Waves of thoughts
Volcanoes
Disturbed winds
The storm and the sea
I felt all inside me
A few minutes with you
Not about me
Not about you
The voice beneath the words
The words through your voice
When I got up to leave
I found that none existed
The weights I carried into your room
In me.
Weightlessness!
Is not there something more to talk
Someone to discuss
Don’t we have some more things to share. Or
Can you just be with me
Without a word! Or
Vice versa!
1
ఈదురుగాలి
అగ్నిశిఖ
కల్లోల సముద్రం
విరిగిపడే ఆలోచనలు
కెరటకెరటకెరటాలుగా
అన్నీ ఒక్కసారే ఇప్పుడు
నాడుల ఉప్పెనలో…
2
కాసేపన్నా ఉండాలి ఇద్దరం-
నీకోసం కాదు.
నాకోసమూ కాదు.
మాటల్లేని మన సంభాషణ కోసం
దుఃఖాన్ని పాడుకునే చూపులకోసం.
3
ఎట్లా చెప్పాలో తెలీదు-
ఎడబాటుకి ఎదురైతే అర్ధమైంది
శూన్యంలో తీసివేత.
మెరుపుల చుట్టూత కుట్టిన చీకటి.
నీ గదిలో దించుకున్న బరువు
ఇంతకమునుపు నాకెంత తేలికో!
4
ఇంకా ఏం లేదా మాట్లాడటానికి?
ఇంకెవరూ లేరా మనతో వెల్తురు పోగేయడానికి?
నిజంగా ఇంకేమి లేదా మనం పంచుకోడానికి?
పోనీ… నువ్వే ఇంకాసేపుండరాదా?
మాటివ్వకుండా… తీసుకోకుండా…
గుడ్ పోయెం నంద కిషోర్ గారు
బాగున్నది సర్.