డైరీ

* M.J *

డిసెంబర్ 2014

 

Have you ever experienced the slowness?
Have you ever entangled with clonus?

“ఎక్కణ్ణించి రా, ఎంత?”

- “మంగళ్హాట్ రాజూ నాయగ్గాడి దగ్గర, 100 రూపాయల్”

“తొందరగ్గలుపు, గింజల్దీయిరా, సస్తంలేపోతే”

-”సస్తేమైతది, చూద్దామ్ ఒకసారి”

కాస్తంత పొడిగా నలిపిన గంజాకు, కావాల్సినంత తంబాకు కలిపి సిగరెట్లో కూరి అంటించి లాగితే
ఊ ఊ ఊ ఊ ఫ్ ఫ్ ఫ్ ఫ్ ఫ్ హా హా హా హా హా… have you ever been madly euphoric?
కొండెక్కిన అనుభవాల గాలానికి చిక్కని ఎస్కేప్డ్ రూట్, గ్లోరీ హోల్ లోపలి వర్షానికి తడిసి చెదిరిన పిట్టగూడు రాల్చిన కట్టెపుల్లలు,
need more, need more, need more.. shut the f* up.. grow more..

“టెట్రా హైడ్రో కన్నాబినాల్” పన్చేస్తుంది మెదడ్లో, మెన్ ఎట్ వర్క్,
ఊ ఊ ఊ ఊ ఊ ఫ్ ఫ్ ఫ్ ఫ్…సెక్స్, చాక్లెట్, వీడ్, త్రిమూర్తపు తొడుదొంగలు.. వీరీ వీరీ గుమ్మడిపండు వీడ్ పేరేమీ, డ్యాం దాటిస్తాయ్ డోపామైన్ వరదల్ని పంచప్రాణాలు పరుండిన పల్లంవైపు, పరమానందం, exquisite bliss.. జీలే జరా, జీలే జరా జీ లే జరా.. జీ లేజరా..
కొత్త పదాలతో పూరీలు ఖాళించుము.. retrograde neologism..
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని..

ఊ ఊ ఊ ఊ ఫ్ ఫ్ ఫ్ హా హా హా….
“అగ్గిపెట్టీరా రేయ్ అగ్గిపెట్టె”
command received, been processing in temporal lobe auditory area 41/42

“రేయ్ నిన్నే బే అగ్గిపెట్టె”
recent memory stored in hippocampus..((అగ్గిపెట్టీరా..))

transmission in progress, kindly be patient..
ఏరియా 41/42 నుండి thalamus నుండి చివరికి పరమపదం pre-frontal motor cortex area 5, 6 వయా internal capsule..

“అబ్బే ఛూతే, అగ్గిపెట్టీరా”..
command received to the base, waiting for the response sequence
బదులుగా ప్రచోదనాల ప్రవచనం
మెదడ్నుండి వెన్నుపాముకి, అక్కడ్నించి చేతివేలి కండరాలకి,

“రేయ్ అగ్గిడబ్బరా నాయ్నా, ఎంతసేప్రా, ఎక్కిందా అప్పుడే”
estimated distance- 6 feet; object location confirmed..

ఎడమచేతిని 20 డిగ్రీలు ఎడమవైపు తిప్పి, రెండడుగులు కిందికి దింపితే అగ్గిపెట్టె ..పుస్తకమ్మీద.. slowness..
కండలు ఇనుప గడ్డకట్టిన పక్షవాతపు నిమ్మళత్వం..
hold it tight, estimated time of flight- 1.7 seconds
విసిరేయ్ అగ్గిపెట్ని వాడివైపు.. విసిరె…
“రేయ్ అగ్గిప్..”

ఊ ఊ ఊ ఫ్ ఫ్ ఫ్ హా హా హా…
“అరె బాబా, గానా లగారే”
కంటిపాప సంకోచ వ్యాకోచం hippus.. ట్యూబ్లైట్ రంగుగాలి గోడమీద ఆగింది, పురుగు వేటలో పెంపుడు బల్లి దొంగ తపస్సు నిశ్చలనం..
నిక్కబొడుచుకున్న వెంట్రుకల తొడమీద ఆడ అనాఫిలస్ దోమ శృంగారపు రక్త చుంబనం,

“రేయ్ గానా రే, డిచ్చిక్ డిచ్చిక్ లగారే”
నొప్పి కుట్టిన నొప్పికి దోమ కుట్టిన నొప్పి సమాదానం, మరి ప్రశ్నేది, చంపడమేనా.. దోమనా ప్రేమనా..
కళ్లకేదో అపసమ్యక్ దివ్యదృష్టి, పెదాలకంటిన మారిజువానా వాసనరుచి ముక్కుకంటించాకా, చేదు.. చేదుజిగట నలుపు చెంపలు,
కాసేపు ట్రాన్స్ సంగీతంలోకి అనభ్యుదయ ప్రయాణం, ఉష్ణబిలంలోంచి పాకుతుంటే చిరిగిన మిధ్యాపాదాలు,
నీ ముఖంలో నా ప్రతిబింబం మాంసమై మెత్తగా, టచ్ వుడ్, మేఘపు క్షణాలు తేలుతున్నాయ్ జలుబు చీమిడంటిన పరుప్మీద..

mania..
పిచ్చెక్కిన కోతికి కల్లెందుకు, ఇసుక అంటిన పాదాల అడుగుల చప్పుడు, గ్రీక్ష్ గ్రీక్ష్ గ్రీక్శ్..
పీల్చాలి పవిత్ర పత్ర ధూళిని….ఊ ఊ ఊ ఫ్ ఫ్ ఫ్ హా హా హామ్ మ్ మ్ మ్ …
ఙ్నానం, నాలుగోనేత్రం తెరుచుకుంది వెలివేయబడ్డ నీడ నీడకు, స్వల్పమైనవే అత్యద్భుతాలు,
చంకలో దురద గోక్కున్న గోళ్ళు దైవస్వరూపాలు..మరి దయ్యం..M.J..marijuana

M.J..మేరా జాన్ మేరీ జేన్, స్పైడర్ మేన్ గాడ్నొదిలేయ్, నేనున్నాగా అటూ ఇటూ వేళ్ళా కాళ్ళా ఆడేవాడిని,
” రేయ్ ఛోటే భూక్ లగ్రారే, భూక్”
damn gluttony…ఘోరాకలి..
భూ భూ భూఃస్వ.. భూ…క్…
గ్రామర్ హననం జరగాల్సిందే.. language is a lie..

నాదో చివరి ప్రశ్న..
were you ever was a myth?