కవిత్వం

Why?

నవంబర్ 2016

Why the words lock themselves up when you are with me
But break free to run behind you as you walk past me
Am n’ t I wrong in
Feeling they belong to me
….
While they actually
Trail you
Like clouds carrying the oceans in me!


నిశ్శబ్దమైన పదాల్లో ప్రాణం చేరుతుంది.
నువ్వు పక్కనుండి లేచి వెళ్ళగానే
స్థాణువైన ఊపిరిలో చలనం కలుగుతుంది.
నువ్వు చేయి వదిలి, కొంచెం దూరం
జరగగానే
సముద్రాన్ని దాచుకున్న మేఘం ఒకటి
నా అంతరాళంలో దారితప్పుతుంది.
నువ్వు నడిచిపోయిన తోవకోసం బెంగటిల్లుతుంది