When I Am with You
నువ్వు నేను కలిసామంటే
రాత్రంతా నిద్రరాదు.
చిత్రం!
నువ్వు రాని రాత్రి
ఎందుకో నిద్రకూడా రానేరాదు.
నిదురపోనివ్వని ఆనందాన్ని
సృష్టించినవాన్ని ఏమని కొలవను?
No better love
కారణమడగని ప్రేమకంటే
గొప్పదేది లేదు.
ప్రణాళికలేని పనికంటే
తృప్తినిచ్చేదీ లేదు.
ఇష్టంగా
ఒక మాట చెప్పనా?
తెలివినీ ఆలోచన్నీ వదిలెయ్యడంకంటే
తెలివైన ఆలోచన ఇంకోటి లేదు.
మూలం: రూమి
అనువాదం: నందకిషోర్
అనువాదపు కవితల్లా కాకుంండా
సహజంంగా…స్వచ్ఛంంగా ఉన్నాయి మిత్రమా