‘Return Post’
Can you send them back
The lines I said, the words I spilled
In the conversations we had when the world was fast asleep-
till the sun was about to rise.
To you some lines I said
Sounded so poetic
Yet I haven’t saved them
In words or voices.
Nor written them for someone
They came floating on the river of emotions.
Flooded as we poured our hearts
On the ground between us,
Finding themselves in the middle of nowhere while we were looking-
Into the other
Never knew these existed
Till you tapped the unknown zones
Those that have gone to sleep for years
Want to gather and treasure them all
For I would forget surely, what I said to you in the breaks between my breaths.
Neither knows how to contain this divinity
But these words, sentences and feelings….
In those moments
Can you send the lines back
That I said to you.
Because only some bits of last night stayed with me.
***
***
నాకు తెచ్చిస్తావా?
వెన్నెల రాత్రి, ప్రపంచం నిద్రమత్తులో ఉన్నప్పుడు
నేను పారబోసుకున్న ఆ పదాలన్నీ?
నీ ఒడిలో కుప్పబోసిన ఆ పదాలన్నీ?
నువ్వు కవిత్వమని అన్నావే..
అవి కూడా నేను దాచుకోలేదు.
పాటగానో, పల్లవిగానో కూర్చుకోలేదు.
ఇంకెవరికోసమూ వాటిని రాసుకోలేదు.
నీకు తెలుసుగా..
హృదయాలు వర్షించిన రాత్రి,
భావాల ఉధృతిలో తేలివచ్చిన పదాలవి.
నువ్వూ, నేనూ ఒకరిలోకి ఒకరం కొట్టుకుపోతే
శూన్య జలపాతంలోకి దూకిపోయిన పదాలవి.
ఇన్నాళ్ళు
ఈ పదాలెటు వలసపోయిందీ నేను గమనించలేదు.
అనిశ్చితంగా నువ్ కదిలి, అనుకోని స్పర్శని కలిగించేదాకా
ఈ పదాలెక్కడ నిదురకు ఒరిగిందీ
స్ఫురణకు రాలేదు.
ఇప్పుడో! ఆలస్యమవుతుంది;
నన్నంతా పూర్తిగా మర్చిపోకముందే,
శ్వాసశ్వాసకి మధ్య నీతో అన్న పదాలన్నీ
ఒక్కొక్కటిగానే ఏరుకోవాలి
గుండెలో గుట్టుగా పొదువుకోవాలి.
ఈ దివ్యత్వంలో ఎట్లా సంచరించాలో తెలీదు.
కానీ..ఈ పదాలు..ఈ వాక్యాలు.. ఈ భావాలు..
నీతో సహచరించిన సమస్త జ్ఞాపకాలు ..
ఇవన్నింటిలో-
నిన్న రాత్రి తీరిగ్గా ఏరి రాశిపోసిన
గుప్పెడు పదాలు తప్ప నాదగ్గరింకేమీ మిగల్లేదు
ఓయ్. నిన్నే! కొన్నైనా నాకోసం తెచ్చిస్తావా?
Beautiful poem
అమ్మో ఈ దివ్యత్వం లోంచి, ఈ కవితలోంచి ఎలా బయటకు రావాలో నిజంగానే తెలీటంలేదు .
ది ఇంగ్లీష్ పోయెమ్ (ట్రాన్స్లేషన్) ఇస్ సో అండ్ సో బెటర్ ద్యాన్ ది తెలుగు ఒరిజినల్ . బట్ వన్ షుడ్ నాట్ థింక్ దట్ ది ఒరిజినల్ పోయెట్ ఇస్ ఇంటాలెంటెడ్ . ది ఫ్యాక్ట్ ఈస్ దట్ ది ఒరిజినల్ థాట్ ఇస్ ఆఫ్ ది పోయెట్. వి మస్ట్ కాంగ్రాత్యులేట్ ది పోయెట్ శ్రీ నందకిషోర్ యాస్ వెల్ యాస్ “మంజీర” ఫర్ దెఇర్ పొయిటిక్ ఎక్షెల్లెన్స్.
good one
ఒరిజినల్ కవితను రాసిందెవరు, అనువాదం చేసిందెవరు అనే విషయం స్పష్టంగా తెలిసేలా ప్రచురించాలని ఎడిటర్ గారికి ఒక విన్నపం.