, అధర్మాలు నేర్పించి నాగరకత పెంపొందించేది రామాయణం, మానవ సంఘం మళ్లీ జంతుత్వంలోకి జారిపోకుండా కాపాడేది రామాయణం” అంటూ లవకుశ సినిమాలో వాల్మీకి పాత్రధారి నాగయ్య కుశలవులతో అంటాడు.

ఒక కవిచేతే తన రచన గురించి ఇంత ఆర్భాటంగా చెప్పించడంలోని ఔచిత్యం మాట ఎలా ఉన్నా, సుమారుగా మనకి తెలుగులో రామాయణం మీద వచ్చిన రచనలూ, విమర్శలూ, చర్చలూ, ప్రవచనాలూ ఈ దిశగానే ఉంటాయి. కల్పవృక్షాలు, విషవృక్షాలూ, ఈ మధ్య టి.వి. చానెళ్లలో నిరంతరాయంగా వినవచ్చే ప్రవచానాలు మొదలైనవి రామాయణం కథని రకరకాలుగా విశ్లేషించడమో, అందులోని భక్తినీ, రక్తినీ, ఆధ్యాత్మికతనీ, ఆ కావ్యంలోని సామాజిక, సాంస్కృతిక విలువలనీ, ఇంకా ఈ మధ్య…
పూర్తిగా »

గజీతగాడు

ఉదయాలన్నీ, షరా మామూలే
మాజిక్ ఫ్లూట్ సంచిలో వేసుకుని
మోహనగీతం విరజిమ్ముతూ
పగిలిన ముక్కలన్నీ పెద్దరికంతో అంటించుకుని
గుండెతడిని బతికించుకోడం కోసం
ఉక్కిరిబిక్కిరి పనిలో ఊపిరాడకపోవడం
ఎంత సుఖం!!

ఆత్మని తడిమే ఒక్క కవితకోసం వెంపర్లాట
ఏటిగట్లన్నీ నిరాకరించిన కన్నీటిపాట
పూర్తిగా »

ఎదారి

వట్టిపోయింది తేనెతుట్టె
ఒకటో రెండో తేనెటీగలు
గుచ్చి చూడడానికే
వచ్చిపోతుంటాయి

నదిమీదకి ఒరిగిన చెట్టునీడ
ఒకనాటి జ్ఞాపకం
ఒరవడిలో నిలవలేనిది ఒకటి
నీటిబొట్లన్నీ ఆకులైతేగానీ
కదలలేనిది మరొకటి

లోకం చేతిలో విరచబడి, మలచబడి
అనేకంగా అమ్ముడుపోయింది అస్తిత్వం
ఇక శరీరమొక్కటే పగలని నిజం

వాక్యాన్ని ఆపే విరామచిహ్నం
మొండిది, ఎంత తోసినా జరగదది
మాసిపోయిన గతానికి, కాబోయే గాయాలకీ
మధ్య చక్కని చుక్కలా జీవితం

నమ్మకానికీ, సందేహానికీ మధ్య
చీలిన దారిదగ్గర, చిరిగిన డేరాలో
కుప్పకూలిన ఒంటెతో
శరణార్థిగా
నేను

పూర్తిగా »

Why is Sex Fun?

ఏప్రిల్ 2016


‘చిత్తకార్తె కుక్క’ అంటాం కానీ, నిజానికి మనల్ని చూసే కుక్కలు ఆ మాట అనుకోవాలి. ఓ జిరాఫీవో, ఓ కుక్కో, ఓ సింహమో మన సెక్సువల్ సంబంధాలపై అభిప్రాయం చెప్పాల్సి వస్తే, మనల్ని చూసి “నవ్విపోతాయి” – “వీళ్ళేంటీ, ఎవరికీ కనిపించకుండా, అంత రహస్యంగా సెక్సులో పాల్గొంటారూ, ఒక్క వ్యక్తితోనే జీవితాంతం కలిసుంటారూ, సంవత్సరమంతా, సంతానోత్పత్తితో సంబంధంలేకుండా అనవసరమైన సెక్సుపై వీళ్లకెందుకంత కుతి చెప్మా?” అనుకుంటాయేమో.

ఇదే శీర్షికతో పుస్తకం రాసిన జారడ్ డైమెండ్, మానవుల సెక్సువాలిటిలో ప్రత్యేకతలని టూకీగా ఈ విధంగా చెప్తాడు:

మానవులలో, అత్యధికశాతం స్త్రీ-పురుషులు దీర్ఘకాల దాంపత్యానికి కట్టుబడతారు. ఈ ఒడంబడిక కేవలం వారిద్దరికి మాత్రమే సంబంధించినది కాక, చుట్టూ ఉన్న…
పూర్తిగా »

ఇసుక పరదాలు

ఫిబ్రవరి 2016


ఇసుక పరదాలు

మాటలు మాటలు మాటలు
చేతివేళ్లలోంచి
జలతారుగా జారిపోయే
పసిడి పూతల ఇసుక పరదాలు

శీతాకాలం ఉదయం,
నూతిని మింగేసిన పొగమంచు పూసలు

సిగరెట్టు దమ్ములా
మెదడంతా కమ్ముకున్న బొగ్గు చారికలు.

***

Let me make a confession. I am an expert user and was also a profound victim of the Internet Chat Window.

జీ-టాక్ వచ్చిన కొత్తలో అదో మత్తు. ఎవరెవరో, ముక్కు మొహం తెలియని వాళ్ళతో, మొదటి పరిచయంలోనే ఒక్క అరగంటలో ఏదో జన్మాంతర పరిచయం ఉన్నట్టు మా పెరట్లో నందివర్ధనం మొక్క దగ్గరనుంచీ, బెంగలూరులో…
పూర్తిగా »

సైలెంట్ రీడింగ్

సెప్టెంబర్ 2015


తలమునకలుగా పుస్తకంలో లీనమైపోయి, దీక్షగా కళ్ళు వాక్యాలవెంట పరుగులు తీస్తుండగా, ఏవేవో ఆలోచనలతో, ఊహలతో తమ ఉనికినే మరిచిపోయినట్లున్న పాఠకులు మనకి లైబ్రరీలలో, కాఫీషాపుల్లో, ట్రైన్లలో, బస్సుల్లో, వెయిటింగురూముల్లో, ఇంకా మరెన్నోచోట్ల కనిపిస్తూ ఉంటారు. పుస్తకంలో మునిగిపోయిన పాఠకుడికీ పుస్తకానికీ మధ్య జరిగే అద్భుతమైన మౌనసంభాషణకి ఏ సాక్ష్యమూ మిగలదు – పుస్తకంలో లీనమైపోయిన ఆ పాఠకుడి ముఖ కవళికలు తప్ప!!

మన కళ్ళకి చదవడం తెలుసు. తెలుగు వాక్యాన్ని చదవకుండా, దాన్నో బొమ్మలా చూడటం మనకి అసాధ్యం. కళ్ళకి ఇటువంటి ‘చదివే’ శక్తి ఈ మధ్యనే వచ్చిందంటాడు జూలియన్ జీన్స్. ఆయన సిద్ధాంతం ప్రకారం, కళ్ళకి వాటంతట అవే చదివే శక్తి క్రీ.పూ మూడో…
పూర్తిగా »