తిరిగి దొరకడానిక్కాక వెతికించుకోవడానికే
తప్పిపోయిన ఒక పద్యంకోసం
రోజులతరబడీ, రాత్రులవెంబడీ
ఆకలీ ఆహారమూ తనకు తనే అయి
రాసుకున్నాడేవో కొన్ని సౌందర్యోన్మత్త గీతాల్ని…
కిటికీ అంచులు ఏటవాలు నీడల్ని ఇంటిగోడలపైకి జారవిడుస్తూ
ఏకాంతంలో బద్ధకంగా చల్లుకున్న దిగులు గింజల చుట్టూ
బూడిదరంగు పావురాలు రెక్కలు ముడుస్తూ తెరుస్తూ మసలినప్పుడు
పాదాక్రాంతమయ్యాడు ఆ మచ్చికైన హేమంతపు సాయంత్రాలకి…
పగడపు గోరింట పాదాలు ఇసుకలో గీసిన ఇంద్రధనస్సుని
తాడుపైన గారడీలాంటి చూపులతో కౌగిలించబోయి
అగ్గిపుల్లని చూసి అణువణువూ జలదరించిన అగ్ని పర్వతంలా
చర్రున వెనుతిరిగాడు అక్కడొక మల్లెల మంటను రాజేస్తూ…
జీవన్మరణాలు చెరిసగాలైన ఒకానొక లిప్తలో
నిద్రకు అలసటనీ, నిజాలకు ఆశల్నీ ధారపోసి
చిట్టచివరి పడవకు తెరచాపనెత్తుతున్నప్పటి ఒడ్డులా
ఒంటరిగా,
ఒక్కడుగా,
ఉండుండీ ఉప్పెనగా,
బావురుమన్నాడేవో గాజుపూల పగుళ్లని గుండెలోపలికి అదుముకుంటూ…
welcome back!
- స్వాతికుమారి బండ్లమూడి
చాలా కాలం తర్వాత మీ కవితను చదివాను – అభినందనలు
అద్భుతమైన భావం, అచ్చెరువొందే ఇమేజరీ, ఒక మిస్టిక్ ఆరా వెదజల్లే కవిత్వం.
చాలా రోజుల తరువాత మంచి కవిత చదివిన అనుభూతి…
అంతర్ముఖుడినై తొంగి చూసుకున్న…
నమస్సుమాంజలులు…
yentha baagundo swathi gaaru !
good one!
అగ్గిపుల్లని చూసి అణువణువూ జలదరించిన అగ్ని పర్వతంలా
జీవన్మరణాలు చెరిసగాలైన ఒకానొక లిప్తలో
నిద్రకు అలసటనీ, నిజాలకు ఆశల్నీ ధారపోసి
స్వాతిగారు! కవిత చాలా బావుంది.
Wow! So dense!
Thanks for writing
“….
నిద్రకు అలసటనీ, నిజాలకు ఆశల్నీ ధారపోసి
చిట్టచివరి పడవకు తెరచాపనెత్తుతున్నప్పటి ఒడ్డులా
ఒంటరిగా,
ఒక్కడుగా,
ఉండుండీ ఉప్పెనగా,….”
చదవడం పూర్తవగానే ఒక గాఢమైన నిట్టూర్పు.. అప్రయత్నంగానే!
We missed you, Swathi!! చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కవితల్లో మిమ్మల్ని చూస్తుంటే! ఇంతకుముందోసారి చెప్పినట్టున్నాను.. మీ కవితలెంత ఇష్టమో మీరు వాటికి పెట్టే పేర్లన్నా అంతే నచ్చుతాయి నాకు!
ఇకనించీ ఈ సెక్షన్లో తరచుగా కనిపిస్తారు కదా!?
wonderful imegery
good poem