కవిత్వం

ఎవరు వీళ్ళు?!

అక్టోబర్ 2015

కాశాన్ని డేరాలా వేసుకుని
చీకటి పుల్లల చితి మీద రోజుల్ని దహనం చేస్తూ
క్షణాల్ని మొక్కపొత్తుల్లా కాల్చుకుతింటూ
ఎవరు వీళ్ళు?!

ఆత్మల్ని మిణుగురు పురుగుల్లా మెరిపిస్తూ
దారిపొడుగునా పలకరింతల్ని చల్లుతూ
ఎవర్ని ఆకర్షిస్తున్నారు వీళ్ళు?!

ఓ రోజు దైర్యం చేసి దగ్గరికెళ్ళా.

దూరం నుండి చూస్తే ఒక్క గుంపుగా కనిపించే వీళ్ళు
పోశిస్తున్న పాత్రలు మాత్రం ఒక్క కథవి కావు.

ఎవరి కథ వాళ్ళదే!