కవిత్వం

Into the World

ఆగస్ట్ 2016

Into the World…

You are the window to the world I have long forgotten
And locked myself on the other side
Little did I know that all this existed
In the world I lost myself in
Till you walked in!
To my world
On a random evening that drove us away
Into the world I have long forgotten.

*

Presence!

Stars look beautiful on a No Moon night
The Moon looks beautiful on a Full moon day
And the sky looks beautiful on all the days in between-
But the whole world looks beautiful when you are with me.

*

Few lines slipped…

As I picked the words and made sentences to translate
Who I am
Who you are
What we are
To others and each other
And opened my mouth to speak to you
In whispers
The cold wind blew strong
Through the window
And took them away, but
Few lines slipped…

I sit and collect them all-
Trying to make some meaning out of it!
In vain.


Into the World…

నడిచివచ్చిన తోవ మరిచిపోతాను.
నాదైనలోకంలో మునిగిపోతాను.
కిటికీ రెక్కలు నేనే మూసి
చీకటిగుహలోకి జారుకుంటాను.

అరుణిమ చిందే లేత సాయంత్రం
లోపలి నువ్వు తెరుచుకుంటావు.
లోతుగా నన్ను తెలుసుకుంటావు.
అణువణువులో మెలకువ నింపి
అనంతవిశ్వంలో ఎగరవేస్తావు.

*

‘Presence’

కొమ్మలనిండా చుక్కలు పూసేది అమావాస్య
ఆకురాలినట్టు వెన్నెల రాలితే పౌర్ణమి
ఆకాశమంతా అరణ్యంగా మారిపోయి
నీతో సహచరిస్తోంది ..ఓ సీతాకోక!

*

Few lines slipped…

నేనెవరనేది నువ్వెవరనేది
చెప్పాలనుకున్నాను
పదాలు ఏరి మనం ఏమయేది
ఇతరులకి ఏంటనేది
మృదువైన భాషలోకి
అనువదించాలని చూసాను.

ఒక సుదూరంలో
పెదవి విప్పి గుసగుసగా
మాట కలుపు తరుణంలో
హఠాత్తుగా ఒక పిల్లగాలి
కిటికినీ దాటుకుని దూసుకొచ్చింది
ఇద్దరిమధ్యలో వీచిపోయింది
విలువైన పదాల్ని ఎత్తుకెళ్ళింది

మిగిలిన పదాలు ఏరి వాక్యం చేస్తే
ఒక అర్ధం
ఎప్పటికైనా వస్తుందంటావా?