శబ్దాలన్నీ వాటి వాటి గూళ్ళలో ముడుచుకున్నాక
దేహకమండలంలో కాసిన్ని నిశ్శబ్దపు నీళ్ళు నింపుకుని
నువ్వు నాటుకుంటూ వెళ్ళిన ఆ బుల్లిబుల్లి మాటల వెనకే
నువు నేర్పిన ఆ పాత మంత్రాన్నే కొత్తగా జపిస్తూ వెళ్తాను.
వెళ్తున్న దారిలో
నీ పాదాల గుర్తులు మాయమయినదగ్గర
నీ పరిమళం ఆనవాలు పట్టుకుని అయినా సరే
నాకు నేను కనిపించనంతవరకూ వెళ్తాను.
లోకం అంటే నచ్చక కాదు
శబ్దాలంటే ఇష్టం లేక కాదు
దూరాల్ని ఛేధించాలనీ కాదు
నువ్వేంటో కనుక్కోవాలనీ కాదు
వెళ్తూ వెళ్తూ నువు నాటుకుంటూ వెళ్ళిన ఆ చిన్ని మాటలు
తిరిగొచ్చే లోపు పొద్దుదిరుగుడు పూలవ్వడం చూడ్డానికి
వెళ్తూ వెళ్తూ నువు చిలకరించుకుంటూ వెళ్ళిన నీ పరిమళం
తిరిగొచ్చే దార్లో మిణుగురుపురుగులవ్వడం చూడ్డానికి
వెళ్తూ వెళ్తూ నువు అద్దిన పాదాల అచ్చులు
దారి చీరకు వెన్నెల కుచ్చుల్లా మెరవడం చూడ్డానికి
అవును
తిరిగి రావడానికే
నానుండి నేను దూరంగా వెళ్తాను.
Photo Credit: Tamar Frank
చాలా బావుంది
Nice one, as usual. మీ చేతుల్లో పడితే ఎంత మామూలు విషయమైనా మంచి కవిత అవుతుందండీ!
Ravi గారూ!
Your poem is awe-inspiring. It has a certain depth and eeriness about it. Indeed it deserves to be at the top. I cannot resist from rendering it into English. My countless congratulations to you.
బాగుంది రవి గారు
Chaalaa chalaa baavundi Ravi garu.
Just beautiful!!
మంచి భావుకత ఉన్న కవిత ..రవి గారూ..మీరు తిరిగి వచ్చేటప్పుడు ఏమౌతున్దో కవిత్వ హృదయం వున్నవారు ..అలా ఊహల్లోకి వెళ్లి
ఒక రంగుల వర్ణ చిత్రాన్ని గీసుకుంటారు ..కవితా సౌందర్యం అక్షరాలలో పరిమళిస్తేనే ఇలాంటి కవిత కాస్సేపు ఊపిరిని ఆపుతూ రూపు దిద్దుకుంటుంది .పాత మంత్రాన్నైనా కొత్తగా జపించడానికి ఒక తపన తాపత్రయం కావాలి. ఈ కవిత, దప్పికని కొంత తీర్చగలిగిన తీర్థం
అయినందుకు అభినందనలు.
నెగెటివ్ షేడ్ నుంచి మొదలు పెట్టి , పాజిటివ్ షేడ్ కు కవితను మళ్ళించడం , వ్యూహాత్మకత , భావుకత , చెప్పదలుచుకున్న్న అంశం పట్ల స్పష్టత ముప్పిరిగొన్న శాలిత్యమున్న కవి రవి వీరెల్లి గారు అన్నది ఈ కవిత మరోమారు నిరూపించింది ….
బావుంది రవి! చివరికి సాంత్వన ఇచ్చేది హోం కమింగ్
I second to Manasa.
Beautiful Ravi garu as always.
ఆశలు, ఆశయాలు నేర్పి బతుకు బావుటా మీదకి ఎగరేసిన ఇంటికి, అన్ని గుర్తులూ పెట్టుకుంటూ రావడం ఎంతో ఆనందంతో కూడుకున్న బాధ్యత.
చాలా బాగుంది, రవి. ‘పాదాల అచ్చులు చీరకు కుచ్చుల్లా మెరవడం’ ఎంతో గొప్ప పద-చిత్రం.
నరేన్.
వెళ్తూ వెళ్తూ నువు అద్దిన పాదాల అచ్చులు
దారి చీరకు వెన్నెల కుచ్చుల్లా మెరవడం చూడ్డానికి.. ఎంత అద్భుతమైన ఎక్స్ ప్రెషెన్!
రవిగారు, మీకివే అభినందనలు.
HOMECOMING
——————–
After all the sounds have
curled in their respective nests
I fill my corporeal kamandalam*
with some water of quietude
and walk behind the tiny words planted by you
echoing the old mantra you taught me
In the path where your footprints disappeared
I keep moving till I become invisible to myself
willing even to trail behind the track of your scent
Not due to dislike for the world
Nor with a distaste for sounds
No wish to break the distances either
Neither for discovering you even
Then what for is it?
To see your tiny words turn into sunflowers
To view your fragrance become fireflies
To witness your footprints shimmering
as moonlight frills to the sari* of the path…
All while I’m returning
Yes,
I go away from myself
Only to return.
*** * ***
Translated by: Elanaaga
Published in Episteme, Volume 4, Issue 2